all

Wednesday, November 28, 2012

కోకోనట్ పులావ్ -స్పెషల్

సాధారణంగా పులావ్ ను రకరకాలుగా తయారు చేస్తుంటారు. చాలా సులభంగా... రుచిగా తయారు చేసుకొనే బ్రేక్ ఫాస్ట్, లేదా లచ్ బాక్స్ రిసిపి పులావ్. వెజిటేబుల్ పులావ్, టమోటో పులావ్, పన్నీర్ పులావ్, మట్టర్ పులావ్, చికెన్, పులావ్ ఇలా రకరకాలుగా తయారు చేసుకుంటారు. అదే విధంగా ఫ్రేష్ కోకోనట్ మిల్క్ తో తయారుచేసే ఈ పులావ్ రుచితో పాటు ఆరోగ్యం కూడా. కొన్ని స్పైసీలు జోడించి తయారు చేసే ఈ పులావ్ చేయడం కూడా సులభమే... మరి కోకోనట్ పులావ్ ఎలా తయారు చేయాలో చూద్దాం..
coconut pulao

కావలసిన పదార్థాలు :
బాస్మతి రైస్ : 1.5cups
పచ్చి బఠానీ: 1cup
పచ్చి కొబ్బరి తురుము: 1cup
బిర్యానీ ఆకులు: మూడు
యాలకులు: 2-3
పచ్చిమిర్చి: 2-4
అల్లం: చిన్నముక్క
వెల్లుల్లి రెబ్బలు: 8-10
నూనె : 1/4cup
జీడిపప్పు: 5-10
ఉల్లిపాయలు: 1-2(సన్నగా కట్ చేసుకోవాలి)
లవంగాలు: 2-4
దాల్చినచెక్క: చిన్న ముక్క
నెయ్యి: 2tbsp
పొదీనా తరుగు: 2tbsp
ఉప్పు : రుచికి సరిపడ
కొత్తిమీర తరుగు: 2tbsp
తయారీ చేయు విధానం:
1. ముందుగా బాస్మతి బియ్యం శుభ్రంగా కడగి వార్చి వుంచాలి.
2. తర్వాత కొబ్బరి తురిమును మిక్సీలో వేసి దాని నుండి పాలు తయారు చేసుకోవాలి.
3. అలాగే అల్లం, వెల్లుల్లి కూడా మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ తయారు చేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరిగి ఉంచాలి. బియ్యంలో 1.5కప్పు బియ్యానికి రెండు కప్పుల పాలు పోసి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు కుక్కర్ లో నూనె వేసి కాగిన తర్వాత ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ , ఆ తర్వాత మసాల దినుసులన్నీ వేసి వేయించాలి.
5. కొద్దిసేపటి తర్వాత పచ్చిబఠాణీ వేసి వేపి, బియ్యం పాలు పోసి, ఉప్పు, కొత్తిమీర, పుదీనా తరుగు వేసి బాగా కలిపి మూతపెట్టి సన్నని మంట ఒకటి లేదా రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వాలి. స్టౌ ఆఫ్ చేసి పదినిమిషాల తర్వాత జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే కోకోనట్ పులావ్ రెడీ...ఉల్లిపాయ, పెరుగుపచ్చడితో సర్వ్ చేస్తే చాలా రుచికరంగా ఉంటుంది.

No comments: