all

Thursday, November 22, 2012

స్వార్థం తగదు!-kids story

అనగనగా ఓ అడవి. ఆ ఆడవిలో ఓ కుందేలు, నక్క, మొసలి ఎంతో స్నేహంగా ఉండేవి. భోజన సమయానికి వేటి దారి అవి చూసుకునేవి. ఇలా చాలారోజులుగా స్నేహంగా ఉంటున్నాయి.


   

ఒకరోజు పిచ్చాపాటీ మాటల సందర్భంలో కుందేలు ఒక వింత ప్రతిపాదన చేసింది. మనం సమయంవృథా చేస్తున్నాం. మనకంటే చిన్న జంతువులు, బలహీన జంతువులను భయపెట్టేకంటే వాటికి కొద్దిగా ఆహారం తెచ్చిపెట్టడం మంచిది అంది కుందేలు. ఎంతో ఆలోచించి నక్క కూడా, ఇది మంచి ఆలోచనే అని అంగీకరించింది. వెంటనే మొసలి, తాను చేపలు పట్టి తెస్తానంది. నక్క తనకు తోచింది తేవాలనుకుంది. కుందేలు... తాను చిన్న జంతువు కనుక ఏమీ తేలేననుకుంది.

మర్నాడు... చేపలు తెచ్చి చెట్టుకింద పడేసింది మొసలి. నక్క దొంగతనంగా ఓ మామిడిపండు తెచ్చింది. తాను ఏదో ఒకటి తేవాలని గడ్డిమొక్కల్లో అక్కడా ఇక్కడా తిరిగి కుందేలు ఏమీ తేలేకపోయింది. ‘‘నేనేమీ తేలేకపోయాను కనుక నేనే ఆహారం అవుతాను’’ అంది కుందేలు. మొసలి ఆశ్చర్యపోయింది. నక్క సంతోషించింది. పైన దేవుడు మరీ ఆశ్చర్యపోయాడు.
అంతలో ఒక సన్యాసి అటుగా వచ్చి, కుందేలు బాధపడటం చూశాడు. దగ్గరకు వెళ్లి ‘‘నువ్వు చాలా పెద్ద మనసున్నదానివి.

నీ త్యాగం ఊరికినేపోదు. నాకు బాగా ఆకలిగా ఉంది. ఏదైనా పెడతావా!’’ అని అడిగాడు. కుందేలు వెంటనే చెట్టు ఎక్కి కింద ఉన్న పెద్ద బండరాయి మీద పడింది. ప్రాణాలు పోలేదు కానీ కాలికి దెబ్బతగిలింది. మొసలి బాధపడింది. నక్క నవ్వుకుంది.
సన్యాసి తన వస్త్రం నుంచి చిన్నముక్కను చింపి కుందేలు కాలికి కట్టుకట్టాడు. ఇంకెపుడూ ప్రాణత్యాగానికి సాహసించవద్దని దాన్ని ముద్దాడి వెళ్లిపోయాడు.

No comments: