కొన్ని వస్తువులు కొన్నాళ్లు వాడాక పాతబడిపోతాయి. వాటిని పారేద్దామంటే పర్యావరణానికి హాని కలుగుతుందేమోనని సందేహంతో ఇంట్లోనే ఉంచేసుకుంటాం. అలా ఉంచుకునేసరికి కొన్నిరోజులకి ఇంట్లో తట్టెడంత చెత్త పేరుకుని ఉంటుంది. వాటిని ఉంచలేక పారేయలేక సందిగ్థంగా ఉంటుంది మీ మనసు. అలాంటప్పుడు మెదడుకి కాస్తంత పదును పెడితే సరి. అద్భుతమైన కళాఖండాలు తయారవుతాయి.
గాజు పాత్రలు, హ్యాండ్‌బ్యాగులు, టీ కెటిల్స్, ప్లాస్టిక్ వస్తువులు ఉంటే వాటిని కళాత్మకంగా తీర్చిదిద్దుకోవచ్చు. ఇలా చేయడం వలన ఈ వేసవిని వేడిగా కాకుండా మనసుకి ఆహ్లాదం కలిగేలా చేసుకోవచ్చు. ఇందుకోసం కావలసింది కొద్దిగా మట్టి, అందమైన రాళ్లు, చిన్నచిన్న మొక్కలు ఉంటే చాలు. వాటితో పాతవస్తువులకు కొత్తరూపం తీసుకువచ్చి, ఇంటిని స్టార్ హోటల్ గా మార్చేయవచ్చు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. 1. గాజు గ్లాసులో కొద్దిగా మట్టి వేసి అందులో చిన్న ఇండోర్ ప్లాంట్‌ని అమర్చి, కొద్దిగా నీరు పోస్తే చాలు, వేళ్లతో సహా మొక్క కనిపిస్తూ ఎంతో అందంగా ఉంటుంది. 2. గాజు బౌల్‌లో సగం వరకు మాత్రమే మట్టి పోసి, పైన అందమైన రంగురంగుల గులకరాళ్లు వేసి, కలబంద లాంటి మొక్కను ఉంచితే, గాజు బౌల్‌లో మట్టి, రాళ్లతో పాటు మొక్క కూడా కనువిందు చేస్తుంది. 3. చాలాకాలంగా అటకె క్కిన టీ కెటిల్స్‌ని కిందకి దించి శుభ్రంగా కడిగి, అందులో నీళ్లు పోసి, ఆర్టిఫీషియల్ ప్లాంట్ అమర్చి, టీవీ వంటి వాటి మీద పెట్టండి. గది రూపం మారిపోతుంది. 4. ప్లాస్టిక్ బూట్లు, బకెటు, మగ్గుల వంటివి ఉంటే వాటిని ఒక్కసారి శుభ్రంగా కడిగి, ఇంకా అందంగా అనిపించకపోతే పైన రంగురంగుల కాగితాలు అంటించి, ఆ పాత్రలో ప్లాస్టిక్ పూలు కాని, ప్లాస్టిక్ మొక్కలు కాని వేసి రూమ్ కార్నర్‌లో డెకొరేట్ చేస్తే గది అందం రెట్టింపవుతుంది. 5. పాతబడిన పూలబుట్ట ఉంటే, ఒక్కసారి దాని దుమ్ము దులిపి, అందులో మట్టి వేసి, అందమైన క్రీపర్‌లాంటివి పెట్టి, గుమ్మం ముందు ఇంటి పైకప్పుకి ఉండే హుక్‌కి తగిలించండి. ఇంట్లోకి వస్తున్న వారికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ, తల మీద పూలు చల్లుతున్న భావన కలుగుతుంది. ఇవే కాదు... మీ మనసుకి నచ్చేవిధంగా, మీ ఇంటికి సరిపోయే విధంగా పాతవస్తువులను కొత్తగా తయారుచేయండి. ఇంటిని కొత్తగా మార్చేయండి. |
all
-
స్త్రీ తన శరీరంలో మరో జీవికి ప్రాణం పోస్తున్న సమయం, అంటే గర్భవతిగా మారేటప్పుడు రకరకాల మార్పుల్ని శరీరం సూచిస్తుంది. సహజంగా ఈ మార్పులు సున్న...
-
అందం విషయంలో కేశాలు కూడా ప్రదానం. ఎందుకంటే అందమైన జుట్టు వారి అందాన్ని మరింత ఎక్కువగా చూపెడుతుంది. అందమైన అలలులా ఎగసిపడే జుట్టు మరియు పొడవ...
-
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న తర్వాత మహిళలు అంతకుమునుపు ఆహారం ఎలా తీసుకున్నా అప్పట్నుంచి మాత్రం తినే పదార్థాల్లో ఉప్పు, చక్...
-
బ్లడ్ ప్రెషర్(బిపి) అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో మారుతున్న జీవిన శెలితో పాటు ఆనారోగ్యాలు కూడా ఎక్కువవుతున్నాయి. అందులో...
-
తల్లిపాలు శిశువుకు అమృతంలాంటివి. తల్లిపాలు శ్రేష్టం, ఎంతో ముఖ్యమైన సంపూర్ణ పౌష్టిక ఆహారం. తల్లికి బిడ్డకు ఆరోగ్యవంతమైనది. ఇద్దరి మధ్య మంచి ...
-
డాక్టర్ని అడగండి నా వయసు 20. మలవిసర్జన సమయంలో మల ద్వారం నుంచి రక్తం పడుతోంది. మలవిసర్జనకు వెళ్లినప్పుడు లోనుంచి చిన్న ...
-
http://www.scribd.com/doc/119728850/DHYANAM-DANI-PADHATULU-SWAMI-VIVEKANANDA-SWAMI
-
తెలుగింటి ఆనవాళ్లు... ఆరుగజాల సొగసు చీరలు. తెలుగింటి కళలు... కమనీయకాంతుల చీరలు. తెలుగింటి సింగారాలు... సిరులొలికించే...
-
పాన్ లో ఉల్లిపాయలు ఎర్రగా వేగుతుంటే కొబ్బరి దానికి జతగా చేరితే పెరుగు ఒక అడుగు పసందుగా వేస్తుంది. మీగడ ఒద్దిగకగా ఒదిగిపోతుంది. ఇలంతా ఘుమ...
-
గైనిక్ కౌన్సెలింగ్ నేను ఇప్పుడు మూడో నెల గర్భవతిని. మా అమ్మమ్మ రోజూ పాలలో కుంకుమపువ్వు క...
Saturday, April 6, 2013
వేసవి అంటే ఆహ్లాదం కూడా!
రియల్ ఎస్టేట్ వర్సెస్ షేర్ మార్కెట్
డబ్
ఎంత చెప్పుకున్నా రియల్ ఎస్టేట్ తర్వాత అత్యధిక ఆదాయాన్ని ఇచ్చేవి షేర్లు మాత్రమే. వీటి రెండింటి లక్షణాలు పరిశీలిస్తే...
రియల్ ఎస్టేట్ కొనేటపుడు మోసపోకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకేసారి పెద్దమొత్తంలో పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఇది అన్నివర్గాలకు అందుబాటులో ఉండదు. అవసరమైన వెంటనే అమ్మలేం. అమ్మేటపుడు సమయానికి మంచి డీల్ రావాలి. వెంటనే డబ్బు కట్టి కొనే వ్యక్తి దొరకాలి. అంతా సక్రమంగా జరిగితేనే సమయానికి డబ్బు చేతికి అందుతుంది. షేర్ మార్కెట్ ఎప్పుడయినా పెట్టుబడి పెట్టొచ్చు. ఎవరైనా కొనవచ్చు. విడతలవారీగా కూడా పెట్టుబడి పెట్టొచ్చు. స్థలం కొనే స్థోమత లేనివారు ఎక్కువ ఆదాయం పొందాలనుకుంటే ఫిక్స్‌డ్ డిపాజిట్ల వంటి సంప్రదాయ పద్ధతుల్లోనే కాకుండా ఇలాంటివాటిలో పెట్టుబడి పెట్టుకుంటే మంచి ఆదాయం పొందొచ్చు. షేర్ల గురించి తెలియని వారు మ్యూచువల్ ఫండ్ల ద్వారా తొలుత వీటిలో అడుగు పెట్టొచ్చు. అవగాహన పెంచుకున్నాక కంపెనీల షేర్లను నేరుగా కొనొచ్చు. ఇటీవల మార్కెట్ బాగా తగ్గింది. ఇపుడు మొదలుపెట్టిన వారు మంచి లాభాలు పొందే అవకాశాలుంటాయి. వారెన్ బఫెట్ చెప్పినట్టు అందరూ భయపడేటపుడు నువ్వు ధైర్యం చెయ్యి!. |
దుస్తులపై మరకలు పోవాలంటే............................ఇంటిరియం
ఒక మంచి చీర కాని, డ్రెస్ కాని, ప్యాంట్ షర్ట్ కాని... దేనిమీదైనా మరక పడితే ‘ఎంతో ఖర్చుపెట్టి కొన్నాం. ఇది ఇంకెందుకూ పనికిరాదు’ అని బాధపడతాం. అందువల్ల ఉపయోగం లేదు. అలా బాధపడకండి. మొండిమరకల్ని సైతం పోగొట్టవచ్చు. అందుకు కొన్ని చిట్కాలు పాటించాలి. అంతే!
కోడిగుడ్డు మరకలు... కోడిగుడ్డు మ రకలు పోవడానికి పెద్ద కష్టపడక్కర్లేదు. కేవలం చిన్నచిన్న చిట్కాలతో ఆ మరకల్ని పోగొట్టవచ్చు. అవి... పదును లేని కత్తి లేదా స్పూన్ తీసుకుని గుడ్డు మరక పడిన చోట బాగా గోకాలి. ఇలా చేయడం వలన వస్త్రంమీద పడిన పదార్థం కొంతవరకు పోతుంది. ఆ తరవాత... పరిశుభ్రంగా ఉన్న వస్త్రాన్ని నీటిలో ముంచి, మిగిలిన మరకను శుభ్రం చేయాలి. చల్లని నీరుపోసి మరక పడినచోట స్పాంజ్‌తో ఆ వస్త్రాన్ని ముందు, వెనక కూడా తుడవాలి. ఇలా చేయడంవల్ల డ్రెస్‌ని నీళ్లలో నానబెట్టగానే మరక సులువుగా పోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మరక ఎండిపోయి వస్త్రం మీద అతుక్కుపోయి ఉంటే, లిక్విడ్ లాండ్రీ డిటర్జెంట్‌తో ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయాలి. అప్పుడు వస్త్రానికి అంటుకుపోయిన గుడ్డు మరక పూర్తిగా పోతుంది. సూచన: వస్త్రం నాణ్యతను బట్టి ఈ సూచనలు పాటించవలసి ఉంటుంది. ఏ ఏ ఏ నూనె మరకలు... వస్త్రం మీద నూనె మరక పడినప్పుడు పదును లేని చాకుతో ముందుగా నూనె తొలగించాలి. అప్పుడు మరకను తొలగించడం సులభం అవుతుంది. లిక్విడ్ డిటర్జెంట్‌ని మరక ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. చాలావరకు లిక్విడ్ డిటర్జెంట్లు జిడ్డును పోగొట్టగలిగేలా ఉంటాయి. మరక మరీ ఇబ్బందిపెట్టేలా ఉంటే మాత్రం లిక్విడ్ డిష్‌సోప్ ఉపయోగించడం మంచిది. వస్త్రం మీద లిక్విడ్ వేశాక సుమారు 5 నిముషాలపాటు అలాగే ఉంచాలి. అప్పుడు డిటర్జెంట్ మరక ఉన్న ప్రదేశమంతా వ్యాపించి, జిడ్డు త్వరగా పోవడానికి అవకాశం ఉంటుంది. వేడినీటితో ఉతికితే మంచిది. నీరు ఎంత వేడిగా ఉంటే జిడ్డుమరక అంత త్వరగా పోతుంది. ఉతికే ముందు, ఆ వస్త్రాన్ని ఏ నీటితో ఉతకాలి అనే దాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. వస్త్రం ఆరవేయడానికి ముందుగానే మరక పూర్తిగా పోయిందో లేదో పరిశీలించాలి. ఒకవేళ మరక ఇంకా ఉన్నట్టుగా అనిపిస్తే మళ్లీ ఈ పద్ధతిని మొదటి నుంచీ చేయాలి. |
లక్ష్మీ కటాక్షం పొందాలంటే...
మీకు తెలుసా?
- పూజా మందిరంలో లక్ష్మీదేవి విగ్రహంతో బాటు స్ఫటిక గణపతి విగ్రహాన్ని కూడా ఉంచడం మంచిది.
- లక్ష్మీదేవికి ఐదువత్తులతో ఆవు నేతితో దీపారాధన చేస్తే ఆర్థికపరమైన కోరికలు ఫలిస్తాయి. - ధన సంబంధమైన కార్యకలాపాలను సోమవారం లేదా బుధవారం నాడు నిర్వర్తించడం మంచిది. - గురువారం నాడు ముత్తయిదువలకు పసుపు రాసి, బొట్టు పెట్టి మంగళకరమైన వస్తువులను ఇస్తే మంచిది. |
Subscribe to:
Posts (Atom)