పిల్లలను ఎపుడూ అది చేయలేదు...ఇది చేయలేదు అంటూ తల్లితండ్రులు సతాయిస్తూ వుంటారు. అది వారికి ఒక అలవాటుగా వుంటుంది. కాని వారి ఈ చర్య పిల్లవాడికి వ్యతిరేక ప్రభావం చూపుతుంది. సతాయించే తల్లితండ్రులు పిల్లలపాలిట ఒక దురదృష్టం అని చెప్పాలి. వీరు తమ పిల్లలను ఎలా సాధిస్తారో పరిశీలించండి.
మానసికంగా హింస
చాలామంది తల్లితండ్రులు తమ పిల్లలపై ఒత్తిడి పెడుతూంటారు. కాని పిల్లలు వారికిష్టమైనది వారు చేస్తారు. చాలావరకు తల్లితండ్రులు ఎల్లపుడూ పిల్లలను బాగా చదవమని విసిగిస్తారు. ఇది నిరంతరంగా వుంటే, పిల్లాడిలో వ్యతిరేక మానసిక సమస్యలు ఏర్పడతాయి. ఈ రకం తల్లితండ్రులు తమ పిల్లలను వారి తోటివారితో, లేదా బంధువుల పిల్లలతో పోలుస్తారు. వారంత బాగా మీరు చదవటం లేదంటారు. వారికంటే మార్కులు తక్కువగా వచ్చాయంటారు. ఈ రకమైన ఒత్తిడి తల్లితండ్రులు కలిగిస్తూంటే, పిల్లలు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతుంటారు.
శారీరక హింస
పిల్లల బాగుకొరకు తల్లితండ్రులు ఒత్తిడి చేయటం వాస్తవమే. కాని పిల్లలను నిరంతరం దానికి నిందించటం లేదా కొట్టటం వంటి చర్యలు వారిలో అసహనం కలిగిస్తాయి. వ్యతిరేక చర్యలకు పాల్పడతారు. అంతేకాదు, ఇటువంటపుడు వారు మత్తుమందులు తీసుకోవటానికి అలవాటు పడతారు. శారీరక హింసలో వారు తీవ్రంగా చెడు ప్రభావాలకు హింసాత్మక చర్యలకు కూడా దిగుతారు.
సామాజిక హింస - అన్నిటికంటే కూడా ఇది చాలా ప్రమాదకరమైనది. పబ్లిక్ లో మీ బిడ్డను తిట్టటం కొట్టటం వంటివి అతనికి ఎంతో హాని చేస్తాయి. తల్లితండ్రులు ఎపుడూ, వేరే వారితో పోలుస్తూ, చూడు...అతను చూడు నీకంటే ఎంత బాగా చదువుతున్నాడో, ఎంత బాగా ఆడుతున్నాడో, .... అని నలుగురి ముందు పబ్లిక్ లో నిందిస్తారు.
పిల్లలు అందరూ ఒకే రకంగా ఉండరని, వివిధ గుణాలతో పుడతారని, ప్రవర్తిస్తారని గ్రహించాలి. కనుక మీ బిడ్డను ఇతరులతో పోల్చటం సరికాదు. ఒక తల్లితండ్రులుగా బిడ్డకు భాధ్యత వహించండి. వారిని నిందించకండి. మీరు ఈ రకంగా నిందిస్తే, అతను మరింత కుంగి తెలివితేటలు కోల్పోతాడు.
పిల్లలతో ఏ అంశాలున్నప్పటికి వాటిని ప్రశాంతంగా పరిష్కరించుకోవచ్చు. మీరే వారితో విభిన్నంగా ప్రవర్తిస్తే, ఇక వారికి భవిష్యత్తు అంధకారమే. మీరు ఇదే విధంగా కనుక కొనసాగిస్తే, ఏదో ఒకరోజు మీ బిడ్డ ...డ్యాడీ ఐ హేట్ యూ....అనేస్తాడు. ఆ పరిస్ధితి వరకు తెచ్చుకోకండి.
[ మీ వ్యాఖ్య రాయండి ]