all

Thursday, November 22, 2012

ఎదిగే పిల్లలకు ఎటువంటి ఆహారం ఇవ్వాలి...?

మన జీవన విధానంలో పోషకాహార లోపం కారణంగా బాధపడే వారి సంఖ్య ఎక్కువ. సమతుల ఆహారం శరీరానికి అందకపోవడం ఒక కారణం అయితే, రకరకాల జంక్‌ఫుడ్(వేస్టేజ్) శరీరంలో హార్మోన్ల పనితీరును మందగించేలా చేస్తుంది. ఫలితంగా ఈ ప్రభావం ఎత్తు మీద పడుతుంది. సాధారణంగా 60 - 70 శాతం వరకు ‘ఎత్తు' ఆనువంశికంగా వస్తుంది. అయితే తల్లిదండ్రులు ఎత్తు ఎక్కువ ఉంటే పిల్లలు అంత హైట్ అవుతారని, తక్కువగా ఉంటే పొట్టిగా ఉంటారని కచ్చితంగా చెప్పలేం. వంశపారంపర్యంగా వచ్చే జన్యువులు, వాతావరణ పరిస్థితులు, ఆహారపు అలవాట్లు... ఇలా అన్నింటిమీదా ‘ఎత్తు' ఆధారపడి ఉంటుంది.

Healthy Diet Growing Kids
కాబట్టి పిల్లలు ఎత్తు బాగా పెరగాలంటే పుట్టుకతోనే సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిపాలు పిల్లలను ఆరోగ్యంగా ఎదిగేందుకు సహాయపడతాయి. బిడ్డకు తొమ్మిది నెలల వరకు తల్లిపాలు తప్పనిసరిగా ఇవ్వాలి. పిల్లలకు ఇచ్చే ఆహారంలో ప్రోటీన్లు, ఫ్యాట్, క్యాల్షియం, ఐరన్, బి-విటమిన్, జింక్, పిండి పదార్థాలు సమతూకంలో ఉండేలా జాగ్రత్తపడాలి. తృణధాన్యాలు, పాలు, చేపలు, ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు, నట్స్‌లో ఇవన్నీ లభిస్తాయి. భోజనానికి భోజనానికి మధ్య ఆకలి పుట్టేంత గ్యాప్ ఇవ్వాలి. మోతాదు ను మించిన ఆహారం తీసుకుంటే లావు అవుతారు తప్ప, ఎత్తు పెరగరు.
మార్కెట్లో దొరికే బూస్టర్లు తాగిస్తేనే ఎత్తు పెరుగుతారనుకోకూడదు. విటమిన్లు, న్యూట్రియంట్లు ఆహారంలో సమతూకంలో ఉండేలా జాగ్రత్తపడితే పిల్లల వయసు పదిహడేళ్లు వచ్చేవరకు తగినంత ఎత్తు పెరుగుతారు. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎలా ఇవ్వాలో చూడండి....
బ్రేక్ ఫాస్ట్ : గోధుమలతో తయారు చేసిన బ్రెడ్ జామ్ తో పాలు. గ్లాసుపాలు, ఉడకబెట్టిన గుడ్డు. పాలు, చీజ్ శాండివిచ్, ఉప్మా, ఇడ్లీతో పాటు గ్లాసు పాలు.
షార్ట్ బ్రేక్ సమయంలో ఫ్రూట్ సలాడ్ లేదా పళ్ళ ముక్కలు
మధ్యాహ్నం లంచ్ లో పరోటాలు లేదా చపాతీలతో పాటు కూరా లేదా పప్పు తప్పనిసరిగా ఉండాలి. అన్నం, పప్పు, కూరతో గడ్డ పెరుగు.
సాయంత్రం సమయంలో అరటిపండు షేక్, ఇంట్లో తయారు చేసిన కప్పు పాప్ కార్న్, బాదం, జీడిపప్పు, లాంటి నట్స్,
రాత్రి డిన్నర్ సమయంలో మధ్యాహనం ఇచ్చిన మెనూనే కొద్దిగా మార్చికూడా ఇవ్వొచ్చు. ఈ జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.

No comments: