ఇంట్లో ఒక అందమైన చిన్న తోట ఒక్కటుంటే చాలు, మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా వుండేవింధంగా మూడ్ ను మార్చేస్తుంది. అదే విధంగా సువాసలిచ్చే పూలు మొక్కలు గార్డెన్ లో ఉంటే ఒక రొమాంటిక్ వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. అంతే కాదు ఇంట్లో పూల మొక్కలు ఉంటే మీ భాగస్వామికి ఎప్పడూ మనస్సులోని తీపి భావాలను తెలియజేయవచ్చు. మరి ఇలాంటి పూల మొక్కలను గార్డెన్ లో పెంచుకోవడం ఒక మంచి ఆలోచన. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో ఎల్లప్పుడు ఆనందాలు వెల్లువిరుస్తాయి. మనస్సుకు ప్రశాంతత చేకూరుతుంది. ఇలాంటి సువాసనలు గల పూల మొక్కలను ఇంటి లోపల, ఇంటి బయట గార్డెన్ లో పెంచుకోవచ్చు. మరి ఇండోర్-అవుట్ డోర్ లో పెంచుకోదగినటువంటి మనస్సును ఆకర్షించేలా చేసేటటువంటి పూల మొక్కలు 5 రకాలున్నాయి. అవేంటో చూద్దాం....
గులాబి(రెడ్ రోస్): ప్రపంచాన్ని పరిమళభరితం, ఆనందమయం చేసే అంశాల్లో పూలది తిరుగులేని స్థానం. అందులో గులాబీ చోటు మరింత పదిలం. అందుకే దానిని పువ్వులలో రాణిగా అభివర్ణిస్తాం. గులాబీ మొక్క పెంచడమంటే పసికందును సాకినంత మెలకువగా ఉండాలి. పసిపాపలా పెంచుకున్న ఆ మొక్కకు పూవు తొడిగి నవ్వులు రువ్వుతూ అందరినీ పలకరిస్తే ఆ ఆనందం వర్ణించగలమా? మనచేతుల్లో విరబూసిన ఆ అందాన్ని తనివితీరా చూసుకుని మురిసిపోతాం. అలాంటి గులాబిలో చాలా రకాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ప్రేమకు చిహ్నాలైటువంటి ఎరుపు మరియు పగడపు గులాబీ రంగులు..ఈ గులాభీ మొక్కలు గార్డెన్ లో పెంచుకోవచ్చు. మొక్క పరిమానాన్ని బట్టి చిన్న కుండీలు అమర్చుకొని ఇంటిలోపల కూడా పెంచుకోవచ్చు. గులాబి మొక్కలను పెంచుకోవడానికి నిర్వహణ కార్రక్రామలు చాలా అవసరం. అవి ముందుగానే తెలుసుకోవాలి. గులాబి మొక్కకు ముళ్లు తొలగించి రోజూ నీరు పోస్తుండాలి. అప్పుడప్పుడు 2-4గంటల సమయం సూర్యరశ్మి పడేవిధంగా కుండీలను పెట్టి. తిరిగి వాటిని యధాస్థానంలో పెట్టుకోవచ్చు.
ప్లుమేరియా: సువాసనలు అందించి, ప్రేమను తెలిపేటటువంటి పువ్వుల్లో గులాబి తర్వాత ప్లుమేరియా. ప్లుమేరియా పువ్వు నుండి గుభాళించే పరిమలాలు ఇంటిని నింపేస్తుంది. అంతటి ఘాటైనటువంటి సువాసనలు ఈ పుష్పం వెదజల్లుతుంది. ఈ పూలు వివిధ రంగుల్లో పూస్తాయి. ఈ పూల మొక్కను పెంచటం తేలికే. చలి అధికంగా వుంటే, ఇంటి లోపల కుండీలలో పెంచకోచ్చు వాటికి కొద్దిపాటి నీరు పెడితే సరిపోతుంది.
మల్లె(జాస్మిన్): ప్రేమికులు మెచ్చే ఈపువ్వు ఘాటైన సువాసనలనిస్తుంది. ఇవి అలంకరణకే కాదు ప్రేమికులు మంచి మూడ్ రావటానికి కూడా ఉపయోగిస్తారు. ఈ మొక్క ఎక్కువగా ఇంటి భయట మాత్రమే పెంచుకోవడానికి వీలుంటుంది. అలాగే ఈ మొక్కకు సూర్య రశ్మి ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి పెరట్లోనే పెంచుకోవాలి. ఎండతో పాటు నీరు ఎక్కువ పోస్తే మొక్క బాగా ఎదుగుతుంది.
జాంక్విల్స్: ప్రేమకు, సాను భూతికి ఈ పువ్వు సంకేతం. ఈ మొక్క పెంచటం తేలికైన పని. దీని నిర్వాహణ కూడా చాల సులభం. పూలుపూచే సమయంలో మొక్కకు నీరు బాగా పెట్టాలి. ప్రతి రోజూ 2 నుండి 5 గంటలు సూర్య రశ్మి వుంటే చాలు.
తులిప్: గులాబి పువ్వులాగే ఈ తులిప్ పువ్వులు కూడా వివిధ రకాలైనటువంటి రంగులు కలిగి ఉంటాయి. అయితే వాటిలో ఎక్కువగా ఎరుపు, పసుపు ప్రేమికులకు ఆకర్షించబడేవిధంగా వుంటాయి. వీటిని ఇంటిలో ఫ్లవర్ వేజ్ లో పెడితే కనీసం ఒక వారం రోజులు వాడకుండా తాజాగా వుంటాయి.
ఈ 5 రకాల పూలు ప్రేమను తెలియజేస్తూ ఆకర్షణను కలిగించి మనస్సుకి ఆహ్లాదాన్నిస్తాయి. ఈ పూల మొక్కలతో మీ జీవితాలు ఆనంద భరితం చేసుకోండి.

No comments:
Post a Comment