ఇల్లంతా పచ్చదనంతో నింపేయాలని అందరికీ ఉంటుంది. అయితే స్థలాభావం, సమయం లేకపోవడం తదితర కారణాల వల్ల ఆ ఆసక్తిని కాస్తా పక్కన పెట్టేస్తుంటారు. అయితే కొంచెం సృజనాత్మకంగా ఆలోచించినట్లయితే... కేవలం మొక్కలతోటే ఇంటిని అందంగా తీర్చి దిద్దవచ్చు. అదెలాగంటే...
అవకాశం వుంటే ఇంట్లోనే చిన్న సైజ్ గార్డెన్‌ను ఏర్పాటు చేసు కోవాలని కొందరు కోరుకుంటారు. ఇటువంటి వారి అభిరుచికి తగ్గట్టుగా నేడు గార్డెనింగ్ అత్యంత ప్రాధాన్యతను సంతరిం చుకుంది. చాలామంది నగరవాసులు తమకున్న కొద్దిపాటి స్థలంలో వివిధ ఆకృతులను రూపొం దించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలాం టి వారికోసం గార్డెనింగ్‌లో కొన్ని మెళకువలను పాటిస్తే చాలంటున్నారు గార్డెనింగ్ నిపుణులు.
చిన్న చిన్న గాజు పాత్రలు, సీసాల్లో మొక్కలు పెంచటం గృహాలంకరణకు దోహదం చేసే ఓ చక్కటి హాబీ. దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. వాడని గాజు సీసాలు, పాత్రలు, ఆక్వేరియం బాక్సులు లాంటి వాటిల్లో మట్టి, రంగురంగుల గులకరాళ్లు, ఇసుక, బొగ్గు, ఇటుక ముక్కలు, ఎరువులను పోసి సిద్ధం చేసుకోవాలి. నెమ్మదిగా ఎదిగే పచ్చని మొక్కల్ని... అలాగే నీరు తక్కువగా అవసరమయ్యే మొక్కలను పెంచుకునేందుకు ఎంచుకోవాలి. గాజు పాత్ర తీసుకుని ముందుగా ఇటుకరాళ్ల ముక్కలు, ఆ తర్వాత బొగ్గులు, ఇసుక, మట్టి వేస్తూ.. మధ్యలో మొక్కని నాటాలి. చివరగా అందంగా కనిపించేందుకు గులకరాళ్లు, గవ్వలు పేర్చవచ్చు.
ఇలాంటి మొక్కలను గాజు పాత్రలో నాటినందువల్ల ఎక్కువైన నీరు బయటికి పోదు కాబట్టి నీరు ఎక్కువగా పోయకూడదు. మొక్క ఎండిపోతున్నట్లు అనిపించినా, ఇసుక మరీ పొడిగా కనిపిస్తున్నా, తరచుగా నీళ్లు చిలకరిస్తూ ఉంటే సరిపోతుంది. సూర్యరశ్మి ఎక్కువగా సోకని ప్రదేశంలో ఈ మొక్కలను ఉంచాలి. పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే... ఇల్లంతా అందమైన మొక్కలను గాజు పాత్రల్లో సుమనోహరంగా, మీ అభిరుచికి తగినట్లుగా ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే దీనికి కావాల్సిందల్లా కాస్తంత ఓపిక మాత్రమే. ఆ ఓపిక మాత్రం తెచ్చుకున్నారంటే, అందమైన పచ్చటి మొక్కలతో ఇల్లు నిండిపోవడం ఖాయం.

No comments:
Post a Comment