నాకు వచ్చే నెలలో పెళ్లి. చలికాలం వల్ల చర్మం డ్రైగా, పొడిగా ఉంటుందని ఫేషియల్స్ చేయించుకున్నాను. కాని అవి ఏవీ నా ముఖానికి సూట్ కావడం లేదు. వీటి కారణంగా చర్మం ఇంకా నల్లబడింది. మేకప్ క్రీమ్‌లు వాడితే ముఖంపైన ప్యాచ్‌లుగా కనిపిస్తోంది. నా చర్మతత్వం మెరుగుపడటానికి, మృదువుగా, కాంతివంతంగా మారడానికి ఏం చేయాలి?
- పూర్ణిమ, ఈ మెయిల్ డ్రై స్కిన్‌కి ఎలాంటి మేకప్ వాడాలో కిందటి వారాల్లో చెప్పాను. ఆ జాగ్రత్తలు పాటించండి. ఇక చర్మం మృదువుగా మారడానికి మాయిశ్చరైజర్‌ని రాత్రి పూట తప్పనిసరిగా రాసుకోవాలి. మీరు బ్యూటీ నిపుణులచే మాత్రమే ఫేషియల్స్ చేయించుకోండి. ఫేషియల్స్‌లోdermalogica, remy laureబ్రాండ్ గల క్రీమ్‌లనే ఉపయోగించండి. లుక్ బాగుంటుంది. అలాగే డెర్మలాజిక బ్రాండ్‌లో నైట్ రిపేర్ క్రీమ్ ఉంటుంది. దీనిని రాత్రిపూట వాడండి. తేడా మీరే గమనిస్తారు. నా వయసు 29. రెండేళ్ల క్రితం మలేరియా వచ్చింది. బాగా నల్లబడ్డాను. జుట్టు కూడా బాగా ఊడిపోయింది. ఇంకా ఈ సమస్య ఇలాగే ఉంది. పూర్వపు రంగు రావాలంటే ఏం చేయాలి? - స్వాతి, ఇ - మెయిల్ మలేరియా వచ్చి రెండేళ్లు అయిందంటున్నారు. మలేరియా వచ్చినప్పటికీ... సాధారణంగా ఏడు నెలల నుంచి ఏడాది లోపు చర్మం, జుట్టు సాధారణ స్థితికి వస్తాయి. మీకు అలా జరగలేదంటే థైరాయిడ్, ఇతర ఆరోగ్యసమస్యలు ఏమైనా ఉన్నాయేమో డాక్టర్‌ను సంప్రదించి తెలుసుకోండి. అలాగే చర్మం, జుట్టు రంగు కూడా మారిందేమో చెక్ చేయించుకోండి. చిరాంజి (సారపప్పు. హెర్బల్ షాపులలో లభిస్తుంది)ని పాలలో రాత్రి నానబెట్టి, ఉదయాన్నే పేస్ట్‌లా చేసి, ముఖానికి ప్యాక్ లా వేసుకోండి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోండి. రోజూ ఇలా చేస్తూంటే కొన్నాళ్ల కు మీ పూర్వపు రంగు వచ్చేస్తుంది. తలకు వారానికి ఒకసారైనా గుడ్డుతో ప్యాక్ వేసుకోండి. ఇంకా జుట్టు ఊడటానికి కారణమేంటో డాక్టర్‌ని అడిగి, వారు సూచించిన జాగ్రత్తలు పాటించండి. నేను తలంటుకోవడానికి షికాయి, కుంకుడుకాయలు వాడతాను. వీటి వల్ల జుట్టు బాగా పొడిబారుతోంది. షాంపూలు వాడితే జుట్టు ఊడుతుందేమోనని భయం. జుట్టు పొడిబారకుండా ఏం చేయాలి? - రోజా, ఇ - మెయిల్ పూర్వకాలంలో షాంపూలు, సబ్బులు లేవు. నూనెలు కూడా బాగా జిడ్డుగా ఉండేవి. పైగా వారానికి ఒకసారి తలంటుకోవడం వల్ల జుట్టు తేమను కోల్పోయేది కాదు. కాని, ఇప్పుడలా కాదు. జిడ్డు తక్కువగా ఉండే నూనెలను వాడుతున్నాం. పైగా వారంలో ఎక్కువసార్లు తలంటుకుంటున్నాం. కుంకుడుకాయలు, షికాయల్లో ఉండే ఆమ్లతత్వం వెంట్రుక తేమను ఎక్కువ తీసేస్తాయి. దీనివల్ల జుట్టు పీచులా తయారవుతుంది. నిపుణులను వద్దకు వెళ్లి జుట్టు తత్వాన్ని పరీక్షించుకోండి. దానికి తగిన చికిత్స తీసుకొని, వారు సూచనలు పాటించండి. ప్రస్తుతం keraspaseవాడండి. దీంట్లో షాంపూ, ఆయిల్, కండిషనర్ అన్నీ ఉంటాయి. | |||
all
-
స్త్రీ తన శరీరంలో మరో జీవికి ప్రాణం పోస్తున్న సమయం, అంటే గర్భవతిగా మారేటప్పుడు రకరకాల మార్పుల్ని శరీరం సూచిస్తుంది. సహజంగా ఈ మార్పులు సున్న...
-
అందం విషయంలో కేశాలు కూడా ప్రదానం. ఎందుకంటే అందమైన జుట్టు వారి అందాన్ని మరింత ఎక్కువగా చూపెడుతుంది. అందమైన అలలులా ఎగసిపడే జుట్టు మరియు పొడవ...
-
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న తర్వాత మహిళలు అంతకుమునుపు ఆహారం ఎలా తీసుకున్నా అప్పట్నుంచి మాత్రం తినే పదార్థాల్లో ఉప్పు, చక్...
-
బ్లడ్ ప్రెషర్(బిపి) అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో మారుతున్న జీవిన శెలితో పాటు ఆనారోగ్యాలు కూడా ఎక్కువవుతున్నాయి. అందులో...
-
తల్లిపాలు శిశువుకు అమృతంలాంటివి. తల్లిపాలు శ్రేష్టం, ఎంతో ముఖ్యమైన సంపూర్ణ పౌష్టిక ఆహారం. తల్లికి బిడ్డకు ఆరోగ్యవంతమైనది. ఇద్దరి మధ్య మంచి ...
-
డాక్టర్‌ని అడగండి నా వయసు 20. మలవిసర్జన సమయంలో మల ద్వారం నుంచి రక్తం పడుతోంది. మలవిసర్జనకు వెళ్లినప్పుడు లోనుంచి చిన్న ...
-
http://www.scribd.com/doc/119728850/DHYANAM-DANI-PADHATULU-SWAMI-VIVEKANANDA-SWAMI
-
తెలుగింటి ఆనవాళ్లు... ఆరుగజాల సొగసు చీరలు. తెలుగింటి కళలు... కమనీయకాంతుల చీరలు. తెలుగింటి సింగారాలు... సిరులొలికించే...
-
పాన్ లో ఉల్లిపాయలు ఎర్రగా వేగుతుంటే కొబ్బరి దానికి జతగా చేరితే పెరుగు ఒక అడుగు పసందుగా వేస్తుంది. మీగడ ఒద్దిగకగా ఒదిగిపోతుంది. ఇలంతా ఘుమ...
-
గైనిక్ కౌన్సెలింగ్ నేను ఇప్పుడు మూడో నెల గర్భవతిని. మా అమ్మమ్మ రోజూ పాలలో కుంకుమపువ్వు క...
Friday, November 30, 2012
questions & answers
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment