అరటితో రకరకాలైన వంటకాలు చేసుకోవచ్చు. అరటి కూర,అరటి వేపుడు, అరటి బజ్జీ మెదలైనవి. అరటితో అల్పాహారాలు, అరటి పండు రసాలు కూడా చేసుకోవచ్చు. బనానా చిప్స్ అనునది అరటి కాయ నుండి తయారు చేయు ఓ అల్పాహారం. ఇది ప్రపంచ వ్యాప్తంగా బహు ప్రసిద్ధి. కేరళ వాళ్ళు వీటిని కొబ్బరి నూనెతో వేయించి తయారు చేస్తారు. అవి ఓ ప్రత్యేకమైన వాసన, రుచి కలిగి ఉంటాయి. అరటి పండ్లను జాం తయారు చెయ్యడంలో కూడా ఉపయోగిస్తారు. అరటి పండ్లను పండ్ల రసాలు తయారు చేయడం లోనూ, ఫ్రూట్ సలాడ్ లలోనూ, ఉపయోగిస్తారు. అరటితో పులిహోర ఎలాతయారు చేయాలో చూద్దాం...
కావలసినపదార్థాలు:
అరటికాయ: 1-2
నిమ్మకాయ: 1
పచ్చిమిర్చి తరుగు: 2tbsp
పల్లీలు: 1/4cup
బియ్యం: 1cup
జీలకర్ర: 1/2tsp
ఆవాలు: 1tsp
శనగపప్పు: 1tsp
ఎండుమిర్చి: 6
కరివేపాకు: రెండు రెమ్మలు
ఉప్పు: రుచికి తగినంత
కొత్తిమీర: ఒక కట్ట
జీడిపప్పు: 8-10
నూనె: సరిపడా
పసుపు: 1/4tsp
తయారు చేయు విధానం:
1. ముందుగా పొడిపొడిలాడేలా అన్నం వండి పక్కన ఉంచుకోవాలి.
2. తర్వాత అరటికాయ చెక్కు తీసి, ముక్కలుగా కట్ చేసి, మూడు టీ స్పూన్ల నూనెలో వేయించి తీసి పక్కన పెట్టాలి.
3. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి, నూనె వేసి కాగిన తరవాత అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించి పక్కనుంచుకోవాలి.
4. తర్వాత పెద్ద పాత్రలోకి అన్నం తీసుకుని అందులో వేయించిపెట్టుకున్న పదార్థాలను వేసి బాగా కలపాలి.
5. తరవాత జీడిపప్పు, వేయించిన పల్లీలు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలపాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే బనానా రైస్ రెడీ..

No comments:
Post a Comment