all

Thursday, November 22, 2012

మీ పిల్లవాడు దొంగతనాలు చేస్తున్నాడా?

మీ పిల్లవాడు ఇంటిలో దొంగతనాలు మొదలుపెట్టాడా? చాలామంది తమ పిల్లలలో కల ఈ చెడు అలవాటు ఫిర్యాదు చేస్తారు. ఇదేమీ విచిత్రం కాదు. చాలామంది పిల్లలు ఇంటిలో డబ్బులు, వంటగదిలో తినే ఆహారాలు వంటివి దొంగిలిస్తూనే వుంటారు. తల్లితండ్రులు తమ చిన్నారులకు పాకెట్ మనీ వంటివి సరిగా ఇవ్వకపోతే, ఈ రకమైన గుణం వారిలో ఏర్పడుతుంది. దీనినే క్లెప్టోమానియా అని కూడా పిలుస్తారు. అంటే, అది ఎంత విలువలేని వస్తువైనప్పటికి దొంగిలించేస్తారు. ఇది మెదడు సరిగా పనిచేయకపోవటంగా గుర్తించారు. వారికి లాభం లేకుండానే దొంగిలించాలని అనిపిస్తుంది. పట్టుపడితే, వారు అసలు ఎందుకు దొంగిలించామనే కారణం కూడా చెప్పలేరు.


Does Your Kid Steal Things

ఈ చిన్న తరహా నేరాలు చేసే క్లెప్టోమానియక్ లు సాధారణంగా ధనిక వర్గ కుటుంబాలనుండి వస్తారు. దానికి కారణం వారి తల్లితండ్రులనుండి వారికి తగిన శ్రధ్ధ లభించకపోవటం. ఈ పిల్లలు, చాక్లెట్లు, పెన్సిల్స్, బొమ్మలు మొదలైనవాటితో మొదలుపెట్టి, డబ్బుల వరకు వచ్చేస్తారు. తల్లితండ్రులిద్దరూ ఉద్యోగస్తులైతే, సరైన శ్రధ్ధ వారిపై వుండదు. అందుకు కూడా వారు ఇలా తయారవుతారు.
ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలున్న కుటుంబంలో, ఒక పిల్లవాడు తన తల్లితండ్రులు తనపై సరిగా శ్రద్ధ చూపటంలేదని కూడా ఈ అలవాటుకు పాల్పడతాడు. కనుక సానుభూతి కారణంగా, తమకు ప్రేమ చూపాలనే అంశంగా వీరు ఈ నేరాలు చేస్తారు. మరి కొందరు స్నేహితుల ప్రభావంచేత కూడా ఈ నేరాలు చేస్తారు. మరి ఈ అలవాటును మాన్పించటం ఎలా? పిల్లవాడితో మెల్లగా చర్చించండి ఈ చెడు అలవాటుకు కారణం తెలుసుకోండి.
మీరు ఎంత బిజీ అయినప్పటికి మీ ప్రేమను అందరికి పంచండి. పిల్లలకు తెలియజెప్పండి. వారి టెలిఫోన్ లేదా ఇంటర్నెట్ అవసరాలు గ్రహించండి. సరైన స్నేహితుల ఎంపికలో సహకరించండి. పాకెట్ మనీ అధికంగా చిన్నవయసులోనే ఇవ్వకండి. పాకెట్ మనీ ఇస్తే సమస్య పరిష్కరించబడుతుందని భావించకండి. అది మరింత చెడిపోయే అవకాశం వుంది. అవసరపడితే నిపుణుల సలహా పొందండి.

No comments: