all

Thursday, November 22, 2012

ఇండోర్ హెర్బల్ గార్డెన్ తో లాభాలెన్నో...

ఇండోర్ హెర్బ్ గార్డెన్ పెంచుకోవటం వల్ల చక్కటి ఆరోగ్యంతో పాటు. శరీర తత్వాన్ని దృడంగా ఉంచుకోవడానికి ఆయుర్వేద మూలికలను ఇండోడర్లో పెంచుకోవడం మంచిది. ఇండోర్ హెర్బ్ గార్డెన్ ను పెంచుకోవడానికి ఎక్కువ స్థలం అవసరం లేదు ఇండోర్ లో ఈ మొక్కలను పెంచడం వల్ల ఇంటికే ఒక ప్రత్యేక ఏర్పడుతుంది.
హెర్బల్ మొక్కలను పెంచుకోవడం వల్ల చాలా ఉపయోగాలున్నాయని గార్డెనింగ్ లవర్స్ మరియు నిపుణులు అనుభవపూర్వకంగా చెబుతున్నారు. హెర్బల్ గార్డెన్ మొక్కలను, మూలికలను ఆరోగ్యానికి, బ్యూటీ ట్రీట్ మెంట్ లోనూ, వంట పదార్థాలలోనూ ఉపయోగిస్తారు. అంతే కాదు ఇండోర్ గార్డెన్ లో హెర్బల్ మొక్కలను పెంచుకోవడం వల్ల చాలా రోజుల వరకు ఫ్రెష్ గా మనకు అందుబాటులో ఉంటాయి.


How Begin An Indoor Herb Garden Aid0069
రకరకాలైనటు వంటి హెర్బల్ మొక్కలను పెంచుకోవడం వల్ల మనకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ఆయురారోగాయ్యలకు ఉపయోగపడుతుంది. హెర్బల్స్ ను ఔషదాల్లో ఉపయోగించడం వల్ల ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇండోర్ గార్డెన్ వల్ల ఇంట్లో వారి మనస్సు ఆనందంగాను..ఆహ్లాదకరంగాను ఉంటుంది. అంతే కాకుండా ఇంటికి వచ్చే అతిథులను కూడా ఆకట్టుకొంటాయి. కొత్తిమీర, పుదీనా, తులసి, వేప, తుమ్మాకు, కలబంద, ఉమ్మెత్త, ఉల్లిపాయ, కరివేపాకు ఇలాంటి మొక్కలను పెంచుకోవడం వల్ల కొంచెం డబ్బు పొదుపు చేసినట్టు ఉంటుంది. అదే సమయంలో రకరకాల మొక్కలను ఒకే చోట పెంచినట్లు ఉంటుంది.
హెర్బల్ ఇండోర్ గార్డెన్ మొదటగా పెంచాలనుకొనే వారు మొదలు పెట్టక ముందే ఇండోర్ లో ఎలాంటి హెర్బల్ మొక్కలను పెంచుకోవాలో తెలుసుకొని, అవి ఎక్కడ దొరుకుతాయో తెలుసుకొని ఆ మొక్కలను సంబందించిన చిన్న మొక్కలను లేదా నారును తెచ్చి నాటుకోవలెను. అందుకు కావలసినటువంటి ఉపకరణాలు తెచ్చుకోవాలి. ఇలా ఒక పద్దతి ప్రకారం చేయగలితే హెర్బల్ గార్డెన్ తో ఎన్నో ఉపయోగాలున్నాయి.

No comments: