తల్లి తండ్రులందరూ తమ పిల్లలకు క్రమశిక్షణ నివ్వటం తమ భాధ్యతగా గుర్తిస్తారు. అయితే, చాలామంది తల్లితండ్రులు తమ పిల్లలకు ఏ వయసు నుండి ఈ డిసిప్లిన్ నేర్పాలి? ఎపుడైతే అది వారికి బాగా వంటబడుతుంది అని ఆలోచిస్తూంటారు. ఒక పాత సామెత మేరకు బిడ్డకు మొదటి అయిదేళ్ళవరకు గారాబం చేయండి. తర్వాతి పది సంవత్సరాల వరకు అతనిపై పట్టు కలిగి ఉండండి, కఠినంగా వ్యవహరించండి.
ఇక పిల్లాడికి 16 సంవత్సరాలు వచ్చాయంటే, అతడు లేదా ఆమెను మీకు సమానంగా లేదా ఒక స్నేహితుడిగా అతనితో వ్యవహరించండి అని అంటారు.మరి ఇదే రకంగా, ఎంతో కాలంనుండి మన భారతీయ తల్లితండ్రులు వారి పిల్లలను ఇదే విధంగా క్రమశిక్షణలో పెడుతున్నారు. అయితే, తాజాగా నేటి పరిస్ధితులలో పిల్లల సైకాలజిస్టులు ఈ పాతకాలం అలవాటుకు కొన్ని మార్పులు చేశారు. మరి ఆమార్పులేమిటో గమనించండి.
ఏ వయసులో పిల్లవాడికి క్రమశిక్షణ మొదలు పెట్టాలి?
క్రమశిక్షణకు ఒక వయసంటూ లేదు. ఆధునిక పెంపకం పాత సిద్ధాంతాలను వ్యతిరేకిస్తుంది. పిల్లాడిని శిశువు దశనుండే క్రమశిక్షణలో పెట్టాలంటుంది. నేటి బిడ్డలు పాత కాలం రోజులకంటే కూడా ఎంతో తెలివి కలిగి ఉంటున్నారు. బేబీలకు 6 నెలలు వచ్చేస్తే చాలు, వారికి చాలా విషయాలు తెలిసిపోతున్నాయి.
త్వరగా మొదలు పెట్టండి - పైన చెప్పినట్లు మీ బిడ్డను క్రమశిక్షణ లో పెట్టాలంటే, ఒక సంవత్సరంలోపునుండే మొదలు పెట్టండి. వారికి 8 లేదా 9 నెలలు వచ్చాయంటే చాలు, మిమ్మల్ని మరిపించేస్తారు. మిమ్మల్ని ఆనంద పరుస్తూనే ఎన్నో అల్లరి పనులు చేసి క్రమశిక్షణ లేకుండా పెరుగుతారు.
శిక్షణకు చిన్నవయసని భావిస్తున్నారా?చాలామంది తమ బిడ్డ చిన్నవాడని, శిక్షణకు, శిక్షకు తగడని అర్ధం లేదు. మీరు చేయవలసిందల్లా వారికి ఏది తప్పు లేదా ఏది రైట్ అనేది తెలియచేస్తూ ఉండాలి.
అవసరంమేరకు కొంత ఒత్తిడినివ్వండి. పిల్లలకు కొంతవరకు కొట్టి కేకలేసి క్రమశిక్షణ నేర్పాలని మనం అందరం భావిస్తూనే ఉంటాము. వాస్తవానికి అది అంత తేలికైన విషయం కాదు. కాని అది మీరు భావించినంత తేలిక కాదు. తరచుగా కొడుతూ ఉన్నా, కేకలు పెట్టినా పిల్లలు వాటికి అలవాటు పడి తమ పని తాము కొనసాగిస్తారు. కనుక పిల్లలను శారీరకంగా హింసించవద్దు. కంటి చూపుతో భయపెడుతూండాలి.
అతని అవసరాలు, కోరికలు గమనించండి. చాలామంది తల్లితండ్రులకు ఇది సమస్యగా ఉంటుంది. కాని బిడ్డ ప్రయోజనాలకై తప్పదు. ఒక 3 సంవత్సరాల పిల్లవాడికి మీ ఒడిలో నిద్రించాలని ఉంటుంది. అటువంటపుడు మీరు అతని అవసరం ఏమిటి? కోరిక ఎలా ఉంటుంది వంటివి గ్రహించాలి. అతను మీ ఒడిలోనే బాగా నిద్రించే విధంగా ఉంటాడు. అవసరమనుకుంటే మీరు ఈ పని తప్పక చేయాలి. అయితే దానికి అతను అలవాటు పడితే మీరు దానిని నియంత్రించాలి. అది అన్నివేళలా మీకు సాధ్యం కాకపోవచ్చు.
కనుక పిల్లల క్రమశిక్షణ పెద్ద అంశం కాకపోయినప్పటికి, వివిధ వయసుల పిల్లలను సమర్ధవంతంగా క్రమశిక్షణ నేర్పాలి అంటే, తల్లి తండ్రులు ఈ చిట్కాలు ఆచరించక తప్పదు.

No comments:
Post a Comment