all

Thursday, November 22, 2012

ప్రేమతో చేయాలి-kids story

ఒకరోజు ఒక నక్క ఊరంతా తిరుగుతూ ఒక రైతు పొలంలోకి వచ్చింది. తినడానికి ఏదైనా దొరుకుతుందేమోనని అటు ఇటు చూసింది. అక్కడ నూర్పిన ధాన్యం కుప్పగా పోసి ఉంది. అయితే నక్క వాటిని తినదు గనుక ఇంకేదైనా దొరుకుతుందేమోనని తిరుగుతోంది. ఇంతలో ఒక గుర్రం అటువైపు వచ్చింది. నక్క దానితో స్నేహం చేయాలని భావించింది.

గుర్రం తన దగ్గరకు రాగానే ‘‘మిత్రమా! రా! నీలాంటి వారి కోసమే ఎదురు చూస్తున్నాను. ఈ ధాన్యాన్ని నేను కనీసం ఎంగిలి కూడా చేయలేదు. నీకే వదిలేస్తున్నాను. హాయిగా తిను. నువ్వు తింటూంటే చూసి ఆనందిస్తాను’’ అంది.

దాని అతి వినయానికి గుర్రం చిన్నగా నవ్వి, ‘మిత్రమా! ఈ ధాన్యాన్ని నువ్వు తినలేవు. అందుకే నాకు ఇస్తున్నావు. ఒకవేళ ఇది నువ్వు తినే ఆహారమైతే నాకు వదిలేదానివే కాదు. మనకు అవసరం లేనిది దానం చేయడంలో త్యాగం లేదు’ అంది గుర్రం. నిజం బయటపడడంతో సిగ్గుతో తల వంచుకుని వెళ్ళిపోయింది నక్క.


No comments: