all

Thursday, December 13, 2012

జలుబుకు పాప్‌కార్న్ మందు........చిట్కా వైద్యం

 
 
ఈసారి జలుబు చేసినప్పుడు పాప్‌కార్న్ చికిత్సను ప్రయత్నించమంటున్నారు పెన్సిల్వేనియాలోని ‘యూనివర్సిటీ ఆఫ్ స్క్రాంటన్’కు చెందిన నిపుణులు. టీవలే ఆ విశ్వవిద్యాలయంలో చేసిన అధ్యనంలోని ఫలితాలలో తేలిన విషయం ఏమిటంటే పాప్‌కార్న్‌లో ఉండే పాలీఫినాల్ అనే యాంటీఆక్సిడెంట్ పాళ్లు ఎక్కువట. వాళ్ల అధ్యయనంలో తేలిన మరో అద్భుతమైన విషయం ఏమిటంటే పాప్‌కార్న్‌లో లభ్యమయ్యే ఈ యాంటీఆక్సిడెంట్ పాళ్లు కొన్ని పండ్లలో కంటే చాలా ఎక్కువట. అందుకే ఈసారి జలుబు చేసినప్పుడు తీరిగ్గా టీవీ చూసుకుంటూ పాప్‌కార్న్ తిని ఉపశమనం పొందడం మంచిదంటున్నారు సదరు అధ్యయనవేత్తలు. అయితే వాళ్లు సూచిస్తున్న మరో విషయం ఏమిటంటే ఇలా పాప్‌కార్న్ తినే సమయంలో అందులో ఉప్పు వేసుకోకపోవడం చాలా మంచిదంటున్నారు వారు.

No comments: