వారు ఎంత హింసకు దిగుతారంటే, అది కర్ర కావచ్చు లేదా దొరికితే పిస్టల్ కావచ్చు...ఒక ఆయుధాన్ని చేతబట్టి తమ సహచరులు, లేదా ఇతర చిన్నవయసు వారిపై హింసకు దిగుతారట. వీరు వారానికి ఎన్ని కార్బోనేటెడ్ కూల్ డ్రింక్ లు తాగుతున్నారో రీసెర్చర్లు పరిశీలించారు. వారి దైనందిన ప్రవర్తన, హావభావాలు పరిశీలించారు. మెల్లగా వారిలో హింసాత్మక ధోరణి, భావాలు అధికమవుతుండడాన్ని కనిపెట్టారు. ప్రతివారం అయిదు లేదా అంతకంటే అధికంగా కూల్ డ్రింక్ కేన్లు తాగేసిన వారు ఆల్కహాల్, స్మాకింగ్ లకు కూడా తరచుగా అలవాటుపడినట్లుగా కూడా తెలిపారు.
ఏ డ్రింక్ తాగని పిల్లలలో కంటే, కార్బోనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్ తాగే యువకులలో 9 నుండి 15 శాతం అధికంగా దూకుడు ప్రవర్తన వున్నట్లు....ఇదే మాదిరి ప్రవర్తన ఆల్కహాల్ తాగడం, స్మాకింగ్ చేయడం చేసిన పిల్లలలో కూడా వుంటుందని పరిశోధన తేల్చింది. సాఫ్ట్ డ్రింక్స్ లో వుండే షుగర్, కేఫైన్ వంటి పదార్ధాలవలన, ఇతర కారణాలవలనవీరికి ఈ రకమైన దూకుడు ప్రవర్తన అలవడి వుండవచ్చని రీసెర్చర్లు భావిస్తున్నారు. ఈ ఫలితాలను ఇంజరీ ప్రివెన్షన్ అనే ఆన్ లైన్ జర్నల్ లో ప్రచురించారు.
అంతేకాదు, పిల్లలు ఏది పెట్టినా తినకుండా విసిగిస్తారు? ఇటువంటి పిల్లలకు ఆహారం ఎలా తినిపించాలనేది అమెరికాలోని కార్నెల్ యూనివర్శిటీ పరిశోధకులు తీవ్రంగా పరిశోధించారు. పెద్దవారికంటే కూడా పిల్లలకు రంగులంటే మహా ఇష్టంట. ఒకే ప్లేటులో కనుక రంగురంగుల ఆహారాలు కంటికింపుగా కనపడుతూంటే, పిల్లాడు పెద్దల చేతులలోని ప్లేట్ బలవంతంగా లాగేసుకుని మరీ తినేస్తాడంటున్నారు.
ప్రత్యేకించి ఆహారం ప్లేటులో ఏడు రకాల ఆహార పదార్ధాలు ఆరు వివిధ రంగులలో వుండాలట. ఇలా వుంటే పిల్లలు ఖచ్చితంగా ఎక్కువ మొత్తం లోనే లాగిచ్చేస్తారట. ఈ పరిశోధన 23 మంది పిల్లల పైనా 46 మంది పెద్దలపైనా చేశారు. పెద్దల తో పోలిస్తే పిల్లలు అతి త్వరగా వివిధ రంగులు, రుచులు వున్న ఆహారాలు తినేయటం మొదలెట్టారట. మరి పిల్లలకొరకంటూ ప్రతిరోజూ ఇన్ని ఐటమ్ లు తయారు చేసి అందరికి తినిపించేస్తే, పెద్దలు, పిల్లలు కలసి ఆపై డైటింగ్ కూడా మొదలుపెట్టాలేమో? పెద్దలకైనా, పిల్లలకైనా, తినే ఆహారానికి రుచి, వాసన, రంగులు ప్రాధాన్యత వహిస్తాయని అంతేకాక, వాటి సైజు ఆకారాలు కూడా పరిగణలోకి తీసుకోవాలని రీసెర్చి టీముకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ కెవిన్ నిఫిన్ తెలిపారు. ఈ అంశాన్ని ‘ఎక్టా పెడియాట్రికా ' అనే జర్నల్ ప్రచురించింది.
[ మీ వ్యాఖ్య రాయండి ]