1. తరచూ ఆహారంలో పాలకూర తీసుకొంటే శరీరానికి కావలసిన ఐరన్ పుష్కలంగా లభించడంతో పాటు పలు ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.
2. రోజంతా ఎంత బిజీగా ఉన్నా ఓ 20నిమిషాలు పాటు బ్రిస్క్ వాక్ లేదా రన్నింగ్ చేసినట్టయితే ఒత్తిడి అన్నది అస్సలు దరిచేరదు.
3. పనిమనుషుల మీద ఎక్కువగా ఆధారరపడకుండా ఇంటి పని స్వయంగా చేసుకుంటే శారీరక వ్యాయామంతో పాటు క్యాలరీలు కూడా అధికంగా ఖర్చు అవుతాయి.
4. నిద్ర : ఆరోగ్యంగా ఉండాలంటే సరైన నిద్రకూడా ఎంతో అవసరం నిద్రలేమి... జబ్బులకు నిలయంలాంటిది. అతి నిద్ర అలసత్వానికి దారితీస్తుంది. శరీరానికి ఎంత నిద్ర అవసరమో అంతే నిద్రపోవాలి. రాత్రివేళ త్వరగా పడుకుని వేకువజామునే నిద్రలేవడం మంచిది.
5. కొలస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి రకరకాల పద్దతుల పాటిస్తుంటారు. అలాంటి వారు ఈ విధంగా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. రోజూ క్రమం తప్పకుండా ఓ చిన్న గిన్నెడు ఓట్స్ ను తీసుకుంటే కొలస్ట్రాల్ ను తేలికగా తగ్గించుకోవచ్చు.
6. నీరు తాగడం అన్నది ఆరోగ్యానికే కాదు, అందానికీ కూడా అత్యవసరం. వ్యాయామం చేయడానికి ముందు, ఆ తర్వాత కూడా తప్పనిసరిగా నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.
7. లో బిపి, ఒత్తిడి, ఆందోళనతో బాధపడేవారు నిపుణుల సలహా మేరకు క్రమం తప్పకుండా రోజులో కొద్దిపేసన్నా వ్యాయామం చేయడం మంచిది. వ్యాయామం పై సమస్యలకు దివ్వౌషధంగా పని చేస్తుంది.
8. వ్యాయామం చేస్తున్న సమయంలో ఆయాసం, శ్వాసపరమైన సమస్యలు ఎదురైనప్పుడు, వ్యాయామం చేయడం వెంటనే ఆపివేసి, దగ్గరలో ఉన్న డాక్టరును సంప్రదించాలి. ఉదయం వ్యాయామం కొరకు సమయం కేటాయించాలి. నచ్చిన వ్యాయామం ఏదైనా చేయవచ్చు. ఉరుకులపరుగుల జీవితంలో పడిపోయి వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేయడం మంచిదికాదు.
9. చెడు అలవాట్లు: సిగరెట్లు, పొగాకు, మద్యపానం, తదితరాలు తీసుకోవడం అలవాటువుంటే దానిని తప్పకుండా మానుకోవాలి. వయసుకు తగ్గట్టు కొన్ని దురలవాట్లు అలవడుతాయి. వ్యసనాలబారినపడితే ఆరోగ్యం పాడవడం ఖాయం.
10. మనం తినే భోజనమే మనకు అమృతం. అదే మనకు జీవితానికి శక్తిప్రదాయిని, నిర్ణీతవేళలో పుష్టికరమైన భోజనం తీసుకోవాలి. తీసుకునే ఆహారం శరీరానికి కావాల్సిన పోషకాలు అందించేదిగా వుండాలి. అమితమైన భోజనం లేదా అతి తక్కువ భోజనం శరీరానికి అంత మంచిదికాదు. ఆహారం బాగా నమిలి, ఎక్కువ సేపు తినడం వలన జీర్ణం కావడంతో పాటు మరో లాభం కూడా ఉంది. ఎక్కువ సేపు ఆహారం తీసుకోవడం వలన ఎక్కువగా తిన్నామన్న ఫీలింగ్ కలుగుతుంది. దాంతో ఎక్కువ సమయంలో తక్కువ ఆహారాన్ని తీసుకుంటారు.
No comments:
Post a Comment