all

Thursday, November 22, 2012

తొక్కని పడేయకండి...ఆరోగ్య ప్రయోజనాలు చూడండి...!

నారింజ పండ్లు చలికాలంలో ఎక్కువగా దొరుకుతుంటాయి. ఆరోగ్యాన్ని, అందాన్ని పెంచే సుగుణాలను తనలో నింపుకున్న నారింజను ఇంగ్లీషులో ఆరెంజ్‌ అంటారు. చక్కగా తినేసి జీర్ణం చేసుకోగల ఫలం కమలాఫలం. ఆరెంజ్ రంగులు చూడగానే తినేయాలని... జ్యూస్ తాగేయాలని అనిపించే పండు కమలాపండు. నారింజలో సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, రాగి గంధకం, క్లోరిన్‌లు కూడా ఉన్నాయి. ఆహారనాళాలలో విషక్రిములు చేరకుండా నిరోధించే శక్తి కూడా నారింజకు కలదు. నారింజలో బెటా కెరోటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది శరీరంలోని కణజాలాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంట్లో ఉండే కాల్షియం.. ఎముకలు, దంతాల దృఢత్వానికి ఎంతగానో సహకరిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయటంలోనూ, రక్త ప్రసరణ సక్రమంగా జరగడంలోనూ దోహదపడుతుంది. ఫలితంగా గుండె పనితీరు మెరుగుపడుతుంది. విటమిన్ సి శాతం ఎక్కువగా ఉన్న నారింజను రోజుకు ఒకటి తీసుకున్నట్లయితే.. చర్మం మంచి నిగారింపును సంతరించుకుంటుంది. జలుబు, దగ్గు లాంటి ఆరోగ్య సమస్యలు కూడా దరి చేరవు.



నారింజ పండు కఫం, వాతం, అజీర్ణాలను హరిస్తుంది. శరీరానికి బలం, తేజస్సు కలిగిస్తుంది. మూత్ర విసర్జన ప్రక్రియను సరళతరం చేస్తుంది. ముదిరిన నారింజ కాయలను కోసి, ఉప్పులో ఊరబెట్టి, ఎండబెట్టి, కారం మరియు మెంతిపొడి కలుపుకున్నట్లయితే... ఊరగాయలా నిల్వ ఉంటుంది. రుచిగా ఉండటమే కాక, ఆరోగ్యాన్ని కూడా వృద్ది పరుస్తుంది. నారింజను వాడితే అజీర్ణ సమస్యల నుండి బయటపడవచ్చు. అలాగే, ఆహారనాళాలలో విషక్రిములు చేరకుండా నిరోధించే శక్తి కూడా నారింజకు కలదు.



ఆహారనాళాలలో విషక్రిములు చేరకుండా నిరోధించే శక్తి కూడా నారింజకు కలదు. నారింజలో బెటా కెరోటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది శరీరంలోని కణజాలాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆహారంతో పాటు నారింజపండును తినడం వల్ల కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.


యుక్తవయస్సులో ఆడపిల్లల ముఖంపై ఏర్పడే మొటిమలను తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా తయారు చేయడంలో కమలా రసం బాగా ఉపయోగకారి. విటమిన్ సి శాతం ఎక్కువగా ఉన్న నారింజను రోజుకు ఒకటి తీసుకున్నట్లయితే.. చర్మం మంచి నిగారింపును సంతరించుకుంటుంది. నారింజ తొక్కను పడేయకుండా... ఎండబెట్టి, పొడి చేసి, సున్నిపిండిలో కలుపుకుంటే మంచిది. ఈ పిండిని స్నానానికి ముందు ఒంటికి రాసుకుని రబ్ చేస్తే... చర్మంపై ఉండే మృతకణాలన్నీ సులభంగా తొలగిపోతాయి. చర్మం మృదువుగా అవటమే కాకుండా, కొత్త మెరుపును సంతరించుకుంటుంది.



నిర్జ్జీవంగా లేదా ఆయిలీగా ఉండే జట్టుకి సగం గ్లాస్ డికాషన్, సగం గ్లాస్ బీర్, నిమ్మకాయరసం, ఆరెంజ్ జ్యూస్ను కలిపి షాంపూ చేసిన తరువాత జుట్టుకు పట్టించి అరనివ్వాలి. దీంతో జుట్టు అందంగా, సిల్కీగా అవుతుంది. అలాగే ఆరెంజ్ తొనలను స్నానం చేసే బకెట్ నీటిలో వేసి నానబెట్టి తర్వాత తలకు, శరీరానికి పడేలా స్నానం చేస్తే చర్మంతో పాటు, కురుల కూడా మెరుస్తుంటాయి.



ఆరెంజ్ తొక్కను ఎండబెట్టి పొడి చేసి దానికి స్పైసీస్(చెక్క, లవంగాలు, స్టార్ ఆనీ వంటివి)వాటితో కూడా పొడి చేసి రెండూ మిక్స్ చేసి లేదా విడి విడిగా అక్కడక్కడా వేసినా లేదా ప్లేట్స్ లో లేదా కప్స్ లేదా బాటిల్స్ లో నింపి పెట్టినా ఇంట్లో ఎటువంటి దుర్వాసనా ఉండదు. ఎల్లప్పుడు మంచి సువాసనతో ఇల్లంతా ఫ్రెష్ గా ఉంటుంది.



ఆరెంజ్ తొక్క అంటే తొక్క మాత్రం కాదు. తొక్క మీద ఉన్నటువంటి నున్నని పదార్థం స్పూన్ తో తీసుకొని చాలా వంటకాల్లో మంచి సువాసనకోసం, రంగు కోసం వినియోగిస్తుంటారు. అలాగే వెనిలా ఎసెన్స్, ఐస్ క్రీమ్స్ లో కలర్, వాసన కోసం ఎక్కువగా వినియోగిస్తుంటారు.



గర్భవతులు రోజూ ఒక గ్లాస్ నారింజ జ్యూస్ తాగినట్లయితే.. ఫోలిక్‌యాసిడ్ సంప్లిమెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కమలాపండులో అధికంగా ఉండే పోలిక్ యాసిడ్ మెదడును బ్యాలెన్స్‌గా ఉంచగలగడమే కాకుండా ఉత్సాహంగా.. ఉల్లాసంగానూ ఉంచగలుగుతుంది

ప్రతిరోజూ కమలాపండు రసాన్ని సేవించేవారికి వ్యాధినిరోధక శక్తి పెరిగి వ్యాధులు దరిచేరవు. కమాలా పండు ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో... కమలాపండ్ల తొక్కలతో కూడా మంచి సుగంధభరితమైన కొన్ని నూనెలు నిక్షప్తమై ఉన్నాయి. ఈ నూనెలే కమలాకు మంచి సౌరబాన్ని కలిగిస్తారు. ఈతైలం ఔషధగుణం కూడా కలిగివుంది. మరి తొక్క ఎలా ఉపయోగపడుతోంది. అది ఎంత వరకూ నిజమో ఒక సారి చూద్దాం...

No comments: