ఇంటి పెరట్లో కూరగాయలు..ఆకు కూరలు పండించుకునే వారు పర్యావరణ పరిరక్షకులు కూడా..చాలా మంది ఇంటిదగ్గరే ఆకు కూరలు, కూరగాయలు పండించుకోవాలనుకుంటారు అయితే పండించుకోవడానికి స్థలం లేదని వాపోతుంటారు. నగరాల్లో అయితే అపార్ట్ మెంట్ లో జనసంచారానికే స్థలం ఉండదు...మరి మొక్కల ఎక్కడ పెంచుతామం అంటారా..? సులభంగా పెంచుకోవచ్చు ఎలా అంటారా? అపార్ట్ మెంట్ బాల్కనీలో, పాత వాటర్ టిన్నులో, పాలిథిన్ సంచుల్లో, తక్కువ స్థలంలో ర్యాక్ లలో..చిన్న ట్రేలో మెంతి కూర, కొత్తిమీర, పుదీనా సాగు
మొక్కలు పెంచుకోవడం లో ఇంట్లో ఏ ఒక్కరికి శ్రద్ద ఉన్నా సరి పెరట్లో పచ్చదం అలరాడాల్సిందే.. ఇష్టమైన పని కష్టం తేలికగా చేసేసుకోవచ్చు. కిచెన్ గార్డెన్ పెంపకం కూడా అంతే..! ఇష్టం..సాధించాలన్న పట్టుదల ఉంటే.. పాత ప్లాస్టిక్ డబ్బానో కుండీగా మార్చేయవచ్చు.పెట్రోలు ధరలు, కూరగాయల ధరలు మండిపోతున్న ఈ రోజుల్లో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవడం ఎంత అవసరమో తెలియనిది కాదు. భారీ ప్రణాళికలు, భారీ ఖర్చు అవసరం లేదు. ఏదో ఒక పాత డబ్బా, పాత బక్కెట్.. మట్టిదో సిమెంటుదో కుండీ చూసుకొని కొంచెం మట్టిలో కొంచెం కంపోస్టు, కొద్దిగా ఇసుక కలిపి పోసి నాలుగు విత్తనాలు చల్లండి.. చాలు.. మీ ఇంట్లో కిచెన్ గార్డెన్ ప్రారంభమైనట్టే..! ఇలా ఉన్నంతలో కిచెన్ గార్డెన్ ను ముందు ప్రారంభిస్తే.. ఆ రుచి తెలిస్తే.. తర్వాత కిచెన్ గార్డెన్ ను మరింత విస్తృతం చేసుకోవచ్చు.
గ్రిల్స్‌కు వేలాడుతూ పచ్చని మారాకులు వేస్తూ మొక్కలు ఎదుగుతుంటే మనసుకు ఎంత హాయిగా ఉంటుంది. అయితే ఎండ బొత్తిగా తగలకపోతే ఆకు కూరలు, కూరగాయల మొక్కల్లో పెరుగుదల మందగిస్తుంది. నీడగా ఉంటే క్యారట్, ఉల్లి, అల్లం వంటి దుంపజాతి మొక్కలు బాగానే పెరుగుతాయి.
కుండీల్లో..అనేక రకాల కుండీల్లో కూరగాయల మొక్కలు పెంచుకోవచ్చు. సిమెంట్ కుండీలు, మట్టి కుండీలు, అడుగు చిల్లు పడిన లేదా పగిలిన బక్కెట్, క్యాన్, ప్లాస్టిక్ జార్లు, డ్రమ్ములు.. వేటినైనా కుండీలుగా మార్చి విత్తనాలు వేసుకోవచ్చు...

No comments:
Post a Comment