భు‘వన భోజనాల’ కార్తీక పున్నమి
కార్తీక పూర్ణిమ నాడు శివలింగాన్ని జ్యోతిర్లింగంగా ఆరాధిస్తే సర్వపాప నివృత్తి. సర్వ శుభప్రాప్తి కలుగుతుందని కార్తీకమాహాత్మ్యం తెలియచేస్తుంది.
లింగదానం పౌర్ణమాస్యాం కార్తిక్యాం శివతుష్టయే
ఇహసమ్యక్ ఫలం ప్రాప్య సార్వభౌమా భవేత్ ధ్రువవ్గు
య: కూర్య ద్దీపదానంచ పౌర్ణమ్యాం కారీే్తక నఘ
సర్వపాప వినిర్ముక్త స్తతోయాతి పరాంగతివ్గు
ఇచ్చట లింగ, దీపదానమంటే భూమిని శుద్ధిచేసి శివలింగాన్ని చిత్రించి దీపాలతో అర్చించడమనే అర్థం. గోపురద్వార శిఖరే లింగాగ్రే కార్తీక్యావ్గు అర్పయేద్ దీపవ్గు అనే మాటను బట్టి శివ లింగార్చన శ్రేష్ఠమని తెలుస్తోంది. దీపతో లభతే విద్యాం దీపదో లభతే శ్రుతవ్గు దీపతో లభతే చాయు: దీపతే దివవ్గు అనే ప్రమాణాన్ని బట్టి కార్తీక మాసంలో దీప దానం వలన విద్యా, జ్ఞానం ఆయుష్షూ, సుఖం స్వర్గం అన్ని లభిస్తాయని తెలుస్తోంది. ప్రస్తుతం మన ధర్మం, సంస్కృతి సంప్రదాయాల పట్ల అంతగా అవగాహన ఉండడం లేదు. ధన, ఉద్యోగ, సుఖ, స్వార్థ కామాలతో విదేశీ వ్యామోహంతో మాతృభూమి, తల్లితండ్రులు, గురువులపై విశ్వాసం తగ్గి పోతుంది. నానాటికీ అడుగంటుతున్న మన సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించేందుకు ప్రతివారూ ఉద్యమించాలి.

వనభోజనాల సందడి
న కార్తీక మాసమో మాసః
నదేవః కేశవాత్పరమ్
నచ వేదసమం శాస్త్రం
న తీర్థం గంగాయస్సమమ్
కార్తీక మాసంనకు సమానమైన మాసం లేదు. కేశవుడితో సమానమైన దేవుడూ లేదు. వేదంతో సమానమైన శాస్తమ్రూ లేదు. గంగతో సమానమైన తీర్థము లేదంటారు. ఈ విధంగా పరమపావనమైన కార్తీకమాసం శివకేశవులకు ప్రీతికరమైన మాసం. జన్మజన్మల పాపములను పటాపంచలు చేసి మానవుడికి మోక్షం కలిగిచే మాసంగా ప్రసిద్ధి చెందిన కార్తీకమాసంలో చేసే స్నాన, పూజ, జపాదులు, దానం, దీప దానం, వనభోజనాలు వంటివి విశేష ఫలితాలనిస్తాయని శాస్తవ్రచనం. వీటన్నింటిలో ఆధ్యాత్మిక ఫలితాలతో పాటు సామాజిక ఏకత్వాన్ని, మానసికోల్లాసాన్ని ప్రశాంతతను ప్రసాదించేవి ‘వనభోజనాలు’.మారుతున్న సంస్కృతి, సామాజిక పరిస్థితులు, హడావిడిగా మారిన నగర జీవనాల మధ్య ’’వనభోజనాలు’’ వంటి ఆచారాలు మరిచిపోతూ ఉన్నా ఇప్పటికీ అక్కడక్కడ మన రాష్ట్రంలో కనిపిస్తూ ఉండడం సంతోషకరం.
అంతకంటే ముందుగా ఉసిరిక చెట్టునూ, ఉసిరిక చెట్టుక్రింద సాలగ్రామాన్ని గానీ, శ్రీ మహావిష్ణువు పటాన్ని గానీ ఉంచి పూజించి నైవేద్యం సమర్పించాలి. గంధం, కుంకుమతో ఉసిరికచెట్టును అలంకరించి ఈ 21 నామాలతో పుష్పపూజ చేయవలెను.
ఓం శ్రీ ధాత్య్రైనమః, ఓం శ్రీ శాంత్యైనమః, ఓం శ్రీ మేధాయైనమః, ఓం శ్రీకాంత్యైనమః, ఓం శ్రీ ప్రకృత్యై నమః, ఓం శ్రీ విష్ణుపత్న్యై నమః, ఓం శ్రీమహాలక్షై్మ నమః, ఓం శ్రీ రమాయై నమః, ఓం శ్రీ కమలాయై నమః, ఓం శ్రీ ఇందిరాయై నమః, ఓం శ్రీ కల్యాణై్య నమః, ఓం శ్రీ కమనీయాయై నమః, ఓం శ్రీ సావిత్యై నమః, ఓం శ్రీ జగద్దాత్రే నమః, ఓం శ్రీ గాయత్య్రై నమః, ఓం శ్రీ సుధాత్య్రై నమః, ఓం శ్రీ అవ్యక్తాయై నమః, ఓం శ్రీ విశ్వరూపాయై నమః, ఓం శ్రీ సురుపాయై నమః, ఓం శ్రీ అబ్ధిభవాయై నమః, ఓం శ్రీ లోకమాత్రే నమః అనే నామాలను పఠిస్తూ పూజించిన అనంతరం
ధాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాపక్షయంకరి
పుత్రాన్ దేహి మహాప్రాజ్ఞా యశోదేహి బలంచమే
ప్రజ్ఞాం మేధాంచ సౌభాగ్యం విష్ణుభక్తించ శాశ్వతీం
నిరోగం కురుమాం నిత్యం నిష్టాపం కురుసర్వదా
ఎసిడిటి నివారణలోనూ వివిధ చ్యవన్ ప్రాశల తయారిలోనూ ఉసిరికను ఉపయోగిస్తారు. ఉసిరిక ఊరగాయ తో ప్రతి రోజూ ఒక ముద్ద అన్నం తిన్నట్లయితే ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆయుర్వేద శాస్త్రం వక్కాణి స్తోంది. అటువంటి దివ్య ఔషధగుణాలు కలిగిన ఉసిరిక చెట్టును పూజించడం, దాని క్రింద కూర్చుని భోజనం చేయడం వల్ల ఆ సమయంలో ఉసిరిక గాలిని పీల్చడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని చెప్పబడుతూ ఉంది. ఇలా వనభోజనాల వల్ల ఆధ్యాత్మిక ఫలితాలతో పాటూ ఆరోగ్యం కూడా సిద్ధిస్తుంది.
No comments:
Post a Comment