all

Thursday, November 22, 2012

అధిక బరువు అనారోగ్యాలు

ఈ ఆధునిక యుగంలో ప్రపంచ వ్యాప్తంగా మనుష్యూల్లో అధిక బరువు, స్థూలకాయం ప్రధాన ఆరోగ్య సమస్యలుగా ఉన్నాయి. అధిక బరువున్న వారు 1.2 బిలియన్లుండగా, వారిలో 300 మిలియన్లు మంది స్థూలకాయులుగా ఉన్నారు. ఈ సమస్య ప్రమాదకరమైన అనారోగ్యాలకు దారితీస్తుంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రస్తుతం నివారించ దగిన పది ఆనారోగ్య కారణాలలో స్థూలకాయం ఒకటి. దాదాపు 13శాతం మంది పిల్లలు, యువకులు స్థూల కాయంతో బాధపడుతూ ప్రమాదకరమైన వ్యాధులకు గురవుతున్నారు. ఈ శాతం గత పదేళ్ళ కన్నా రెండింతలు ఎక్కువైందని అంచనా. ఇవాళ టీవీలు, కంప్యూటర్‌ గేమ్స్‌, ఆట స్థలాలు కరువైపోవడం, వ్యాయామం లేకపోవడం, ఎక్కువ కేలరీలు మిగిలిన చిరుతిళ్ళు, ఆహార విషయంలో అవగాహన లేక పోవడం వంటివి ప్రధాన కారణాలుగా పరిశీలకులు భావిస్తున్నారు. స్థూలకాయం కారణంగా పరిణమించే ముఖ్యమైన వ్యాధులు గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం, సంతాన సమస్యలు, కీళ్ళ జబ్బులు, కేన్సర్‌, ఊపిరితిత్తుల వ్యాధులు, గాల్‌బ్లాడర్‌లో రాళ్ళు, అల్సర్లు, గ్యాస్టిక్‌ ్టబ్రుల్‌ మొదలైనవి.

బరువు ఏ వయసులో ఎలా పెరుగుతుంది?
మన శరీరంలో కొవ్వు ఎక్కువగా చేరితే అధిక బరువవుతాం. దీనినే ఊబకాయం అంటాం. ప్రపంచం మొత్తంలో ఈ అధిక బరువు వల్ల ఎంతమందో ఎన్నో విధాలుగా బాధపడుతున్నారు. కాబట్టి మనం బరువు పెరగకుండా చూసుకోవడం చాలా అవసరం. అందుకు అవగాహన ముఖ్యం. ముందుగా బరువు పెరగడానికి కారణాల్ని చూద్దాం.

ముఖ్యంగా మధ్యవయసులో ఎక్కువమంది బరువు పెరుగుతుంటారు. కొందరు చిన్నప్పటి నుంచి అధిక బరువు తో ఉండవచ్చు. ఏ వయసు లోనైనా బరువు ఎక్కువగా కనిపించవచ్చు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థికంగా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళలో ఈ అధిక బరువు తక్కువగా కనిపిస్తోంది. వంశపారంపర్యంగా కూడా అధిక బరువు వస్తుంటుంది. తల్లిదండ్రులు ఇద్దరూ అధిక బరువున్న వాళ్ళయితే వాళ్ల పిల్లల్లో 80 శాతం మందికి జీన్స్‌ ద్వారా అధిక బరువుండే లక్షణం రావచ్చు. ఎండో క్రైన్‌గ్లాండ్స్‌ సిక్రీషన్స్‌ ఇంబాలన్స్‌ వల్ల అధిక బరువు కలుగవచ్చు.

మహిళలు - అధిక బరువు
పెద్ద మనిషి అయినప్పుడు, గర్బవతులైనప్పుడు, ముట్లుడిగిన తర్వాత సాధారణంగా కలుగుతుంటుంది. స్టిరాయిడ్స్‌, నోటి ద్వారా కాంట్రాసెప్టివ్‌, ఇన్సులిన్‌ వంటివి తీసుకోవడం వల్ల బరువు పెరగవచ్చు. అధిక బరువున్నప్పుడు లావుగా తయారై, మన దైనందిన కార్యక్రమాల్ని నిర్వహించడమే కష్టమవుతుంటుంది. బద్ధకం పెరుగుతోంది. త్వరగా కదల బుద్దికాదు. శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది.

అధిక బరువు తెలుసుకోవడం ఎలా?
Obesaబాడీ మాస్‌ ఇండెక్స్‌ (బిఎమ్‌ఐ) ద్వారా బిఎమ్‌ఐ... బరువు కిలోలలో బై ఎత్తు మీటర్లలో దీన్ని తెలుసుకోవచ్చు. బాడీమాస్‌ ఇండెక్స్‌ 20 నుంచి 25 వరకూ ఉంటే సాధారణ బరువు. 25 నుండి 30 మధ్య ఉంటే అధిక బరువు. 30 నుండి 35 వరకూ స్థూలకా యం. 35 నుంచి 45 వరకూ ఉంటే స్థూలకాయం. గ్రేడ్‌2, 40 కన్నా ఎక్కువ ఉంటే స్థూలకాయం. గ్రేడ్‌3 బిఎమ్‌ఐ 30కు పైగా ఉంటే ఒబేస్‌ అని, 40కు పైగా ఉంటే మార్బ్‌డ్‌ ఒబేడ్‌ అని అంటారు. కొద్ది పాటి అధికబరువు ఉన్నవాళ్ళు వ్యాయామం, ఆహార వ్యవహారాల మార్పుతో బరువు తగ్గించుకోవచ్చు. మార్బ్‌డ్‌ ఒబేసిటీ ఉన్నవాళ్ళకీ బేరియాట్రిక్‌ సర్జరీస్‌ ద్వారానే బరువును తగ్గించవచ్చు. ఇలాంటి సర్జరీస్‌ వల్ల ఇబ్బంది ఉండదు. మామూలు జీవితానికి రావచ్చు.

డాక్టర్‌ కె.ఎస్‌.లక్ష్మి,
ఓబేసిటీ సర్జన్‌, గ్లోబల్‌ హాస్పిటల్‌,
లక్డీకపూల్‌, హైదరాబాద్‌.
సెల్‌ నెం.98497 13853

 
 

No comments: