all

Thursday, December 13, 2012

పిల్లలకు నత్తి ఉందా...?

 
పిల్లలకు నత్తి ఉంటే దాన్ని గురించి వారి కంటే పెద్దలే చాలా ఎక్కువగా బాధపడుతుంటారు. నిజానికి నత్తికీ తెలివితేటలకు సంబంధమే లేదు. నత్తి రావడానికి జన్యుసంబంధమైన కారణాలు, మెదడులోని స్పీచ్‌సెంటర్ నిర్మాణంలో లోపాలు, పసితనంలో తీవ్రమైన ఒత్తిడికి గురిచేసిన సంఘటనలు లాంటి ఎన్నో కారణాలు ఉంటాయి. నత్తి అధిగమించలేని సమస్య కానేకాదు. ఎందరో ప్రముఖులు తొలుత నత్తితో బాధపడ్డా... దాన్ని విజయవంతంగా అధిగమించారు. ఉదాహరణకు ప్రముఖ హాలివుడ్ నటి జూలియా రాబర్ట్స్ అత్యధిక పారితోషికం తీసుకునేది. మొదట్లో ఆమెకు నత్తి ఉండేది. ఆస్కార్ విజేత అయిన ప్రముఖ నటుడు ఆంథోనీ క్విన్ కూడా చిన్నప్పుడు నత్తితో బాధపడ్డవాడే. బ్రిటిష్ మాజీ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్, అమెరికా మాజీ అధ్యక్షుడు థియోడర్ రూజ్‌వెల్ట్ కూడా చిన్నప్పుడు నత్తితో బాధపడ్డవారే.

విశ్వవిఖ్యాత శాస్త్రవేత్తలైన చార్లెస్ డార్విన్, సర్ ఐజక్ న్యూటన్‌లు కూడా నత్తితో బాధపడ్డవారే. వాళ్లంతా అప్పట్లోనే ప్రయత్నపూర్వకంగా నత్తిని అధిగమించారు. విజయం సాధించారు. ఇప్పుడున్న వైద్యవిజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో స్పీచ్ థెరపిస్ట్‌ల సాయంతో దాన్ని అధిగమించేందుకు చాలా అవకాశాలున్నాయి. ఒకవేళ చిన్నప్పుడు నత్తి ఉండి చికిత్స తీసుకోలేకపోయినా లేదా దాన్ని అధిగమించేందుకు ప్రయత్నం చేయకపోయినా ఇప్పుడూ ఆలస్యమైందేమీ లేదు. ఈఎన్‌టీ నిపుణులు, స్పీచ్‌థెరపిస్ట్‌లను కలిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. స్పీచ్ థెరపిస్ట్‌ల ఆధ్వర్యంలో స్పీచ్ ఫ్లూయెన్సీ, స్టామరింగ్ మాడిఫికేషన్ వంటి స్పీచ్‌థెరపీ ప్రక్రియల ద్వారా మంచి ఫలితాలు వస్తాయి.

No comments: