all

Thursday, December 13, 2012

పెద్దవయసువారూ క్లిప్పులు వేసుకోవచ్చు

 
పెద్దవయసులో ఉన్న వారు బయటికి కనిపించే క్లిప్పులను అమర్చుకోడానికి ఇష్టపడకపోవచ్చు. అలాంటి వారికి సాధారణ క్లిప్పులతో పాటు బయటకు కనిపించని ఇన్‌విజబుల్ అలైనర్స్ అనే ఉపకరణాలతో పలువరస సరిచేయవచ్చు.

ఆశాలత వంటి వారి విషయంలోలా చాలా మందికి పలువరస సరిగా లేకపోవడం, పళ్లు ఒకదానిపై ఒకటి వచ్చినట్లుగా ఉండటం వంటి సందర్భాల్లో ముఖం ఆకృతి చెడిపోతుంది. దాంతో అది వికృతంగా కనిపిస్తుండవచ్చు. ముందరి పళ్లు ఎత్తుగా ఉంటే పెదవులు ఎత్తుగా ఉన్నట్లు కనిపిస్తాయి. దాంతో వాస్తవ వయసు కంటే ఎక్కువ వయసు కనిపించి వృద్ధాప్యం మీద పడినట్లుగా కనిపించే అవకాశాలు కూడా ఎక్కువే. వాటిని సవరించడం కోసం దంతవైద్యనిపుణుడిని కలిస్తే తొలుత వారు ఎక్స్-రే తీసి పంటికి ఎముక సపోర్ట్ ఎలా ఉందో తెలుసుకుంటారు. దాంతో పాటు చిగుర్ల జబ్బులు ఏవైనా ఉన్నాయేమోనని చూస్తారు.

ఒకవేళ అవసరమైతే చిగుర్లలో ఉన్న ఇన్ఫెక్షన్‌ని తొలగించి పళ్లను దృఢంగా చేసేందుకు ప్రత్యేకంగా చిగుర్ల చికిత్సలు చేస్తారు. అయితే పళ్లు దృఢంగా ఉంటేనే మంచిది. అయితే అది మాత్రమే సరిపోదు. చూడ్డానికి అందంగా కూడా ఉండాలని అందరూ ఆశిస్తారు. పలువరసను అందంగా చేయడం కోసం ఆధునిక దంతవైద్యంలో చక్కటి చికిత్స విధానాలు ఉన్నాయి. చక్కగా లేని పలువరసను చక్కగా చేయడానికి చిన్నపిల్లల్లో లాగే ఇప్పుడు పెద్దవారికీ క్లిప్పుల విధానం అందుబాటులో ఉంది. పెద్దవయసువారు కొంతమంది ఈ వయసులో క్లిప్పులు వేసుకోడానికి జంకుతుంటారు. ఏ వయసువారైనా ఇప్పుడు స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు.

టీనేజ్ పిల్లలు మాత్రమే కాకుండా ఇప్పుడు పెద్దయ్యాక కూడా బ్రేసెస్, క్లిప్స్ వాడి తమ పలువరస చక్కగా మార్చుకోవచ్చు. ఇప్పుడు పెద్దవారిలోనూ పలువరస చేయడానికి క్లిప్పులతో పాటు ఇన్‌విజబుల్ అలైనర్స్ అనే ఉపకరణాలతో పలువరస సరిచేయవచ్చు. పెద్దవయసులో ఉన్న క్లిప్పులను అమర్చుకోడానికి ఇష్టపడకపోవచ్చు. అలాంటివారికి ఈ ఇన్‌విజిబుల్ అలైనర్స్ ఉపయోగించవచ్చు. ఇవి బయటకి కనపడవు. కాబట్టి వారు బిడియపడాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ దవడ ఎముకలు, పళ్లు... ఈ రెండూ ఎత్తుగా ఉంటే, ఆర్థోగ్నాథిక్ సర్జరీ ద్వారా ఆ సమస్యను సరిచేయవచ్చు. (ఈ సర్జరీ పెద్దవాళ్లకు అంటే 18 ఏళ్లు దాటిన వారికే మాత్రమే చేస్తారు).

No comments: