all

Thursday, November 22, 2012

పిల్లల లంచ్ బాక్స్ కు ఏమి ఇస్తున్నారు...?

ప్రస్తుత యాంత్రిక యుగంలో జీవితం బిజీ.. బిజీగా సాగిపోతోంది. ఈ బిజీ లైఫ్‌లో పిల్లలకు ఎలాంటి ఆహారాన్ని అందివ్వాలన్న విషయాన్ని కూడా చాలా మంది పేరెంట్స్‌ పట్టించుకోవడం లేదు. ఎవరి బిజీ వారిది. పిల్లలకు తినేందుకు డబ్బులిచ్చేశాంలే ఇక వాళ్ళే ఆకలైతే ఏదోఒకటి తింటారులే అనుకొంటుంటారు. కానీ, ఇది సరైన పద్ధతి కాదు. ఇలా చేయడం వల్ల వారికి తగినంత పౌష్టికాహారం అందదు. వారి లంచ్ బాక్సుల్లో ఎలాంటి ఆహారం పెట్టాలి? ఎలాంటి స్నాక్స్ ఇవ్వాలి? అనే అంశాలపై జాతీయ పోషకాహార నిపుణులు ఈ క్రింద తెలిపిన సూచనలు పాటిస్తే మంచిదని చెబుతున్నారు.
1. పిల్లలు నిత్యం చురుకుగా ఉంటూ చదువులో రాణించాలంటే వారికి ప్రతీ నాలుగు గంటలకు ఓ సారి సమతులమైన, పుష్టినిచ్చే ఆహారం తప్పనిసరి అందించాలి.
2. కూల్‌ డ్రింక్స్‌ తో పాటు బిస్కెట్లు, చాక్లెట్లు వదిలేయాలి.
3. ఇంటిల్లిపాదీ తినే ఆహారపదార్థాల్లో ఉప్పు వినియోగాన్ని తగ్గించి, పిల్లల ఆహారంలో పప్పు వినియోగాన్ని పెంచాలి.
4. స్కూలు దగ్గర ఏదో ఒకటి కొని తినే వారి కంటే ఇంట్లో ఉదయాన్నే అల్పాహారం తిన్న పిల్లలు చదువులో రాణిస్తున్నారని పరిశోధనల్లో తేలింది.
Is It Bakery Food Good Children

5. పిల్లల ఆసక్తిని బట్టి వారికి ఇష్టమైన ఆహారపదార్థాలనే పుష్టినిచ్చే ఆకుకూరలు, కూరగాయలతో కలిపి వండి పెట్టవచ్చు. ఉదాహరణకు కొంతమంది పిల్లలు దోసెలంటే ఇష్టపడతారు. అలాంటి వారికి పాలకూర, తోటకూర, మెంతికూర లాంటి పలురకాల ఆకుకూరలు కలిపి గ్రైండ్ చేసి దోసెలు వేయవచ్చు. లేకుంటే చట్నీలోనూ ఆకుకూరలు కలిపి చేయవచ్చు. దీనివల్ల పిల్లలకు పౌష్టికాహారం అందుతుంది.
6. క్యారెట్, బఠానీలు, బీన్స్‌ లతో ఫ్రైడ్‌రైస్ చేసి లంచ్‌బాక్సులో పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు.
7. క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీలు, బీట్‌ రూట్‌ లను చిన్నచిన్న ముక్కలు చేసి ఇడ్లీల్లో కలిపితే పోషక పదార్థాలు పిల్లలకు అందుతాయి.
8. చాక్లెట్లకు ప్రత్యామ్నాయంగా పల్లీలతో చేసిన ఉండలు, చిక్కీలు, నువ్వులు, బెల్లంతో చేసిన ఉండలు పెట్టండి. ఇంటికొచ్చాక పిల్లలకు శనగలు, పల్లీలు, బఠానీలు గుప్పెడు ఇవ్వాలి.
9. అన్నం, పంచదార, ఎగ్‌ లతో పుడ్డింగ్ చేసి పెడితే పెరిగే పిల్లలకు మంచిది.
10. మురుకులైనా ఏ పిండి వంటలైనా ఇంట్లో చేసుకోవాలి తప్ప, సూపర్‌ మార్కెట్, బజార్‌ లలో దొరికే పదార్థాలను పిల్లలకు పెట్టవద్దని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

No comments: