చాలామంది తల్లితండ్రులు వారి బిడ్డలను రాత్రి భయాలనుండి ఓదారుస్తూనే వుంటారు. చీకటి అంటే భయం లేదని వివరిస్తారు. కాని కొన్ని సార్లు మీ బిడ్డ ఈ రకమైన రాత్రి భయానికి తీవ్రంగా గురయితే, ఇక మీరు ఏం చెప్పినా వినడు. ఆ భయం అతడిని పట్టుకు పీడిస్తూనే వుంటుంది. రాత్రి భయం అనేది నిద్రకు అంతరాయం. ఒక పీడకలకు సమానం అని కూడా చెప్పవచ్చు. పిల్లలకు వచ్చే ఈ రకమైన పీడకల లేక రాత్రి భయాలు తల్లితండ్రులకు ఆందోళన కలిగిస్తూనే వుంటాయి. ఒక పక్క అవి వారికి అర్ధం లేనివిగాను ఏ రకమైన వైద్య సంప్రదింపులు లేనివిగాను వారు భావిస్తారు.
సాధారణంగా రాత్రివేళ, నిద్ర అనేది కొన్ని దశలవారీగా వుంటుంది. ప్రతి దశ కూడా ప్రత్యేకించి బ్రెయిన్ చర్యలపై ఆధారపడివుంటుంది. ర్యాపిడ్ ఐ మూవ్ మెంట్ అనే దశలో (దీనినే రెమ్ దశ అని కూడా అంటారు) చాలా వరకు కలలు సంభవిస్తాయి. అయితే, రాత్రి భయాలనేవి లోతైన రెమ్ దశలో కాకుండా వస్తాయి. పీడకలలు రెమ్ నిద్రా దశలో వస్తాయి. కనుక రాత్రి భయం అనేది టెక్నికల్ గా పరిశీలిస్తే కల కాదు. కాని అది అకస్మాత్ గా ఒక నిద్రా దశనుండి మరో నిద్రా దశకు చేరేటపుడు సంభవించుతుంది.

పిల్లవాడు పడుకున్న రెండు లేదా మూడ్ గంటల తర్వాత వచ్చే నిద్రా దశలో ఈ రాత్రి భయాలు వస్తాయి. అంటే అపుడు అతను ఒక దశ నిద్రనుండి మరో దశనిద్రకు చేరుతున్నాడన్నమాట. ఈ మార్పు సాధారణంగా సున్నితంగానే వుంటుంది. కాని అరుదుగా ఈ సమయంలో పిల్లలు ఆందోళన చెందుతారు. అవే రాత్రి భయాలుగా వారిలో ప్రదర్శించబడతాయి.
ఈ రాత్రి భయంలో పిల్లలు లేచి కూర్చొని అరుస్తారు. భయపడతారు. వారి శ్వాస, గుండె కొట్టుకోవటం వేగంగా వుంటాయి. కొన్నిసార్లు చెమట, దిక్కులు చూడటం కూడా జరుగుతుంది. అయితే, వీరు కొన్నిసార్లు కొద్ది నిమిషాలలో మామూలు స్ధితికి చేరుకుని నిద్రిస్తారు. అయితే, పీడకల వలే కాకుండా ఇవి పిల్లలకు మరుసటి రోజుకు గుర్తుండవు. దీనికి కారణం వారిలోని నరాల వ్యవస్ధ బలపడకపోవటంగా లేదా వారి కుటుంబంలో అదివరకు ఎవరికైనా వున్నా వస్తుందని పరిశోధకులు చెపుతారు.
బాగా అలసినా, లేదా నిందించబడినా, ఒత్తిడి కలిగించినా, లేక ఇంటినుండి దూరంగా వున్నా వారిలో ఈ పరిస్ధతి ఏర్పడుతుంది. రాత్రి భయం కలిగి వారు నిద్రలో ఉలిక్కిపడుతున్నపుడు వారిని లేపకపోవటం మంచిది. ఒకవేళ నిద్ర లేపినప్పటికి వారు ఏం జరిగిందో తెలియక ఖంగారు పడుతూనే వుంటారు. మరల స్ధిమితపడటానికి, మరోమారు సవ్యంగా నిద్రించటానికి ఇబ్బంది పడతారు. ఈ రకమైన పిల్లల రాత్రి భయాలకు, నిద్రలో ఉలిక్కిపడటాలకు మందులు లేదా చికిత్స వంటిది ఏమీ లేదు. కాని వారికిగల భయాలను కాలక్రమేణా సరైన సలహాలతో వారికి వివరణలు ఇస్తూ తగ్గించవచ్చు. వారి కేంద్రీయ నరాల వ్యవస్ధ ఒకసారి బలపడిందంటే, పిల్లలలో ఈ సమస్య తొలగినట్లే భావించవచ్చు. అవసరమనుకుంటే, వైద్య సలహాలు పాటించి అతనికి తగిన ధైర్యం చేకూర్చండి.

[ మీ వ్యాఖ్య రాయండి ]