సోయ... అంటే సో గుడ్.
సోయ... ఉంటే సో హెల్దీ. సోయ... వండితే సో టేస్టీ. వీకెండ్‌లో హోటల్‌వైపు పరుగులు తీసే జిహ్వను కట్టిపడేసేలా ‘సోయ’ వంటకాలతో ఇంటిల్లిపాదికి వెరైటీ విందు ఇవ్వండి. వీకెండ్‌ను యమ్మీగా మార్చావంటూ కితాబు అందుకోండి. సోయాబీన్ సటయ్ కావలసినవి సోయాబీన్స్ - 100 గ్రా. (సోయాబీన్స్‌ను మిక్సర్ జార్‌లో వేసి, మెత్తగా పొడి చేయాలి.) ఉప్పు - తగినంత పీ నట్ బటర్ - 100 గ్రా. సోయ పాలు - తగినన్ని పై పదార్థాలన్నీ చపాతీ పిండిలా కలిపి, పక్కనుంచాలి. చాప్ స్టిక్స్ - తగినన్ని సటయ్ మ్యారినేట్ కోసం... లెమన్‌గ్రాస్(మార్కెట్లో లభిస్తుంది) - అర కప్పు, ఉల్లిపాయలు - 2 (చిన్నవి), వెల్లుల్లి రెబ్బలు - 4 కారం - అర టీ స్పూన్ అల్లం - చిన్నముక్క పసుపు - చిటికెడు ధనియాలపొడి - టీ స్పూన్ సోయా సాస్- 2 టేబుల్‌స్పూన్లు నూనె - 3 టేబుల్ స్పూన్లు తయారి మ్యారినేట్ కోసం చెప్పిన పదార్థాలన్నీ మిక్సర్ వేసి, బ్లెండ్ చేసి పక్కన ఉంచాలి. సోయాబీన్ మిశ్రమాన్ని సమానభాగాలు చేసి, కావలసిన షేప్ చేయాలి. వీటికి పుల్లలు గుచ్చి, వాటిమీద మారినేట్ మిశ్రమాన్ని పోయాలి. అన్నివైపులా తడిసేలా జాగ్రత్త తీసుకొని, ప్లేట్‌పైన మరో మూత పెట్టి లేదా కవర్‌తో మూసేయాలి. దీనిని గంటసేపు బయట ఉంచి, మరో గంట ఫ్రిజ్‌లో ఉంచి, ఆ తర్వాత ఈ ముక్కలను గ్రిల్ చేయాలి. రెండు వైపులా గ్రిల్ చేశాక, ప్లేట్‌లోకి తీసుకొని గార్నిష్ చేయాలి. పెనం మీద కాల్చుకోవాలంటే సరిపడా నూనెను వాడాలి. వీటిని టొమాటో చట్నీతో సర్వ్ చేయాలి. టోఫు పీస్ మసాలా కావలసినవి సోయాటోఫు (మార్కెట్లో లభిస్తుంది) - 100 గ్రా., పచ్చి బఠాణీలు - అర కప్పు ఉల్లిపాయలు - 2, టొమాటో - 2 అల్లం, వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్ బాదంపప్పు - 4, జీడిపప్పు - 4 ఎండుమిర్చి - 4, ధనియాలు - టేబుల్ స్పూన్, ఏలకులు - 2, సోంపు - అర టీ స్పూన్, దాల్చినచెక్క - చిన్న ముక్క కారం - 2 టీ స్పూన్లు (తగినంత) ఉప్పు - తగినంత, కొత్తిమీర - తగినంత తయారి ఉల్లిపాయలను, టొమాటోలను ముక్కలుగా కట్ చేసుకోవాలి. టోఫులను నీళ్లలో వేసి, బయటకు తీసి, పేపర్ టవల్ మీద ఉంచాలి. (ఇలా చేస్తే టోఫుల్లోని నీళ్లన్నీ ఇంకిపోతాయి). మెత్తబడిన టోఫులను కావలసిన పరిమాణంలో ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టౌ మీద పాన్ పెట్టి, టేబుల్‌స్పూన్ నూనె వేసి, సన్నని మంటమీద టోఫు ముక్కలను పది నిమిషాలు రెండువైపులా వేయించాలి. టోఫులను విడిగా గిన్నెలోకి తీసుకొని, చల్లారనివ్వాలి. అదే పాన్‌లో మరొక టీ స్పూన్ నూనె వేసి, దాల్చినచెక్క, ఏలకులు, సోంపు, ధనియాలు, ఎండుమిర్చి కూడా వేసి వేయించాలి. ప్లేట్‌లోకి తీసుకొని చల్లారనివ్వాలి. అదే పాన్‌లో ఉల్లిపాయముక్కలు వేయించి, దాంట్లో టొమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించాలి. ఉడికిన టొమాటో ముక్కలను గరిటెతో చిదిమి, చల్లారనివ్వాలి. బాదం, జీడిపప్పులను వేయించి, పేస్ట్ చేసి, ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వేయించిన దినుసులను మిక్సర్ జార్‌లో వేసి, పొడి చేయాలి. దీంట్లోనే టొమాటో మిశ్రమం వేసి పేస్ట్ చేయాలి. స్టౌ పై పాన్ పెట్టి, టీ స్పూన్ నూనె వేసి వేడయ్యాక, టొమాటో మిశ్రమం, జీడిపప్పు