ఏకాగ్రత అంటే జ్ఞానసముపార్జన. అది విచక్షణాజ్ఞానం, విషయపరిశీలన, సంకల్పం, అహంకారశూన్యత... వీటి వల్ల ఏర్పడుతుంది. అంటే సమాధిస్థితికి చేరడం సాధ్యమవుతుందన్నమాట. సమాధిస్థితిని సంప్రాజ్ఞత, అసంప్రాజ్ఞతలుగా వర్గీకరిస్తారు. సమాధి స్థితిలో ఉండటమంటే.... విషయవాంఛలను జయించే శక్తి సంపాదించడమన్నమాట. దీనిని ‘సవితర్క’ అంటారు. ఒకే అంశం మీద మనసు పదేపదే లగ్నమవుతూ, విషయవాంఛల గురించిన ఆలోచన లేకపోవడమే ఈ స్థితి.
ధ్యానం చేయడానికి రెండు సాధనాలు ఉంటాయి. ప్రకృతికి సంబంధించినవి, పురుషార్థాలకు సంబంధించినవి. మళ్లీ ఇది రెండు రకాలు. అందులో ఒకటి... పరధ్యానమనే పురుషార్థానికి సంబంధించినది. మనసు... విషయవాంఛలను పరిశీలిస్తూ, దాని ఆద్యంతాల గురించి ఆలోచిస్తే, అది కూడా సవితర్కమే. అయితే దాని గురించి వివరించడానికి ఎంతో పరిజ్ఞానం ఉండాలి.
యోగాకి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలంటే, సాంఖ్య తత్త్వాన్ని అర్థం చేసుకోవాలి. అహంకారానికి, కోరికకు, మనసుకు సంబంధించిన ఆధారాన్ని ‘చిత్త’ అంటారు. అంటే మనసు... ఒక అంశం గురించి లోతుగా ఆలోచించడమన్నమాట.
మెదడు విషయవాంఛలను లోపలకు తీసుకుని, దానిని ఆలోచనగా బయటకు వ్యక్తపరిచే శక్తి కలిగి ఉంటుంది. ఈ శక్తి, మెదడు ఒకే చోట ఉంటే దానిని అవ్యక్తం అంటారు. అంటే సృష్టికి ముందుగా జరిగిన అంశాలను, యుగాంతం తరవాత సంభవించే పరిణామాలను వ్యక్తపరచలేని భావమన్నమాట. జీవితంలో ఆనందం పొందిన తరవాత లభించే ప్రాపంచిక అన్వేషణ, తాత్కాలిక ఆనందం కోసం చేసిన అన్వేషణ నిరుపయోగం. వీటి నుంచి దూరమైనప్పుడు మనిషి శాశ్వత ఆనందం పొందగలుగుతాడు.
పతంజలి మహర్షి... శాస్త్రానికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను చర్చిస్తూ, మనలను మంచిమార్గంలో నడిపిస్తాడు. తెలివితేటలు అనే శక్తి మన అధీనంలోకి వచ్చినప్పుడు మానవుడు ధ్యానసాధన చేస్తూ, విషయవాంఛలను జయించే శక్తిని సాధించగలుగుతాడు. ఆ విధమైన ధ్యానసాధన చేయడాన్ని సవితర్క అంటారు. తర్కం అంటే ప్రశ్నించడం. సవితర్కం అంటే ‘ప్రశ్నతో’ అని అర్థం. వివిధ అంశాలను ప్రశ్నిస్తూన్నప్పుడు అందులోని వాస్తవాలు వెలుగులోకి వస్తాయి.
ధ్యానం చేసేవారు... సమయం, శూన్యతల గురించి ఆలోచిస్తూంటే, దానిని నిర్వితర్క అంటారు. అంటే ‘ప్రశ్నించకపోవటం’ అన్నమాట. ధ్యానం స్థాయి మరోమెట్టు ఎక్కితే, అప్పుడు కాలం గురించి, శూన్యం గురించి ఆలోచిస్తారు. దానిని సవిచార అంటారు. అంటే విచక్షణతో ధ్యానం చేయడమన్నమాట. అది కాల, శూన్యతలకు అతీతంగా ఉంటుంది. అతీత శక్తుల గురించి ఆలోచన చేయిస్తుంది. దీనినే నిర్విచారం అంటారు. అంటే ఏ తర్కం లేకుండా ఆలోచించడమన్నమాట. ఆ తరువాత స్థితి విషయవాంఛలను విడిచిపెట్టడం. ఆ స్థితిలో ధ్యానస్థితి అంతర్లీనంగా నిలిచిపోతుంది. దానినే సానందం అంటారు. ఇన్నిరకాల సాధనలతో ఏకాగ్రత సిద్ధిస్తుంది.
(పతంజలి యోగసూత్రాలకు స్వామివివేకానంద చెప్పిన భాష్యం)
తర్కం అంటే ప్రశ్నించడం. సవితర్కం అంటే ‘ప్రశ్నతో’ అని అర్థం. వివిధ అంశాలను ప్రశ్నిస్తున్నప్పుడు
అందులోని వాస్తవాలు వెలుగులోకి వస్తాయి.

No comments:
Post a Comment