డబ్
ఎంత చెప్పుకున్నా రియల్ ఎస్టేట్ తర్వాత అత్యధిక ఆదాయాన్ని ఇచ్చేవి షేర్లు మాత్రమే. వీటి రెండింటి లక్షణాలు పరిశీలిస్తే...
రియల్ ఎస్టేట్ కొనేటపుడు మోసపోకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకేసారి పెద్దమొత్తంలో పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఇది అన్నివర్గాలకు అందుబాటులో ఉండదు. అవసరమైన వెంటనే అమ్మలేం. అమ్మేటపుడు సమయానికి మంచి డీల్ రావాలి. వెంటనే డబ్బు కట్టి కొనే వ్యక్తి దొరకాలి. అంతా సక్రమంగా జరిగితేనే సమయానికి డబ్బు చేతికి అందుతుంది. షేర్ మార్కెట్ ఎప్పుడయినా పెట్టుబడి పెట్టొచ్చు. ఎవరైనా కొనవచ్చు. విడతలవారీగా కూడా పెట్టుబడి పెట్టొచ్చు. స్థలం కొనే స్థోమత లేనివారు ఎక్కువ ఆదాయం పొందాలనుకుంటే ఫిక్స్‌డ్ డిపాజిట్ల వంటి సంప్రదాయ పద్ధతుల్లోనే కాకుండా ఇలాంటివాటిలో పెట్టుబడి పెట్టుకుంటే మంచి ఆదాయం పొందొచ్చు. షేర్ల గురించి తెలియని వారు మ్యూచువల్ ఫండ్ల ద్వారా తొలుత వీటిలో అడుగు పెట్టొచ్చు. అవగాహన పెంచుకున్నాక కంపెనీల షేర్లను నేరుగా కొనొచ్చు. ఇటీవల మార్కెట్ బాగా తగ్గింది. ఇపుడు మొదలుపెట్టిన వారు మంచి లాభాలు పొందే అవకాశాలుంటాయి. వారెన్ బఫెట్ చెప్పినట్టు అందరూ భయపడేటపుడు నువ్వు ధైర్యం చెయ్యి!. |
No comments:
Post a Comment