మరి మీ పిల్లాడు తరచుగా పొట్ట నొప్పి అని చెపుతున్నాడా? బహుశ లిస్టేరియా గురించి మీరు వినే వుంటారు. ఇది ఆహారం ద్వారా వచ్చే వ్యాధి. లిస్టేరియా అంటే బాక్టీరియా ఇన్ ఫెక్షన్. బాక్టీరియం లిస్టేరియా మోనోసైటో జన్స్ అనే బాక్టీరియా వలన కలుగుతుంది. ఇది అరుదుగా వచ్చే వ్యాధే అయినప్పటికి సాధారణంగా గర్భవతులకు చివరి త్రైమాసికంలో, కొత్తగా పుట్టిన వారికి, పిల్లలకు వస్తుంది. ఆహారం వలన వచ్చే ఈ వ్యాధికి రోగ నిరోధక వ్యవస్ధ బలహీనపడటం కారణం. ఉడికించని ఆహారాలు, నీరు ద్వారా ఈ బాక్టీరియా క్రిమి శరీరంలో చేరుతుంది. సరిగా ఉడకని మాంసం, పాల ఉత్పత్తులైన ఛీస్, పాలు మొదలైనవి ఈ బాక్టీరియా నివాసాలు. కూరగాయాలను కూడా వేడి నీటితో శుభ్రం చేయటం మంచిది.
లక్షణాలు పరిశీలిస్తే....
1. పిల్లలకు జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయి.
2. ఈ వ్యాధి వాంతులు, డయోరియా కలిగించి పిల్లాడిని బలహీనం చేస్తుంది.
3. పిల్లలు సరిగా తిండి తినరు. ఆకలి వుండదు. బలహీనంగా వుంటారు.
4. జ్వరం వుంటుంది. గర్భవతులైతే, జ్వరం పెరిగితే అబార్షన్ అయ్యే అవకాశాలున్నాయి.
5. ఈ వ్యాధి తదుపరి దశలో న్యుమోనియా, మెనింజిటిస్, సెప్సిస్ వంటి వ్యాధులకు కూడా దోవతీయవచ్చు.
కనుక, మీరు మార్కెట్లలో కొనే ఆహార వస్తువులను జాగ్రత్తగా, నాణ్యమైనవిగా కొనండి. పిల్లవాడి రోజువారి తిండిపై శ్రధ్ధ పెట్టండి. కూరలను, ఇతర ఆహార పదార్ధాలు ఏవైనప్పటికి బాగా కడగి వండాలి. ప్రత్యేకించి ఆకు కూరలు బాగా కడగాలి. పరిశుభ్రంగా వుండే ప్రదేశాలనుండే కూరగాయలను కొనండి. కొనుగోలు చేసే కూరలు కూడా తాజాగా వుండాలి. వీటిని అధిక సమయం నిలువ వుంచకండి. అదే రకంగా వీరు తాగేటందుకు వీలైనంతవరకు మినరల్ వాటర్ వాడితే మంచిది. లేదా గోరు వెచ్చని నీటిని తాగుతూండాలి. సాయంత్రాలు స్నాక్స్ వంటి ఆహారాలు బయటవిగా పెట్టకుండా, ఇంటిలోనే పరిశుభ్రమైన వాతావరణంలో వండినవిగా వారికివ్వండి. కొద్దిపాటి అనారోగ్యంగా వున్నపుడు పిల్లవాడు తినాలనుకుంటే, వేడి అయిన పదార్ధాలు మాత్రమే పెట్టండి. తినే ఆహారం వేడిగా వుంటే, వీలైనంతవరకు చెడు బాక్టీరియాల ప్రభావం వుండదు.
No comments:
Post a Comment