all

Friday, November 30, 2012

బదామీ పన్నీర్ గ్నేవీ: రైస్-రోటీ స్పెషల్

పన్నీర్ నాన్ వెంజ్ కాంబినేషన్ మాత్రమే కాదు వెజిటేరియన్ కాంబినేషన్ కూడా. పన్నీర్ తో తయారు చేసే ప్రతి వంటా ఎంతో రుచితో నోరూరించేస్తుంటి. చాలా ఇండ్లలో పన్నీర్ ను మహిళలే తయారు చేసుకొంటారు. పాలను బాగా మరింగించి అందులో కొద్దిగా నిమ్మరసం వేయగానే(సిట్రిక్ యాసిడ్ వల్ల) విడిపోతుంది. దాన్ని వడగట్టి పన్నీర్ గా తయారు చేసుకొంటారు. అయితే ఈ బిజీ లైఫ్ లో పన్నీర్ కూడా రెడీమేడ్ గా బయట మార్కెట్లో దొరుకుతోంది. పన్నీర్ ను వివిధ రకాలుగా వండుతారు. పన్నీర్ గ్రేవీ, పన్నీర్ మసాలా అనేవి ఇండియన్ వంటకాల్లో చాలా పాపులర్ వంటలు. కాబట్టి కొంచెం టేస్ట్ వెరైటీగా ఉండేందుకు బాదాం మిక్స్ చేసి ఎలా తయారు చేయాలో చూద్దాం...
badami paneer gravy recipe

పన్నీర్/కాటేజ్ చీజ్: 250gms (cut into cubes)
ఉల్లిపాయలు: 2
అల్లం: 1 inch
వెల్లుల్లి: 4:5 pods
బాదాం: 10:12 (soaked for 30 minutes)
పసుపు: 1tsp
కారం: 1tsp
ధనియాల పొడి: 1tsp
ఎండు మిర్చి: 3
టమోటో గుజ్జు: ½ cup
జీలకర్ర పొడి: 1tsp
పాలు: 1tbsp
గరం మసాలా: 1tsp
లవంగం: 1
పంచదార: ½ tsp
బిర్యానీ ఆకు: 1
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 1 cup
తయారు చేయు విధానం:
1. ముందుగా బాదాం, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, మరియు రెండు ఎండు మిర్చి వీటన్నింటినీ మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు వేసి చిక్కగా మెత్తగా పేస్ట్ ను తయారు చేసుకోవాలి.
2. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి, మీకు నచ్చిన సైజులు కట్ చేసి పన్నీర్ ముక్కలను అందులో వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ ఫ్రై చేసుకోవాలి(కనీసం ఐదు నిముషాల పాటు మీడియం మంట మీద వేయించుకోవాలి) వీటి ఒక ప్లేట్ లోనికి తీసుకొని చల్లారనివ్వాలి.
3. తర్వాత ఒక బౌల్లో కారం, ధనియాలపొడి, పసుపు, ఉప్పు, కొద్దిగా నీళ్ళు పోసి చిక్కగా కలుపుకోవాలి .
4. ఇప్పుడు పన్నీర్ వేయించుకొన్న అదే సాన్ స్టౌ మీద పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి, కాగిన తర్వాత అందులో బిర్యానీ ఆకు, లవంగాలు, ఎండు మిచ్చి, వేసి వేయించి కలిపి పెట్టుకొన్న కారం, ధనియాలపొడి లిక్విడ్ ను మసాలా దినుసులు వేగుతున్న పాన్ లో పోసి బాగా కలియ బెట్టాలి.
5. ఇప్పుడు అందులోనే ముందుగా మిక్సీలో పేస్ట్ చేసుకొన్న మసాలా మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలిపి ఎక్కువ మంటమీదా ఐదు నిముషాల పాటు ఉడికించాలి. ఐదు నుండి పదినిముషాల తర్వాత టమోటో గుజ్జును కూడా ఉడుకుతున్న మిశ్రమంలో పోయాలి.
6. రెండు మూడు నిముషాల తర్వాత గరం మసాలా, మరియు జీలకర్ర పొడి, చిలకరించి, అరకప్పు నీటిని పోసి బాగా ఉడికించాలి. ఈ మిశ్రమం గ్రేవీలా చిక్కబడేటప్పుడు అందులో వేయించి పెట్టుకొన్న పన్నీర్ ముక్కలు, కొద్దిగా పాలు, మరియు పంచదార వేసి బాగా కలిపి మరికొద్దిసేపు ఉడికించాలి. అంతే బాదాం పన్నీర్ గ్రేవీ రెడీ... కొత్తిమీర తరుగు, ఉల్లిపాయ తరుగుతో గార్నిష్ చేసి రోటీ, రైస్ తో సర్వ్ చేయాలి.

No comments: