మీకు ఫ్లూ వుందని మీరు భావిస్తే, విశ్రాంతి తీసుకుంటూ బాగా నీళ్ళు తాగడం మీరు చేయగలిగిన అత్యుత్తమ పని. కొన్ని సందర్భాల్లో వైద్యుడు ఆ ఫ్లూ మరింత తగ్గడానికి కొన్ని మందులు కూడా ఇస్తాడు. ఫ్లూ చికిత్స, నివారణ విషయంలో వృద్ధులు, రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా వున్న వారు లాంటి ఫ్లూ ప్రమాదం ఎక్కువగా వుండే వాళ్ళు మరింత అప్రమత్తంగా వుండాలి.
గృహ చికిత్స:
ఇంటి దగ్గర వున్నప్పుడు పడుకోండి, స్వచ్చమైన ద్రవాలు తాగండి, శ్రమ కలిగించే పనులకు దూరంగా వుండండి. శరీరంలో నీటి పరిమాణం తగ్గించే కాఫీ, ఆల్కాహల్ లాంటి ఆహారాలు లేదా ద్రవాలు తీసుకోకండి.
ఫ్లూ తో బాధ పడేవారిలో చాలామందికి ఆకలి మందగిస్తుంది, మీ శరీరం ఆ ఇన్ఫెక్షన్ ను ఎదుర్కోవాలంటే పౌష్టికాహారం, మాంసకృత్తులు చాలా ముఖ్యం. క్లియర్ సూప్ మీకు ఆరోగ్యకరమైన పోషకాలు ఇవ్వడమే కాక శరీరంలో తేమను నిలిపి వుంచుతు౦ది.
ఫ్లూ లక్షణాలను చికిత్స చేయడానికి, చల్లటి మందులు తీసుకోండి. ఓవర్-ది-కౌంటర్ మందులు ఫ్లూ ను తగ్గించక పోయినా, అవి ఫ్లూ లక్షణాలను ఎదుర్కొని మీరు విశ్రాంతి తీసుకుని మీ శరీరం పై శ్రద్ధ పెట్టేలా ఉపకరిస్తాయి. ఓవర్-ది-కౌంటర్ మందులు, డాక్టర్ రాసిన మందులు, ఆయన ప్రత్యేకంగా చెప్తే తప్ప, కలిపి తీసుకోకండి.
ఫ్లూ మందులు:
ఫ్లూ వైరస్ వల్ల వస్తుంది కాబట్టి యాంటి బయోటిక్స్ పని చేయవు. ఐతే, వైద్యులు రోగులకు కొన్ని ఇతర మందులు ఇచ్చి శరీరం ఫ్లూ లక్ష్నాలనుంచి త్వరగా కోలుకునేలా చేస్తారు. ఫ్లూ మందులకు వివిధ దుష్ప్రభావాలు వుండడం వల్ల అవి అందరూ వాడకూడదు.
మీకు ఫ్లూ వచ్చిందని భావిస్తే, మీ వైద్యుడిని ప్రిస్క్రిప్షన్ మందులు వాడవచ్చా లేదా కనుక్కోండి.లక్షణాలు వచ్చిన వెంటనే వాడితే యాంటి-వైరల్ మందులు బాగా పని చేస్తాయి. మీరు ఫ్లూ వచ్చిన వారిని కలిసి వుంటే, ఆ లక్షణాలు రాకుండా, ఇతరులకు అంటకుండా వెంటనే యాంటి-వైరల్ మందులు వాడండి.ఫ్లూ వ్యాక్సిన్, నివారణ: ఫ్లూ ని తగ్గించడానికి ఉత్తమ మార్గం దాని నివారణే.
ప్రతి శీతాకాలంలో ఒక కొత్త ఫ్లూ వ్యాక్సిన్ విడుదల చేస్తారు. ఫ్లూ వ్యాక్సిన్లు వాడినా కొందరికి ఫ్లూ వస్తుంది కానీ, ఈ వ్యాక్సిన్ వాడడం వల్ల అది ఇతరులకు సోకే అవకాశాలు తగ్గుతాయి. రోగ నిరోధక వ్యవస్థలో లోపాలున్న వారు, ఫ్లూ వల్ల ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చే వారు ప్రతి ఏటా సరైన ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకోవాలి.
వ్యాక్సిన్లతో పాటు పరిశుభ్రత కూడా పాటించాలి. మరుగుదోడ్లోకి వెళ్లి వచ్చాక, ఆసుపత్రులు, ప్రజా రవాణా సాధనాల లాంటి సూక్ష్మ క్రిములతో నిండిన ప్రదేశాలలోకి వెళ్లి వచ్చాక కూడా చేతులను శుభ్రంగా కడుక్కోండి. ఎవరైనా మీ మీద తుమ్మితే, కళ్ళు, ముక్కు తుడుచుకునే ముందు సాధ్యమైనంత త్వరగా చేతులు కడుక్కోండి.

No comments:
Post a Comment