all

Thursday, November 22, 2012

పెరటి తోట సహజ అందాలు పెంచండిలా...!

నగరాల్లో ఇంటి దగ్గరే కూరగాయలు, పండ్లు, వివిధ రకాల మొక్కలను పెంచుకోవాలనుకునే వారు, మొక్కలను పెంచుకోవాలని ఆసక్తి ఉన్నప్పటికీ సరైన మట్టి అందుబాటులో లేకపోవడం, స్థలాభావం, రోజువారీ విధుల వల్ల విశ్రాంతి లేకపోవడం, నీటి సమస్య తదితర అనేక కారణాల వల్ల ఇంటి పంట పండించుకోలేకుంటారు.
అయితే స్థలం లేకపోయానా కిటికీల వద్ద, ఆరు బయట, టై మీద ఇలా కాస్త ఖాళీ స్థలం ఎక్కడ ఉంటే అక్కడ మొక్కలను పెంచవచ్చు. అలాగే రోజూ మొక్కల మొయిటైనెన్స్ కొరకు డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాట్లు, సెల్ఫ్ వాటరింగ్ పాట్స్ ద్వారా మొక్కలకు రోజూ నీరు పోసే పని లేకుండా చేసుకోవచ్చు. తద్వారా ఒకసారి నీరు పోస్తే చాలు.. చాలా రోజుల పాటు ఆ నీరు మొక్కలకు అందుబాటులో ఉండే విధంగా చేసుకొన్నట్లైతే ఇంటిని రకరకాలైనటువంటి మొక్కలలతో నందనవనంలా మార్చుకోవచ్చు.
Water Dripping Self Watering Containers Aid0069

ఇంటి పరిసరాలలో మొక్కలు నాటడంతోనే అంతా అయిపోదు. వాటిని ఆరోగ్యవంతంగా పెంచేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మొక్కలను మరింత మెరుగ్గా పెంచుకోవాలంటే, మట్టితోపాటు, నీరు, సూర్యరశ్మి.. ఇంకా అనేక విషయాలు మొక్కల పెరుగుదలకు దోహదపడతాయి. వంటింటి వ్యర్థాలతో కంపోస్టును తయారుచేసుకునే వాటిపై చక్కటి అవగాహన కలిగి ఉండాలి.
మొక్కలకు ప్రతి రోజూ అవసరమైనంత నీటిని అందిస్తే దాంతో మంచి ఫలితాలు లభిస్తాయి. వంటింటి వ్యర్థాలతో కంపోస్టు సాధారణ మట్టిని వినియోగించి ఇంటి వద్ద కూరగాయలు, పండ్ల మొక్కలతోపాటు వివిధ రకాల మొక్కలు నాటుకోవచ్చు. ఇంటి దగ్గర పెంచుకొనే మొక్కలకు వాడేసిన ఖాళీ ప్లాస్టిక్ సీసాల్లో నీరు నింపి.. మూతకు చిన్న వత్తిని ఏర్పాటుచేసి.. ఆ సీసాను తల్లకిందులుగా వేలాడగట్టడం ద్వారా బొట్లు బొట్లుగా నీరు మొక్కలకు అందేలా ఏర్పాటు చేసుకోవచ్చు.
మూతి వెడల్పుగా ఉండే ప్లాస్టిక్ సీసాలను సగానికి అడ్డంగా కత్తిరించి.. సెల్ఫ్ వాటరింగ్ కంటెయినర్స్‌ను తయారు చేసుకోవచ్చు. కింది సగంలో నీరు, పై సగంలో మట్టి పోసి.. కిరోసిన్ దీపం మాదిరిగా దీనికి వత్తి పెట్టి, వత్తి ద్వారా అవసరమైనంత నీటిని మట్టిలో పెరిగే మొక్క తీసుకుంటుంది. దీంతో రోజూ మొక్కలకు నీరు పోయాల్సిన అవసరం లేదు. కొన్ని మొక్కలకు వారానికోసారి నీరు పోయాల్సి ఉంటుంది. కొన్నిటికి రెండు నెలలపాటు ఆ నీరే సరిపోతాయి. వాతావరణం, వాడిన సీసా, దానికి వత్తిని అమర్చే తీరును బట్టి నీటి వినియోగం ఆధారపడి ఉంటుంది. ఇంట్లో సీతాకోక చిలుకలు, తేనేటీగలకు అనువుగా ఉండే మొక్కలనూ పెంచుకున్నా. చక్కటి గార్డెన్‌కు ఇవీ కూడా అవసరమే....!

No comments: