ఇంట్లో వెలుగు ని జిలుగుని నింపటానికి అద్దాలని ఉపయోగించటం చాల ఏళ్ళుగా జరుగుతోంది. ఒక పెద్ద సాధారణ అద్దాన్ని వేలాడదీసిన వెంటనే అద్భుతమైన మాయాజాలం లాంటి ప్రభావం కనిపిస్తుంది. అయితే, ఇంటి నిండా అద్దాలని ఎన్నో ఊహాత్మకమైన రీతుల్లో అమర్చుకోవచ్చు.
ఆరుబయట రహస్య "గదులను" ఏర్పరుచుకోవటానికి, పెరడు లేదా తోటల్లోకి వెళ్ళే దారుల్లోని వీటిని పెట్టుకోవచ్చు. పగిలిన అద్దాలని కూడా క్రాఫ్ట్ ప్రాజెక్ట్ లలో చక్కగా ఉపయోగించుకోవచ్చు.

మొజాయిక్ అద్దాలు: అద్దం ముక్కలు మీ ఇంటిని అలంకరించుకోవటానికి అద్భుతంగా ఉపయోగపడతాయి. మీకు క్రాఫ్ట్ ప్రాజెక్ట్ లపై ఆసక్తి ఉన్నట్లయితే, మొరాకో స్టయిల్ టేబుల్ టాప్ లేక వాల్ పేనల్ (విరిగిన అద్దం ముక్కలతో అమర్చిన రంగుల పెంకులతో)మీ సన్ రూమ్ కి మరింత శోభ తీసుకువస్తుంది.
పురాతన అద్దాలు: పాత మచ్చలు గల అద్దాలు, పూర్వకాలపు సౌందర్యాన్ని మన ముందుకు తెస్తాయి. ఇవి ఇంటికి గోతిక్ అనుభూతిని జతచెయ్యడానికి బ్రహ్మాండంగా పనికొస్తాయి. చిల్లర బజారులో పాత అద్దాలను సేకరించండి. వాటిని గుంపులు గుంపులుగా, మూలలోను వేలాడదీయండి. దీని వల్ల ఒక పాత కాలపు మసక మసక సొగసు చేకూరుతుంది. అద్దానికి సరిపోయే ఫ్రేముల కోసం వెతకనక్కరలేదు. సాధారణ, అలకరించబడ్డ అద్దాల కలయికే పాత కొత్తల మేలు మిశ్రమంగా తలుకులీనుతుంది.
ఫ్రేము అలంకరణ: అద్దాలని థీం రూంలలో(ఉదాహరణకి, సాగర తీరాన్ని తలపించే బాత్రూం) ఉపయోగించాలి అంటే సాదా అద్దానికి సముద్రపు చిప్పలు, సముద్రం ఒడ్డుకి కొట్టుకుని వచ్చిన కర్ర ముక్కలు అద్దితే, గదిలోనే సముద్రపు సొగబులని నింపుకున్నట్టు ఉంటుంది.
అద్దం - కిటికి: పెద్ద అద్దం ముందర ఒక సాధారణ కిటికి ఫ్రేంని నిలిపినట్లయితే ఒక అద్భుతమైన భ్రమగా అగుపిస్తుంది. దాని కింద ఒక అర అమర్చి, చిన్నచిన్నమొక్కలు పేర్చండి. ఈ అమరిక పెద్ద అద్దాలతో గానీ చిన్న అద్దాలతో గానీ చేసుకోవచ్చు. మరో ప్రపంచానికి కిటికీలా మహాద్భుతంగా కనిపిస్తుంది.
అసాధారణ ప్రదేశాల్లో అద్దాలు: అద్దం పెంకులని చీకటి అలమరాల్లోని, వంట గదుల్లోని, అరల్లోని వెలుగుని నింపడానికి పెట్టుకోండి. దీపం వెనక ఫోటో ఫ్రేమ్ గల అద్దాన్ని పెట్టడం వల్ల గదిలో వెలుతురు పెరుగుతుంది. మిర్రర్ టైల్స్ ని డైనింగ్ టేబుల్ మీద మ్యాట్ల బదులు పండగ/ప్రత్యేక భోజన సమయంలోను ఉపయోగించుకుంటే ఒక కొత్త కళ వస్తుంది. ప్రమాదాలని నివారించడానికి గానూ కేవలం సేఫ్టీ గ్లాస్ ని మాత్రమే వాడండి. మసకగా ఉన్న హాల్ పైకప్పుకి అద్దాలని అమర్చి స్కై లైట్ భ్రమని కలుగచెయ్యవచ్చు.
తోటలో ప్రతిబింబాలు: పెరట్లోనూ, తోటలోనూ అద్దాలని ఉపయోగిస్తే సమ్మోహనంగా ఉంటుంది. పెద్ద దీర్ఘ చతురస్రాకారపు అద్దాలు, తోట వెనుక మరో తోట వున్నట్టు భ్రమ కలిగిసస్తాయి. అటు వంటి అద్దాలకి దారి అమరిస్తే మరింత అద్భుతంగా ఉంటుంది. కంచెలు మీద, డల్ గా ఉన్న గోడలు మీద కిటికీలు అమర్చటం వల్ల తోట లోని విశేషాలు ప్రతిబింబించి ద్విగుణీకృతమవుతాయి. ఇలాంటి అద్దాలని నీడ ఉన్నప్రదేశంలో ఉంచండి, లేకపోతే అవి ప్రసరించే బలమైన కాంతి వల్ల మొక్కలు దెబ్బతినే అవకాశం ఉంది.

No comments:
Post a Comment