all

Thursday, December 13, 2012

మీ చిన్నారుల భద్రత కోసం..మీ ఇంటిని సురక్షితం చేయండిలా...

పాకడం మొదలు పెట్టిన దగ్గర నుండి చిన్నారులు నిరంతరం తిరుగుతూ, ఆసక్తికరంగాను, ఒక్కొక్కసారి ప్రమాదకర౦గా కూడా వుండే కొత్త లోకాన్ని పరిశోధిస్తూ ఉంటారు. ఒక తల్లిగా, మీరు మీ చిన్నారులను సురక్షితంగా ఉంచాలనుకొంటారు, కాని ఎంత అప్రమత్తంగా ఉన్న తల్లైనా ఆసక్తిగా తప్పటడుగులు వేసే చిన్నారులను ఇంట్లో జరిగే ప్రతి ఆపద నుండి దూరంగా ఉంచలేరు.అప్పుడప్పుడు సంభవించేవైనప్పటికి, అతి ప్రమాదకరమైన విపత్తులు, గాయాల నుండి మీ ఇంటిని చిన్నారులకు సురక్షితం చేస్తే, సురక్షిత వాతావరణంలో, చిన్నారుల పరిశోధనాత్మక, ఆసక్తికరమైన స్వభావాన్ని ప్రోత్సహించగల నమ్మకాన్ని మీకు ఇస్తుంది.

 


1. తాళాలు: అల్మారాలు, సొరుగులకు తాళాలు వేయడం ఆసక్తి కల్గిన చిన్నారి వేళ్ళను ఎన్నో ప్రమాదకర గృహోపకరణాలకు దూరంగా ఉంచే సులువైన మార్గం.వంట గదులలో, స్నానపు గదులలో తరచుగా రసాయన క్లీనర్లు, మందులు, పదునైన పరికరాలను దాచే క్రింది అరలపై బాగా ధ్యాస ఉంచ౦డి. ఒక తాళాన్ని ఎంచుకొన్నప్పుడు మీ వంట గది అల్మరకు పనిచేసేదాన్ని ఎంచుకోండి, ఎందుకంటే అన్ని తాళాలు అన్ని రకాల అల్మారాలకు, సొరుగులకు పనిచేయవు. తాళాలు మన్నికైనవిగానూ, పెద్దవాళ్ళు వాడేందుకు సులువైనవిగానూ, తీసేటప్పుడు అల్మరాలకు, సొరుగులకు ఎటువంటి నష్టం జరగనివ్వనిది గానూ ఉండాలి..

2. పై తొడుగులు: పసి బిడ్డలు, తప్పటడుగులు వేసే చిన్నారులు వస్తువులను స్పర్శ ద్వారా తెల్సుకొంటారు, అంటే తొడుగు లేకుండా ఉంచిన విద్యుత్ సాకెట్ల లాంటివి చాలా ప్రమాదకరం అన్నమాట. ప్రతీ ఔట్లెట్ లోను ఒక సాధారణ ప్లాస్టిక్ ఔట్లెట్ వాడటం చవకైన ఎంపిక, కాని తప్పనిసరిగా ప్లగ్గు తో పని అయిన తర్వాత ప్లాస్టిక్ ఔట్లెట్ ను తిరిగి పెట్టడం మరవద్దు. ఔట్లెట్ ప్లేట్ బిగించడానికి ఇంకొంత శ్రమ కావాల్సి ఉంటుంది, కానీ, ఇది ఒకసారి బిగిస్తే, ఔట్లెట్ ఉపయోగించేటప్పుడు ఔట్లెట్ కవర్లు బయటకు వచ్చి, దాన్ని వాడనప్పుడు లోపలికి వెళ్ళిపోతుంటాయి కనుక ఇది మరింత సౌకర్యవంతమైన ఎంపిక.

3. భద్రత ద్వారాలు: కొత్తగా పాకడం మొదలుపెట్టిన చిన్నారిని మీరు మెట్ల నుండి దూరంగా ఉంచాలనుకొన్నా లేదా తిరుగాడే చిన్నారులను చాలా ప్రమాదాలున్న ఒక గది నుండి దూరంగా ఉంచాలనుకున్నా, భద్రత ద్వారం ఉండడం ఒక ఉత్తమ ఎంపిక. ఒక నాణ్యమైన భద్రత ద్వారం పెద్దలు వాడటానికి సులువైందిగా వుండాలి, కాని లాగినప్పుడు మీద పడనంత గట్టిగా ఉండాలి. గోడలలోకి స్క్రూ లతో బిగించిన బేబీ గేట్లు ఎంతో మన్నికైన ఎంపిక, ప్రత్యేక౦గా సులువుగా తెరుచుకొనే వీలున్న తలుపుతో వస్తుంది. పై అంతస్తులను మూయడానికి ఎప్పుడూ స్క్రూ లు ఉన్న బేబీ గేట్లను వాడండి. ఒత్తిడి ఉండే బేబీ గేట్ మంచి ఎంపికే అయినప్పటికీ దానిని ముందుకు లాగడం, పైకి ఎక్కడం, ప్రక్క సందులలో తల చిక్కుకోవడం వంటివి జరగకుండ చూసుకోండి.

4. స్నానపు గది భద్రత: మీరు, మీ చిన్నారిని టాయిలెట్ కాగితపు చుట్టను మొత్తం విప్పకుండా ఆపలేక పోయినా, స్నానపు గదిని ప్రమాదరహితంగా ఉంచేందుకు చాల ముఖ్యమైన భద్రత చర్యలు ఉన్నాయి. డయపర్లలో ఉండే చిన్నారులను టాయిలెట్ బౌల్ నీళ్ళలో పడకుండా చూసేందుకు టాయిలెట్ మూత పడిపోకుండా ఒక క్లాంప్ ను అమర్చండి. ఇంకా స్నానపు భద్రత నిమిత్తం నీళ్ళ తొట్టెలో జారని చాపలను అమర్చి, నీరు వచ్చే గొట్టాలకు, నాబులకు సరదాగా వుండే తొడుగులు వేసి ఆటలలో జారి పడిపోయినా గాయాలపాలవ్వకుండా చూడవచ్చు.

5. గృహోపకరణాల భద్రత: మీ చిన్నారి లేచి నిల్చోవడం మొదలు పెట్టాడంటే, మీ ఇంట్లో బరువైన గృహోపకరణాలు, వస్తువులను గోడ పట్టిలతో గోడకు తగిలించండి లేదా మౌంటింగ్ బ్రాకెట్ల పై ఉంచండి. చిన్నారులు పైకి ఎక్కడం లేదా పుస్తకాల అల్మారాలు, అద్దపు అల్మారాలను తమ మీదికి లాక్కోవడం వలన ఈ వస్తువు సరిగ్గా కుదురుకోకపోతే వారి మీదకు పడే ప్రమాదం ఉంది. మొనతేలిన అంచులు, మూలాలు ఉన్న కాఫీ బల్లలు, నిప్పుల కొలిమి లాంటి వాటికి మెత్తటి బంపర్లను తగిలి౦చడం వల్ల తిరిగే చిన్నారులు తీవ్ర గాయాల పాలవ్వకుండా నివారించవచ్చు.

6. కిటికీ భద్రత: తలుపులకు లేదా తెరలకు ఉండే తీగల వల్ల చిన్నారులకు ఊపిరాడకుండా ఉండే ప్రమాదం ఉంది. చివికిపోయిన తీగల బదులు వేలాడే తీగలతో మార్చి చిన్నారుల తలకి చుట్టుకునే ప్రమాదం నుండి నివారించడానికి ఈ తీగలను వారికి దూరంగా ఉంచండి. చిన్నారులు తెరిచిన కిటికీ నుండి పడిపోకుండా. కొన్ని అంగుళాలు మాత్రమే కిటికిలో ఖాళి ఉండేటట్లు, కిటికీ గార్డు లేదా అదనపు రక్షణ కోసం భద్రత తెరను బిగించండి.

7. వంటింటి భద్రత: వంటిల్లు కుటుంబ౦, స్నేహితులు వేడుకలప్పుడు కూడే ప్రాంతమైనప్పటికి చిన్నారులకు మాత్రం ఇక్కడ చాలా ప్రమాదాలు ఉంటాయి. పదునైన వస్తువులు, ఆల్కహాల్, మందులు, అగ్గిపెట్టెలు, ప్లాస్టిక్ సంచులు, విషపూరిత రసాయనాలను చిన్నారులకు అందకుండా, తాళాలు వేసిన అల్మారాలలో చిన్నారులకు దూరంగా ఉంచండి. గిన్నల, ప్యాన్ల హా౦డిళ్ళను వంట చేసేప్పుడు స్టవ్ వెనుక వైపుకు ఉంచండి, చిన్నారులకు వేడి పాత్ర తాకరాదని చెప్పండి. స్టవ్ చుట్టూ ప్రమాదవశాత్తు కాలకుండా ఉండేందుకు ఏదైనా అడ్డం పెట్టండి. డిష్ వాషర్ కు తాళాలు, స్టవ్ నాబులకు కవచాలు కొనండి, చిన్నారులకు లాగ కూడదు అని తెలిసే వరకు డైనింగ్ టేబుల్ మీద క్లాత్ ను తీసివేయండి.

8. విషము నుండి భద్రత: చిన్నారులు దాదాపు ప్రతిదీ నోటిలో పెట్టు కుంటారు, దురదృష్టవశాత్తూ, ఈ చర్య కొన్ని తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. మందులు, ప్రమాదకర రసాయనాలను వంటింటి, స్నానపు గది చెత్త బుట్టలో కాక మూత గట్టిగ ఉండే పనికి రాని చెత్తలో పారెయ్యండి.

9. అగ్ని భద్రత: పొగ అలారాలు మొత్త౦ కుటుంబానికి అవసరం, ఇంటి నిండా తప్పనిసరిగా పెట్టాలి. బ్యాటరీలు క్రమంతప్పక మార్చడం, సరిగ్గా పని చేస్తుందో లేదో నెలలో ఒకసారి పరీక్షించి చూసుకోవాలి. లైటర్లను, అగ్గిపెట్టె లను చిన్నారులకు దూరంగా ఉంచి, వెలిగించిన కొవ్వత్తుల దగ్గరకి చేరడం, కింద పడేయడం వంటివి చేయకుండా చూసుకోవాలి.

 

No comments: