రాగి ముద్ద
రాయలసీమ వంటకాల్లో రాగిముద్ద ఎంతో పేరు గాంచింది. రోజువారీగా ఒక్కపూటైనా ఈ రాగిముద్ద తినకుండా సీమ వాసులు ఉండలేరంటే అతిశయోక్తి కాదేమో. రుచితో పాటు ఆరోగ్యాన్నిచ్చే ఈ రాగిముద్ద ఐటమ్ సీమవాసులకు చాలా ఇష్టం.
కావలసిన పదార్ధాలు:
రాయలసీమ వంటకాల్లో రాగిముద్ద ఎంతో పేరు గాంచింది. రోజువారీగా ఒక్కపూటైనా ఈ రాగిముద్ద తినకుండా సీమ వాసులు ఉండలేరంటే అతిశయోక్తి కాదేమో. రుచితో పాటు ఆరోగ్యాన్నిచ్చే ఈ రాగిముద్ద ఐటమ్ సీమవాసులకు చాలా ఇష్టం.
కావలసిన పదార్ధాలు:
బియ్యం నూకలు : 500 గ్రా. రాగి పిండి : 400 గ్రా. ఉప్పు : తగినంత
తయారు చేసే విధానం:
రాత్రి నూకలను నీళ్లలో వేసి నానపెట్టుకోవా లి. ఉదయం నానిన నూకలకు నీరు బాగా చేర్చి స్టౌ పై పెట్టి బాగా ఉడికించాలి. నూకలు బాగా ఉడికి జావలా అవుతాయి. తరువాత స్టౌ మీద నుండి గిన్నె దించి రాగి పిండిని బాగా కలపాలి. ఈ కలిపేటప్పుడు పిండి ముద్దలుముద్దలుగా ఉండకూడదు. మొత్తం రాగిపిండి జావలో కలిసిపోయి ముద్దగా అవతుంది. ఇపుడు రాగిముద్ద తయారైనట్లే. ఈ రాగి ముద్దను రాయల సీమవాసులు రుచికరమైన నాటుకోడి పులు సు, పొట్టేలు తలకాయమాంసం, మటన్ పులుసు, గుత్తి వంకాయ కూర, ముద్దపప్పు. పల్లీల చట్నీలతో కలిపి తింటే ఆ రుచే వేరని సీమవాసులు ఆనందంతో చెప్తారు.
నాటుకోడి పులుసు:
రుచికరమైన నాటు కోడి పులుసు రాయల సీమవాసులకు ఎంతో ఇష్టం. దీనిని వేడివేడి గా తినాలని సీమ వాసులు కోరుకుంటారు.
కావలసిన పదార్ధాలు:
నాటుకోడి మాంసం - 1 కేజి నూనె - 50 గ్రా. ఉల్లిపాయలు - 150 గ్రా. పచ్చిమిరపకాయలు - ఆరు అల్లం వెల్లుల్లి ముద్ద - సుమారు 100 గ్రా. ఉప్పు - తగినంత పసుపు - 1 స్పూను పెరుగు - 1 కప్పు కొబ్బరి పొడి - 2 టీ స్పూన్లు కారంపొడి - 1 స్పూను ధనియాలపొడి - 1 స్పూను కొత్తిమీర - 1 కట్ట పెరుగు - 1 కప్పు
తయారు చేసే విధానం:
ముందుగా కోడి మాంసాన్ని కడిగి శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక పెద్ద గిన్నెలో నూనె వేసి, ఆ నూనెలో తరిగిన ఉల్లిపాయలు, మధ్యగా కోసిన పచ్చిమిర్చీ, అల్లం వెల్లుల్లి పేస్టు, రెండు రెబ్బలు కరివేపాకు, పసుపు, ఉప్పు వేసి వేయించాలి. ఈ మొత్తం ముద్దను దోరగా వేగాక ఈ మొత్తం మిశ్రమంలో కప్పు పెరుగు వేసి ఉడికించాలి. తరువాత కోడిమాంసం వేసి మాంసంలో నీరు ఇగిరిపోయేదాకా ఉడికించాలి. తరువాత సరిపడా నీరు పోసి బాగా ఉడికించాలి. ఇప్పుడు మళ్లీ కారం, ధనియాల పొడి, కొబ్బరి పొడి వేసి కొద్దిగా ఉడికించాలి. ఇక ఘుమఘుమలాడే కోడి పులుసు రెడీ అవుతుంది. స్టౌమీద నుంచి పులుసును దించి తరిగిన కొత్తమీరను చల్లాలి. ఇక ఇప్పుడు సీమ వంటకం రుచికరమైన నాటు కోడి పులుసు సిద్ధం.
No comments:
Post a Comment