మీకు ఇంక ఆకలి కావడంలేదు, మీరు తినడం ఆపి వేయచ్చు అనే ‘సంకేతం' మీ మెదడు మీకు అందించడానికి సుమారు 20 నిమిషాలు పడుతుంది - ఈ సూత్రం పై ఆధారపడి మెల్లిగా తింటే ఎక్కువ తినకుండా ఉండవచ్చు అనే సిద్ధాంతం ఏర్పడింది. మెల్లిగా తింటూ వుంటే మీకు అసలైన ఆకలి సంకేతాలు బాగా అర్ధమై, కేవలం భావావేశం వల్లనా లేక ఆహార పదార్ధం ఏదైనా నచ్చడం వల్లనా అనే వాటిలో మీరు ఏ కారణం చేత వేగంగా తింటారో మీరు గుర్తిస్తారు. ఐతే మెల్లిగా తినడం అనేది మీరు ఆ క్షణంలో తీసుకునే నిర్ణయం కాదు, పైగా అది మీరు శ్రమ చేసి, సాధన చేసి చేసుకోవలసిన అలవాటు.
చర్యలు:
1. మీ మెదడును రీ-ప్రోగ్రాం చేయండి. మీ మనసులో ముందుగా 21 రోజుల పాటు సాధన చేసిన తర్వాత గానీ మెల్లిగా తినడం అనే అలవాటు చేసుకోవడానికి ప్రయత్నించకండి. విశ్రాంతిగా వుండి మీ ఊహాశక్తిని ఉపయోగించి మీ మెదడు నమోదు చేసుకుని గుర్తుంచుకునే మానసిక చిత్రాలను, అధివాస్తవిక ఆనందకర అనుభవాలను తయారు చేసుకోండి. ఈ చిత్రీకరణ ప్రక్రియలో భాగంగా మిమ్మల్ని మీరు సన్నగా, ఆరోగ్యంగా ఊహించుకోండి.నిదానంగా తినండి రుచిని, దాని తయారీని రెండిటినీ ఆస్వాదిస్తూ తినండి.మీ కడుపు బరువుగా ఉందని అనిపించడానికి ఒక గ్లాస్ నీటిని మీ భోజనం ముందు, భోజనం సమయంలో, తర్వాతా తాగుతున్నట్టు చూస్తూ ఉండండి.సన్నని, ఆరోగ్యకరమైన, ఉత్సాహకరమైన శరీరం లాంటి మీరు కోరుకున్న ఫలితాన్ని చిత్రీకరించుకోండి.
2. మీ వంటగదినుంచి సాధ్యమైనన్ని ప్రాసెస్ చేసిన ఆహారాలను తీసివేయండి. మెల్లిగా తినడం అంటే నెమ్మదిగా నమలడమే కాదు; మీ ఆహారపు ఎంపికలను, తయారీ విధానాలను కూడా నెమ్మదింప చేయడం. ప్రాసెస్ చేసిన ఆహారాలను తీసివేయగానే, ప్రాసెస్ చేయని లేదా తక్కువగా ప్రాసెస్ చేయబడిన ఆహారాలతో నింపండి. ఉదాహరణకు, వైట్ పాస్తా, వైట్ రైస్ తీసివేసి దాని బదులు హోల్ మీల్ పాస్తా, ఎర్రటి బియ్యం వాడండి. ముందే సిద్ధం చేసి డబ్బాల్లో ఉంచిన ఆహారం, శీతలీకరించిన ఆహారాలు తీసివేసి, వాటి స్థానంలో ఆయా పదార్ధాలను మొదటి నుంచి తిరిగి తయారు చేయండి. ప్రాసెస్ చేసిన మిఠాయిలకు బదులు పళ్ళు, మీగడ లాంటి ఆరోగ్యకరమైన పదార్ధాలు నింపండి.
3. మీకు ఆకలి వేయడం మొదలు పెట్టాక తినడానికి ప్రయత్నించండి. బాగా కళ్ళు తిరిగేలా వుండి, నీరసం వచ్చి, చిరాకు పడుతుంటే మీ శరీరానికి ఎంతో సేపటి నుంచి అవసరమైన ఆహారాన్ని మీరు అందించ లేదన్నమాట - తత్ఫలితంగా మీరు ఆహారాన్ని విశ్రాంతిగా ఆస్వాదిస్తూ తినలేకపోవడం జరుగుతుంది.
4. తినే ముందు బాగా విశ్రాంతిగా వుండండి. ముక్కు తో కొన్ని దీర్ఘ శ్వాసలు తీసుకుని, నోటితో వదిలేయండి. మీరిలా చేస్తున్నప్పుడు, కొద్ది క్షణాల పాటు శ్వాసను బిగబట్టండి, నోటి ద్వారా నెమ్మదిగా వదల౦డి. తినడం మొదలు పెట్టె ముందు ఒత్తిడి నుంచి బయట పదండి - అలా చేస్తే, ఆహారం వల్ల వత్తిడి నుంచి బయటపడేలా చేసే సౌకర్యంగా తినే ప్రమాదం నుంచి బయట పడతారు; మీ వత్తిడి నుంచి బయట పడడానికి తిండి తో సంబంధం లేకుండా చూసుకోండి. దీని వల్ల వచ్చే లాభాలను గుర్తు చేసుకోండి (మంచి ఆరోగ్యం, చక్కగా కనబడడం లాంటివి)
5. ప్రధాన భోజనం మొదలు పెట్టె ముందు ఒక గ్లాసు మంచి నీళ్ళు లేదా ఒక చిన్న గిన్నెతో సూప్ లాంటివి తీసుకోండి. మీ ఆహారంతో నీరు తాగండి. దీని వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది.
6. ఆహరం నోటిలోకి తీసుకున్నాక, ఫోర్క్ ని క్రింద పెట్టేయండి. ఒక గుక్క నీళ్ళు తాగి, ఏదైనా సంభాషించండి. ప్రతి ముద్దనూ ఆస్వాదించండి, మళ్ళీ తిరిగి తినాలనిపించేలాంటి ఆనందకరమైన అనుభవంగా దాన్ని తయారు చేయండి. నింపాదిగా తినడం సారాంశం ఇది - మీరు ఎవరితో భోజనం చేస్తుంటారో వారితో తిరిగి సంబంధం కలిగి ఉండడానికి సంబంధించినది - మీ భోజనాన్ని మంచి విరామ సమయం గా పరిగణించండి.
7. మీ ఆహారం మీద శ్రద్ధ పెట్టి దాన్ని ఆస్వాదించండి. మీ మెదడు ఆ ఆనందకరమైన అనుభవాన్ని నమోదు చేస్తుంది - ఇక సాధనతో ఈ క్రొత్త తినే అలవాటు సాధారణం అయిపోతుంది. అంటే దీని అర్ధం టీవీ ముందు కూర్చుని తినకపోవడం కాదు, తింటూ చదవకపోవడం కాదు, తింటుండగా ఇంటర్నెట్ చూడకపోవడం కాదు. ఆహారం మీద పరధ్యాస వస్తే మీ ఆహరం విలువను తగ్గించినట్టే, పైగా మీరు తిన్నదాని కన్నా తక్కువ తిన్నారనుకునేలా అది మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది.
8. మీ భోజనం చేయడానికి కనీసం 20నిమిషాలు కేటాయించండి. మీ తినే వేగాన్ని సరి చేసుకునేందుకు మీ భోజనం బల్ల ఎదురుగా కనపడేలా ఒక గోడ గడియారం ఉంచుకోండి - మీ చివరి ముద్దలు చాలా మెల్లిగా తినండి. 20 నిమిషాల తర్వాతా కూడా మీకు ఆకలిగా అనిపిస్తే, మీరు చాలా వేగంగా తింటున్నట్టే.
9. ఇలా చేసాక కూడా మీకు కొంచెం ఆకలి అనిపిస్తే, ఆగిపో౦డి. మరి కాసిని నీళ్ళు తాగండి. ఇక్కడే మీరు మరికాస్త సంకల్ప బలాన్ని వాడి మీ ప్రేరణను, చిత్రీకరణలను గుర్తు తెచ్చుకోవాలి. మరో అయిదు నిమిషాలలో, ఆహారం చాలా రుచిగా వున్నా మీరు ఇంక తినాలనుకోరు, ఎందుకంటే మీరు అప్పటికే తృప్తిగా, కడుపు నిండిన భావన కలిగి వుంటారు.

No comments:
Post a Comment