all

Thursday, November 22, 2012

టై గార్డెన్ తో ఆనందమయ జీవితం....

చాలా మందికి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం.. అందుకే ఎప్పుడూ పార్కుల వెంట, పొలాల వెంటా తిరుగుతుంటారు. ఇల్లల్లో పెంచుకొనే పెరుడుతో ఎంతో ఆనందంగా గడుపుతారు ఇంటి ముందు గార్డెన్ లో రకరకాల పూల చెట్టతో పాటు, విభిన్న విభిన్న ఆకృతులను కూడా రూ పొందింపరుచుకోవచ్చు. అందుకు తగిన సూచనలు, మెలుకలను తెలుసుకొన్నట్లైతే ఇంట్లోనే చిన్న సైజ్ గార్డెన్ ను ఏర్పాటు చేసుకోవచ్చు. అలాంటి వారి అభిరుచకి తగ్గట్టుగానే నేడు గార్డెనింగ్ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. చాలా మంది నగరవాసులు తమకున్న కొద్దిపాటి స్థలంలోనే వివిధ ఆకృతులను రూపొందించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.
పెద్ద పెద్ద సిటీల్లో నివసిస్తున్న ప్రజల్లో టైపై కుండీలు, మడుల్లో కూరగాయలు, ఆకుకూరలు పెంచడంపై మక్కువ చూపిస్తున్నారు. అందుకే ఈ మధ్య టై గార్డెనింగ్ బాగా ప్రాచుర్యం పొందిండి. టైగార్డెనింగ్ కి కొబ్బరి పొట్టు ఎరువు, వర్మీ కంపోస్టు(ఆకుల తదితర సేంద్రియ పదార్థాలతో తయారైన ఎరువు) మిశ్రమం వాడుకొంటే సరిపోతుంది. ప్రత్యేకంగా బయట ఎరువులను కొనాల్సిన అవసరం ఉండదు.

To Bring Up Plant Grow On Your Terrace Aid0069
కొద్దిపాటి మనస్సు పెట్టి..ఇష్టంగా చేయడం ప్రారంభిస్తే టై మీద ఏ పంటనైనా పండించవచ్చు. ఎవరో చెప్పారని కాకుండా.. ఎవరికి వారికే ఇంట్రస్టు రావాలి. ఒక్కసారే ఎక్కువ పని పెట్టుకోకుండా. మొదట 2, 3 కుండీలతో ప్రారంభించాలి. ఆకుకూరలు, మిరప, టమాటా, పుదీన, కొత్తిమీర పెంచడం ప్రారంభించాలి. అనుభవం వచ్చే కొద్దీ క్రమంగా మరిన్ని కుండీలు, మడులు పెట్టుకుంటూ పోవాలి. రాత్రికి రాత్రే ఏదీ రాదు. క్రమంగా నేర్చుకుంటూ.. థ్రిల్ ఫీలవ్వండి.

No comments: