all

Thursday, November 22, 2012

వయసు ఏదైనా.... తల వెంట్రుకలు అందమే...!

పిల్లలకు ప్రతినెలా వెంట్రుకలు అంగుళంలో నాలుగో వంతు పెరుగుతాయట. వెంట్రుకలు తమ కుదుళ్ళనుండి షుమారుగా 3 నుండి 6 సంవత్సరాలు పెరుగుతాయి. తర్వాత బలహీనపడి రెండు లేదా మూడు నెలల కాలంలో రాలిపోతాయి. ఈరాలే దశలో పిల్లలలో జుట్టు ఊడటం సాధారణమే. మీ పిల్లల తల వెంట్రుకల పెరుగుదలకు, ఊడిపోవటానికి అనేక కారణాలుంటాయి. మీ బిడ్డ తలవెంట్రుకల పెరుగుదల బాగా వుండాలంటే, కొన్ని తేలిక మార్గాలు చూడండి.

సరైన ఆహారం - మంచి పోషకాహారం ఇవ్వటం ద్వారా పిల్లల తల వెంట్రుకల పెరుగుదలను మెరుగు పరచవచ్చు. జంక్ ఫుడ్ మాన్పించండి. వాటి స్ధానంలో ఆరోగ్య కరమైన పండ్ల రసాలు, విటమిన్లు, పోషకాలు కల ఆహారాలను పిల్లలకివ్వండి. వారి ఆమారంలో విటమిన్ ఎ మరియు సి తప్పక వుండేలా చూడండి. ఇవి పచ్చటి ఆకు కూరలు, కూరగాయలు, ఆరెంజస్, సిట్రస్ జాతి పళ్ళు ఆహారంలో తప్పక చేర్చండి.
Ways Increase Hair Growth Kids



ప్రొటీన్ - బ్రేక్ ఫాస్ట్ లో గుడ్లు పెట్టండి. వీటిలో ఎల్ సిస్టైన్, ఎమినో యాసిడ్ మొదలైనవి వుండి వెంట్రుకల కుదుళ్ళు కొత్తవి పెరిగేలా చేస్తాయి. ఇలా ప్రొటీన్లు అధికం కల ఆహారాలు తింటే, అవి త్వరగా ఊడే దశరకు చేరుకోవు. మాంసం, చేపలు, పాలు, గుడ్లు మరియు పప్పులు ప్రొటీన్లు బాగా వుండే ఆహారాలు. మీ బిడ్డ తల చర్మ గ్రంధులు బాగా ద్రవాలను తయారు చేయాలంటే, ఈ ఆహారాలు వాడాలి.

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు - మీ పిల్లల ఆహారంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ వుండే చేప, సల్మాన్, బాదం పప్పులు వంటివి చేర్చండి. ఆహారంలో ప్యాకేజ్ ఆహారాలు కాక ఆరోగ్యకరమైన కొవ్వులు వుండే ఆహారాలు పెట్టండి.

ఐరన్ మరియు జింక్ -
మీ బిడ్డ జుట్టు ఎదుగుదలకు, జింక్, ఐరన్ లు బాగా సహకరిస్తాయి. పిల్లలు సాధారణంగా పచ్చని కూరగాయలు తినటానికి ఇష్టపడరు. అయితే వీటిలో వుండే పోషకాలు వారికి చాలా అవసరం కనుక తప్పక తినిపించాలి. వివిధ రీతులుగా వండి పిల్లలకు రుచించే విధంగా తినిపించాలి.

ఈ ఆహారాలు మీపిల్లల డైట్ లో చేర్చటమే కాక, వారి తల చర్మం ఎల్లపుడూ శుభ్రంగా వుండేలా చూడండి. తల వెంట్రుకలు కడిగే ముందు, తలకు నూనె రాయండి. ఎపుడు తల మురికిపట్టినా కడగండి. తల కడిగిన తర్వాత హెయిర్ డ్రయ్యర్ లేదా బ్లోయర్ వంటి వాటితో పొడి చేయకండి. తల వెంట్రుకలు సహజంగా వాటంతట అవే ఆరాలి. దువ్వుకునే మెళకువలు వారికి నేర్పించండి. వెడల్పు పళ్ళు వున్న దువ్వెన లేదా బ్రష్ ఉపయోగించాలి. ప్రతిరోజూ తగినంత నీరు తాగాలి. ఇది వారి కుధుళ్ళను బలపరచి బ్రెనయిన్ కు రక్త ప్రసరణ బాగా వుండేలా చేస్తుంది.


No comments: