అసలు పిల్లలు ఎందుకు అబద్ధాలు చెపుతారు?
మీ పిల్లాడు చిన్నవయసు వాడు కాబట్టి సిల్లిగాఆడేస్తున్నాడు అనుకుంటే అది సరికాదు. పిల్లలు మీకంటే తెలివైనవారు. వారు ఏం మాట్లాడుతునన్నారనేది వారికి ఖచ్చితంగా తెలుసు. అబద్ధాలు చెపటమనేది ఒక అలవాటు. దానికి వయసుతో సంబంధం లేదు. అది మీ పిల్లాడి స్వభావాన్ని, వ్యక్తిత్వాన్ని తెలుపుతూంటుంది. మీ విశ్లేషణ మీ పిల్లాడు ఏ రకమైన అబద్ధాలు చెపుతున్నాడనేదానిపై ఆధారపడి వుంటుంది.
ఒక్కొక్కపుడు పిల్లలు నిజం చెప్పటానికి భయపడతారు. వారు ఏదైనా తప్పు చేశామనుకుంటే, వారు దండించబడతారనుకుంటే, అందుకు భయపడి అబద్ధం చెప్పేస్తారు. ఉదాహరణగా...మీ కిష్టమైన నెయిల్ పాలిష్ బాటిల్ ఆటలో ఒలక పోశారు, లేదా ముఖ్యమైన పత్రాలు పాడుచేశారు ఇక వారికి దండన తప్పదని భావించి చేయలేదని అబద్ధం చెప్పేస్తారు. అయితే, తప్పు చేశామన్న భావన వారి ముఖాలలో మీరు తప్పక చూడవచ్చు.
సరే, ఇక కారణం తెలిసింది. అయితే మీరు అంతటితో వదిలేయకండి. చిన్నపాటి శోధన చేయాలి. ఇది వారిపట్ల మీరు కఠినంగా వున్నారని శిక్షిస్తారని వారికి తెలుస్తుంది. సరైన కారణాలు లేకుండా మీ బిడ్డ అబధ్ధమాడేస్తూంటే, అతనికి అసలు భయం లేదన్నమాట. స్కూల్లో ఏం చేశావ్ అని మీరడిగితే, వేరే గ్రహం నుండి ఒక వ్యక్తి వచ్చాడని వాడు అక్కడ తిరుగుతుంటే చూశానని అతను చెపుతే, వాడి ఊహాగానాలు కధలుగా మీకు చెప్పేస్తున్నాడన్నమాట. అది పూర్తి అబద్ధమని మీకు కూడా తెలుసు.
మరి ఇక మీ పిల్లాడు ఇదే విధంగా పెద్దవాడైన తర్వాత కూడా కధలు చెపుతూంటే ఇక అబద్ధాలాడటానికి అలవాటు పడిపోయాడన్నమాటే. అనవసరమైన విషయాలకు కూడా అతడికి ఎల్లపుడూ నోటివెంట అబద్ధాలు తప్పనిసరిగా వచ్చేస్తూనే వుంటాయి. ఈ తప్పని సరి అబద్ధాలను లేదా అనవసర అబద్ధాలను మాన్పించటానికి మీ పిల్లాడికి....కధలు చెపటం మంచిదే కాని ప్రశ్న అడిగినపుడు సరి అయిన సమాధానం ఇవ్వటం చేయాలని వివరించాలి. ఊహలతో కధలు చెపటానికి వాస్తవానికి తేడా వుంటుందనేది వాడికి వివరించి చెప్పాలి. పిల్లలు ఎందుకు అబద్ధమాడతారనేది ఇక మీకు తెలుసుగనుక, వారిని సరిదిద్దటంలో తేలికగా వ్యవహరించండి. ఇప్పటికే మీ పిల్లాడు అబద్ధాలకు అలవాటు పడినప్పటికి వారి అబద్ధాలను మాన్పించటం తేలికే. పిల్లల దశలో మీరు వారికి క్రమశిక్షణతో అన్ని నేర్పిస్తూ వుంటే, వారు కొంత కొష్టమైనప్పటికి తప్పక తమ ప్రవర్తనను సరిచేసుకుంటారు. కనుక వారు చిన్నగా వున్నపుడే, వారిని సదిదిద్దండి.
No comments:
Post a Comment