పేస్ట్ వేసి, కప్పు నీళ్లు పోసి కలపాలి. దీంట్లో ఉప్పు, కారం వేసి మరో పది నిమిషాలు మరిగించాలి. మిశ్రమం బాగా చిక్కబడిన తర్వాత టోఫు ముక్కలు వేసి రెండు నిమిషాలు ఉడికించాలి. ఉప్పు, కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని, చివరగా కొత్తిమీర వేసి దించాలి. ఈ కర్రీ చపాతీలోకి, అన్నంలోకి రుచిగా ఉంటుంది. సోయ కబాబ్ కావలసినవి సోయాబీన్ పొడి - 100 గ్రా. బ్రెడ్ క్రంబ్ పౌడర్ - 100 గ్రా. అల్లం - చిన్నముక్క (సన్నగా తరగాలి) అల్లం, వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్ పచ్చిమిర్చి - 4 గరంమసాలా, జీలకర్ర పొడి - అర టీ స్పూన్ చొప్పున ఆమ్‌చూర్ పొడి (మార్కెట్లో లభిస్తుంది) మిరియాల పొడి - చిటికెడు ఉప్పు - తగినంత కొత్తిమీర తరుగు - టీ స్పూన్ నూనె - తగినంత తయారి: కడాయిలో నూనె వేసి, ఉల్లిపాయలు, అల్లం తరుగు, కొత్తిమీర, అల్లం-వెల్లుల్లి పేస్ వేయించాక కారం, గరం మసాలా, ఉప్పు వేసి కలపాలి. తర్వాత సోయాబీన్ పొడి, బ్రెడ్ క్రంబ్ పొడి వేసి కలిపి, వేయించాలి. ముద్దగా అయిన ఈ మిశ్రమాన్ని తగినంత తీసుకొని, చేతులతో మిర్చి బజ్జీ అంత సైజు చేయాలి. వీటిని బొగ్గుల మీద లేదా గ్రిల్‌లోనైనా కాల్చుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే చాకుతో మధ్యకు కట్ చేయాలి. వీటిని పుదీనా చట్నీతో సర్వ్ చేయాలి. కర్టెసీ: ప్రఫుల్‌కుమార్ నాయక్, ప్యాపిరస్ రిసార్ట్, తిమ్మాపూర్, మహబూబ్‌నగర్ ఫొటోలు:ఎస్.ఎస్.ఠాకూర్ | |||
all
-
స్త్రీ తన శరీరంలో మరో జీవికి ప్రాణం పోస్తున్న సమయం, అంటే గర్భవతిగా మారేటప్పుడు రకరకాల మార్పుల్ని శరీరం సూచిస్తుంది. సహజంగా ఈ మార్పులు సున్న...
-
అందం విషయంలో కేశాలు కూడా ప్రదానం. ఎందుకంటే అందమైన జుట్టు వారి అందాన్ని మరింత ఎక్కువగా చూపెడుతుంది. అందమైన అలలులా ఎగసిపడే జుట్టు మరియు పొడవ...
-
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న తర్వాత మహిళలు అంతకుమునుపు ఆహారం ఎలా తీసుకున్నా అప్పట్నుంచి మాత్రం తినే పదార్థాల్లో ఉప్పు, చక్...
-
బ్లడ్ ప్రెషర్(బిపి) అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో మారుతున్న జీవిన శెలితో పాటు ఆనారోగ్యాలు కూడా ఎక్కువవుతున్నాయి. అందులో...
-
తల్లిపాలు శిశువుకు అమృతంలాంటివి. తల్లిపాలు శ్రేష్టం, ఎంతో ముఖ్యమైన సంపూర్ణ పౌష్టిక ఆహారం. తల్లికి బిడ్డకు ఆరోగ్యవంతమైనది. ఇద్దరి మధ్య మంచి ...
-
డాక్టర్ని అడగండి నా వయసు 20. మలవిసర్జన సమయంలో మల ద్వారం నుంచి రక్తం పడుతోంది. మలవిసర్జనకు వెళ్లినప్పుడు లోనుంచి చిన్న ...
-
http://www.scribd.com/doc/119728850/DHYANAM-DANI-PADHATULU-SWAMI-VIVEKANANDA-SWAMI
-
తెలుగింటి ఆనవాళ్లు... ఆరుగజాల సొగసు చీరలు. తెలుగింటి కళలు... కమనీయకాంతుల చీరలు. తెలుగింటి సింగారాలు... సిరులొలికించే...
-
పాన్ లో ఉల్లిపాయలు ఎర్రగా వేగుతుంటే కొబ్బరి దానికి జతగా చేరితే పెరుగు ఒక అడుగు పసందుగా వేస్తుంది. మీగడ ఒద్దిగకగా ఒదిగిపోతుంది. ఇలంతా ఘుమ...
-
గైనిక్ కౌన్సెలింగ్ నేను ఇప్పుడు మూడో నెల గర్భవతిని. మా అమ్మమ్మ రోజూ పాలలో కుంకుమపువ్వు క...
Friday, November 30, 2012
రుచుల సోయగం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment