వాటిలో మధుమేహం, గుండె, ఎముకల జబ్బుల వ్యాధులు రావడంతో జీవితాంతం బాధపడుతున్నారని తెలిపారు. కోమర దశ (5 నుండి 14 సంవత్సరాలు వయస్సు)లో పోషకాహార లోపంతో 17 శాతం మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. 15 శాతం మంది అధికంగా తినడం, వాంతులు చేసుకోవడం చేస్తున్నారు. చాల మంది అతి తక్కువ క్యాలరీలు ఉన్న పోషక ఆహారాలు తీసుకుంటున్నారు. వీటి వలన సమతులాహార సమస్యలతో వీరు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని వెల్లడి అయ్యింది. తల్లిదండ్రలు పిల్లల ఆరోగ్యకర అహారపు అలవాట్లను ప్రోత్సహించడం తప్పనిసరి అని సూచిస్తున్నారు.
ఇలాంటి జాగ్రతలు తప్పనిసరిగా పాటించాలి
1. ఉదయం అల్పహారాన్ని తప్పనిసరిగా తీసుకునేలా చూడాలి. ఈ ఆహారం మేధో ప్రదర్శనలో కీలకం.
2. భోజనంలో పంచదార, ఉప్పు, కొవ్వు పదార్థాలు తగ్గించడం ద్వారా ఊబకాయ సమస్య తలెత్తదు.
3. పంచదార కలిపిన పానీయాలు, శీతలపానీయాలు బాగా తగ్గించాలి.
4. తగినన్ని నీరు. పాలు, పాల ఉత్పత్తులతో చేసిన పదార్థాలు బాగా తీసుకోవాలని సూచించాలి.
5. పండ్ల రసం కంటే పండ్లు తినడాన్నిఎక్కువగా ప్రోత్సహించాలి. వాటిలోని పీచుపదార్థాలు ఆహారాన్ని కాపాడుతాయి.
6. అధిక బరవు, తక్కువ బరువు రెండు సమస్యలే. ఇది డిఫ్రెషన్ కు దారి తీస్తుంది. ఈ విషయం పిల్లలకు పూర్తిగా అర్థం అయ్యే విదంగా చెప్పాలి. ఈ సమస్య థైరాయిడ్ సమస్యలకు చేరువ అవుతుందని వివరించాలి.
7. రోజుకు ఒక్క సారి అయినా కుటుంబ సభ్యులు అందరూ కలిసి భోజనం చేసే విదంగా ప్లాన్ చేయాలి. ఈ విదంగా పిల్లలు పోషక ఆహారం తీసుకునే వీలు ఉంటుంది.
8. పిల్లలు ఆరోగ్యపు ఆహార అలవాట్లు పరిచయం చేయడానికి పోషకాహార నిపుణుల దగ్గర కౌన్సింగ్ ఇప్పించడంలో జాప్యం జరగకుండ జాగ్రతలు తీసుకొవాలి. పిల్లలు ఎప్పడు ఎలాంటి ఆహారం, చిరుతిండ్లు తీసుకుంటున్నారు అని జాగ్రతగా పరిశీలించాలి, ఎప్పటికప్పుడు సలహాలు ఇవ్వాలి.
No comments:
Post a Comment