all

Saturday, April 6, 2013

దుస్తులపై మరకలు పోవాలంటే............................ఇంటిరియం

 

 
ఒక మంచి చీర కాని, డ్రెస్ కాని, ప్యాంట్ షర్ట్ కాని... దేనిమీదైనా మరక పడితే ‘ఎంతో ఖర్చుపెట్టి కొన్నాం. ఇది ఇంకెందుకూ పనికిరాదు’ అని బాధపడతాం. అందువల్ల ఉపయోగం లేదు. అలా బాధపడకండి. మొండిమరకల్ని సైతం పోగొట్టవచ్చు. అందుకు కొన్ని చిట్కాలు పాటించాలి. అంతే!
కోడిగుడ్డు మరకలు...

కోడిగుడ్డు మ రకలు పోవడానికి పెద్ద కష్టపడక్కర్లేదు. కేవలం చిన్నచిన్న చిట్కాలతో ఆ మరకల్ని పోగొట్టవచ్చు. అవి...
పదును లేని కత్తి లేదా స్పూన్ తీసుకుని గుడ్డు మరక పడిన చోట బాగా గోకాలి. ఇలా చేయడం వలన వస్త్రంమీద పడిన పదార్థం కొంతవరకు పోతుంది. ఆ తరవాత... పరిశుభ్రంగా ఉన్న వస్త్రాన్ని నీటిలో ముంచి, మిగిలిన మరకను శుభ్రం చేయాలి.

చల్లని నీరుపోసి మరక పడినచోట స్పాంజ్‌తో ఆ వస్త్రాన్ని ముందు, వెనక కూడా తుడవాలి. ఇలా చేయడంవల్ల డ్రెస్‌ని నీళ్లలో నానబెట్టగానే మరక సులువుగా పోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మరక ఎండిపోయి వస్త్రం మీద అతుక్కుపోయి ఉంటే, లిక్విడ్ లాండ్రీ డిటర్జెంట్‌తో ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయాలి. అప్పుడు వస్త్రానికి అంటుకుపోయిన గుడ్డు మరక పూర్తిగా పోతుంది. సూచన: వస్త్రం నాణ్యతను బట్టి ఈ సూచనలు పాటించవలసి ఉంటుంది.
ఏ ఏ ఏ

నూనె మరకలు...
వస్త్రం మీద నూనె మరక పడినప్పుడు పదును లేని చాకుతో ముందుగా నూనె తొలగించాలి. అప్పుడు మరకను తొలగించడం సులభం అవుతుంది. లిక్విడ్ డిటర్జెంట్‌ని మరక ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. చాలావరకు లిక్విడ్ డిటర్జెంట్లు జిడ్డును పోగొట్టగలిగేలా ఉంటాయి. మరక మరీ ఇబ్బందిపెట్టేలా ఉంటే మాత్రం లిక్విడ్ డిష్‌సోప్ ఉపయోగించడం మంచిది.

వస్త్రం మీద లిక్విడ్ వేశాక సుమారు 5 నిముషాలపాటు అలాగే ఉంచాలి. అప్పుడు డిటర్జెంట్ మరక ఉన్న ప్రదేశమంతా వ్యాపించి, జిడ్డు త్వరగా పోవడానికి అవకాశం ఉంటుంది. వేడినీటితో ఉతికితే మంచిది. నీరు ఎంత వేడిగా ఉంటే జిడ్డుమరక అంత త్వరగా పోతుంది. ఉతికే ముందు, ఆ వస్త్రాన్ని ఏ నీటితో ఉతకాలి అనే దాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి.
వస్త్రం ఆరవేయడానికి ముందుగానే మరక పూర్తిగా పోయిందో లేదో పరిశీలించాలి. ఒకవేళ మరక ఇంకా ఉన్నట్టుగా అనిపిస్తే మళ్లీ ఈ పద్ధతిని మొదటి నుంచీ చేయాలి.
 

No comments: