all

Thursday, November 22, 2012

ఈ మొక్కను ఇంట్లో పెంచితే సంపదే...సంపద

బ్యాంబు ట్రీ:-(చైనా వెదురు చెట్టు) ఇవి చైనాలో పుట్టినవైనప్పటికి ఇండియాలో ఫెంగ్ షూ ఇల్లలో భాగంగా అతిగా పెంచుతున్నారు. లక్కీ బాంబూ ప్లాంట్ అంటే నాలుగు వెదురు బద్దలు ఒక ఎర్ర రిబ్బన్ తో కట్టి వుంటాయి. ఇది కుటుంబంలో ఐకమత్యానికి చిహ్నంగా భావిస్తారు. అదృష్టాన్ని తెచ్చిపెట్టే ఈ మొక్కలు రకరకాల ఆకృతులలో రూపొందించిన కుండీలలో లభ్యమవుతున్నాయి. దీనినే అలంకరణగా కూడా పరిగణిస్తారు. ఇది మన నవగ్రహాలలో బుథ గ్రహానికి చెందినది. ఇది వ్యాపార సంస్థలలో ఉంచితే వ్యాపారం దిన దినాభివృథ్ధి చెందుతుంది. (చెట్టు పెరిగినట్టు పెరుగుతుంది. వ్యాపార సంస్థలలో నరథిష్టికి' ఆకర్షణకు, వ్యాపారభివృథ్థికి చాలా మంచిదని భావిస్తారు.


Indoor Lucky Bamboo Plants Aid0069
వీటిని గృహాలకంరణలో భాగంగా చాలా మంది తమ ఇళ్లలో ‘ఇండరో మొక్కల’ను పెంచుకుంటున్నారు. అయితే ఇప్పుడో తాజా ట్రెండ్ మొదలైంది. ‘వెదురు మొక్కలను’ లక్కి ప్లాంట్స్‌గా అభివర్ణించుకుంటున్న పలువురు ఈ మొక్కలను ఇళ్లలో పెంచితే ‘ధన బలం’ పెరుగుతుందని విశ్వసిస్తున్నారు. ఈ సంస్కృతి అలా అలా వ్యాపించటంతో ఇళ్లలోనే కాదు ఆఫీసుల్లోనూ, దుకాణ సముదాయాల్లో ఎక్కడ చూసిన ఈ మొక్కలే దర్శనమిస్తున్నాయి.
ఈ మొక్కలను పెంచటం చాలా సులవైన పద్ధతి.. మట్టి, ఎండ దీనికి అవసరం లేదు. కుండీలో నీటిని మాత్రం క్రమం తప్పకుండా మారుస్తే చాలు. అయితే నీరు మాత్రమే అవసరమైన ఇండోర్ ప్లాంట్స్ ను గాజు కుండీలలో పెంచితే ఇంటికి అందం వస్తుందని ఇప్పుడు ఎక్కువగా ఇంట్లో పెంచుకొంటున్నారు...
పిల్లలు చధువు కొనే టేబుల్ దగ్గర ఉంచితే మంచి తెలివితేటలు, చదువుపై శ్రద్ద ,సరియైన సమయంలో (పరీక్ష సమయములలో) గుర్తుకు వచ్చే ఆలోచనలు(క్రియేటివిటి) .మంచి వాక్ చాతుర్యం కలిగి ఉంటారని కొంతమంది నమ్మకం.
ఇంటిలో సింహా ద్వారానికి ఎదురుగా ఉంచితే వీథిపోటు ,నరదృష్టి ,కనుదృష్టి,చెడు ఎనర్జీని తీసివేసి పాజిటివ్ ఎనర్జీని కలిగించి మంచి అన్యోన్నత ,ఒకరిపై ఒకరికి ప్రేమానురాగాలు కలిగి ఎప్పుడు సుఖశాంతులు, థనాభివృద్దితో ఇల్లు కళకళ లాడుతుంది

No comments: