all

Thursday, November 22, 2012

శక్తినిచ్చే ఆహారాలు ప్రొటీన్స్

మనుషులు ఆరోగ్యంగా ఉండాలంటే వారు తీసుకునే ఆహారంలో పోషక పదార్థాలు తగిన పాళ్లలో ఉండాలి. శరీరానికి కావలసిన శక్తినివ్వటంలో, శరీర పెరుగుదలలో ముఖ్యపాత్ర పోషించే పదార్థాలను పోషకాలు అంటారు. మానవుడు రోజూ తీసుకొనే ఆహారంలో తప్పనిసరిగా కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్, ఫ్యాట్స్, మినరల్స్, విటమిన్లు, పోషక పదార్థాలు ఉండాలి. అన్ని పదార్థాలు సమపాళ్లలో ఉండే ఆహారాన్ని సమతుల ఆహారం అంటారు.
what types foods give you protein

కార్బోహైడ్రేట్స్, ప్రోటిన్స్, ఫ్యాట్స్ (కొవ్వులు) అధిక మొత్తంలో శరీరానికి అవసరం, కాబట్టి వీటిని స్థూలపోషకాలు అంటారు. న్యూట్రిషన్ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒక రోజు తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటిన్స్, ఫ్యాట్స్ నిష్పత్తి 60:15:25 ఉండాలి. మానవుడి శరీరానికి విటమిన్స్, మినరల్స్ తక్కువ మొత్తంలో అవసరం కాబట్టి వీటిని సూక్ష్మపోషకాలు అంటారు. గుడ్లు, పాలు, వెన్న, చికెన్, చేపలు, మాంసం, పప్పు ధాన్యాలలో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. పిల్లల ఆహారంలో ఇవి కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి.

No comments: