సోదరుల మధ్య, లేదా తోడబుట్టినవారిమధ్య తగవులు నివారించాలంటే ఏం చేయాలో చూడండి.
సందర్భం వచ్చినపుడు ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోండి. లేదా సహాయపడండి. హోం వర్క్, ప్రాజెక్టులు చేయడం లేదా చాక్లెట్ లు కార్డులు వంటివి కొని ఇవ్వటం చేయాలి. ఈ రకంగా మీ ప్రేమను సోదరుడు లేదా సోదరికి చాటి చెప్పాలి.
జోక్యం చేసుకోవద్దు - ఒకరి వ్యక్తిగత విషయాలలో మరొకరు జోక్యం చేసుకోకండి. కలసి ఒకే చోట వున్న ఎవరి వ్యక్తిత్వ ప్రవర్తన వారిదే. పర్సనల్ డైరీలు, ఇ మెయిళ్ళు, మొబైల్ మెసేజీలు చదువకండి. అతని గదిలోకి వెళ్ళాలంటే తలుపు కొట్టి వెళ్ళండి. అది గౌరవం.
మీ తోడబుట్టినవారికి సహాయం చేయండి - మీ మధ్య ఎన్ని తగవులు వున్నప్పటికి మీ సోదరి లేదా సోదరుడు సహాయం కొరకు మీకై చూస్తారు. తల్లితండ్రులతో, స్నేహితులతో, టీచర్లతో అతనికి ఏ సమస్య వచ్చినా మీరు సహకరించండి. తర్వాత సమయం వచ్చినపుడు అతనికి వివరించండి. అతని సమస్యలు వినండి. సహాయం చేయటానికి ప్రయత్నించండి.
అతని జాగ్రత్త తీసుకోండి. ఏ అంశమైనా పంచుకోండి. మీ సోదరుడితో వున్న సమస్యలు సంభాషణద్వారా ఒకరికొకరు పరిష్కరించుకోండి. మీ ఆనందాలను, దుఖా:లను అతనితో పంచుకోండి. ఈ రకంగా అతనితో స్నేహం చేసుకోవచ్చు.
ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ మధ్య స్నేహం ఏర్పడటం లేదా? అటువంటపుడు మధ్యవర్తిగా పెద్దల సలహాలను పాటించండి. వారు మీకు మీ సోదరుడికి నచ్చచెపుతారు. తోడబుట్టినవారు మంచి స్నేహితులని గ్రహించండి. మీకు తెలిసిన మరిన్ని అంశాలు మాకు వ్రాయండి.
[ మీ వ్యాఖ్య రాయండి ]