all

Thursday, November 22, 2012

తక్కువ సమయం, తక్కువ ఖర్చుతో ఆకుకూరలు...

పట్టణాలు, పెద్ద పెద్ద నగరాల్లో జనాభా పెరగడంతో ఆహారోత్పత్తిలో కూడా మార్పులు ఏర్పడుతున్నాయి. పండించే పంటల్లో నాణ్యత కొరవడుతోంది. రసాయనిక రసాయనిక ఎరువులు, పురుగుమందులతోపాటు కలుషిత వ్యర్థ నీటిని వినియోగించి పండిస్తున్న ఆకు కూరలు, కూరగాయలను మార్కెట్లో కొనుక్కొని తినడం ఆరోగ్యానికి హానికరమనికరం. కాబట్టి పట్టణాలు, పెద్ద పెద్ద నగరాలలో నివిసించే వారు సైతం కొంచెం శ్రద్ద ఉంటే చాలు ఆకుకూరలు, కూరగాయలను ఇంటి వద్దే పండిచుకోవచ్చు. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన మడుల్లో సహజమైన పద్ధతుల్లో ఆకుకూరలతోపాటు ఏ రకం కూరగాయలైనా ఆరోగ్యదాయకంగా పెంచుకోవచ్చు.

Spinach Kitchen Garden Aid0069
ఇంటి దగ్గర పెంచుకొనేందుకు త్వరగా పంట చేతికందాలంటే ఆకు కూరలే బెస్ట్. ఆకు కూరలకు ఎక్కువ ఎరువులను ఉపయోగించనవసరం లేదు. మొదట్లో కంపోస్టు ఎరువును వేస్తే సరిపోతుంది. తర్వాత తర్వాత ఇంట్లోనే కుళ్ళడానికి అవకాశం ఉన్న వంటింటి వ్యర్థపదార్థాలు కుళ్లి కంపోటస్టుగా మారితర్వాత మొక్కలకు ఎరువుగా వేయవచ్చు. అలాగే పప్పులు, బియ్యం కడిగిన నీళ్లు వేరే బక్కెట్‌లో పోసి ఏరోజుకారోజు మొక్కలకు పోషించుకోవచ్చు.
ముఖ్యంగా ఆకుకూరలు త్వరగా పండేవి, తోటకూర, చుక్కకూర, పాలకూర, మొంతాకు, దంటు ఆకు, బచ్చలి ఆకు, కరివేపాకు, కొత్తిమీర, పొదీనా, ఉల్లికాడలు, గుమ్మడి వంటి వాటిని పండించుకోవచ్చు. వీటితోపాటు కొన్ని రకాలు కూరగాయల మొక్కలు కూడా పెంచుకోవచ్చు వాటిలో త్వరగా పెరిగేవి. వంకాయ, బెండకాయ, టమోట, పచ్చిమిర్చి, చిక్కుడు, దోసకాయ వంటి కూరగాయలు సైతం పెరటి మొక్కల్లో త్వరగా పెంచుకోవచ్చు.
ఇలా ఇంటి పట్టున ఆకు కూరలు, కూరగాయలు సేంద్రియ పద్దతుల్లో పండిచుకోవడం వల్ల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే శరీర పెరుగుదల, దఢత్వానికి చక్కని ఆరోగ్యానికి ఇవి చాలా ముఖ్యమైనవి. రసాయనిక ఎరువులతో పెరిగిన కూరగాయలతో పోలిస్తే సేంద్రియ కూరగాయల్లో విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ ఎక్కువగా ఉంటాయి. ఇక రుచి సంగతి చెప్పక్కర్లేదు. రసాయనాల అవశేషాలు ఉండవు కనుక ఆనారోగ్యం బారీన పడే ప్రమాదం ఉండదు. కాబట్టి చాలా సులువుగా, శ్రమ లేకుండా ఇంటి దగ్గర ఉన్న ఖాళీ స్థలంలో వీలైనన్ని మొక్కుల పెంచుకోవడం ఆరోగ్యదాయకం.

No comments: