all

Thursday, November 22, 2012

కిచెన్ ప్లాంట్స్ తో ప్రయోజనాలెన్నో...

ప్రస్తుతం ప్రతి ఇంట్లోను మొక్కలను పెంచుకోవాలనుకునేవారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంటోంది. దీంతో మొక్కలు పెంచాలన్న ఆసక్తి ఉన్నా, ఖాళీ స్థలం లేక కోరిక అలాగే ఉండిపోతోంది. దీనికి మీరు చేయాల్సిందల్లా ఒక్కటే...ఇండోర్ ప్లాంట్స్ అంటే ఆకర్షణీయంగా కనిపిస్తూ గది అందాన్ని రెట్టింపు చేస్తుంది. అలాగే గదిలో స్వచ్ఛమైన ప్రాణవాయువు లభిస్తుంది. కిచెన్ విండోలో లేదా మరేదైనా కిటికీలలో చిన్న చిన్న కుండీలు ఏర్పాటు చేసుకోండి. ముఖ్యంగా ఈ కుండీలలో వంటకు ఉపయోగపడే మొక్కలు నాటుకోండి. అవసరమైనప్పుడు అవి మీకు ఉపోయోగపడుతాయి.
దీర్ఘ చతురస్రాకారంలోనున్న మూడు ప్లాస్టిక్ కుండీలను తీసుకుని అడుగు భాగంలో వాటర్ బాటిల్ మూతలను చక్రాల మాదిరి అమర్చండి. ఆ మూడింటిని కలుపుతూకాస్త మందంపాటి దారం కట్టండి. ఆ తర్వాత కుండీలలో మెత్తని మట్టిని పోసి పొడవాటి ఆకులుండే మొక్కలు నాటండి. దీనిని పెద్దగా ఉన్న కిటికీలో, మెట్లపై, వరండాలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. దీంతో ఇంట్లోనే మొక్కలు పెంచే కోరిక నెరవేరుతుంది. అలాగే ఇంట్లో స్వచ్ఛమైన ప్రాణవాయువు లభిస్తుంది.
Kitchen Plants Will Give Fresh Spinach Aid0069
ఇలాంటి మొక్కలు ఇంట్లో పెంచుకుంటుంటే ఆరోగ్యానికి చాలామంచిది. ఉదాహరణకు కొత్తిమీర, మెంతికూర, కరివేపాకు, పుదీనాలాంటి మొక్కలు చిన్న కుండీల్లో పెంచుకోవచ్చు. ఎక్కువ కుండీలు ఏర్పాటు చేసుకున్నప్పుడు వాటిలో ఒక్కొక్క దానిని వరుసగా , దశలవారిగా ఉపయోగించుకోండి. ఇలా చేస్తుంటే నిత్యం మీరు వంటలకు తాజాగానున్న కొత్తిమీర, కరివేపాకు లేదా పుదీనాను వాడుకోవచ్చు.

No comments: