నవంబర్.. డిసెంబర్ మొదలైందంటే చాలు. చలి..చలి.. వాతావరణంలోని మార్పులతో పాటు శరీరంలో అనేక మార్పులకు చేటుచేసుకుంటుంది. అయితే ఇది ఈ మార్పులు పెద్దలకు మాత్రమే కాదు .. పిల్లల పట్లకూడా తీవ్రంగా ఉంటుంది. ఈ కాలంలో పిల్లలకు సంబంధించి పెద్దలకున్న అనేక సమస్యల్లో అసలు సమస్య పొద్దున్నే నిద్రలేవడం దగ్గర్నుంచి మొదలవుతుంది. పొద్దున్న ఎనిమిదవుతున్నా ఇంకా ముసుగులోని వెచ్చదనాన్ని విడిచిపెట్టి బయటకు రావడానికి ఇష్టపడని పిల్లల్ని ‘స్కూలుకి టైమ్ అవుతోందంటూ తిరిగి రొటీన్ లోకి తీసుకురావడానికి తల్లిదండ్రులు పడే అవస్థలు శీతాకాలంలో ప్రతి ఇంట్లోనూ సాధారణంగా కనిపించే దృశ్యాలు. ఇలా పొద్దున్నే లేవడమే కాదు, చలికాలంలో పిల్లలకు మరెన్నో సమస్యలు. వీటిలో ముఖ్యమైనవి ఆరోగ్యానికి సంబంధించినవి. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లల గురించి ఈ కాలంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
పిల్లలకు కాలాలతో పనిలేదు. కాలం ఏదైనా వారి ఆటలు, వారి ఐస్‌క్రీంలు, వారి చాక్లెట్లు, వారి కూల్‌డ్రింకులు వారివే. కాబట్టి తల్లిదండ్రులే ఈ విషయాలు గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఈ జాగ్రత్తలు ఏమిటో తెలుసుకొనే ముందు అసలు చలికాలంలోనే పిల్లలకు ఈ ఇబ్బందులు ఎందుకొస్తాయనే పరిజ్ఞానం తల్లిదండ్రులకు ఉండడం చాలా అవసరం.
చలికాలంలో పిల్లలపై ప్రభావం ఎలా ఉంటుంది: చలికాలంలో పిల్లల శరీరతత్వంలో జరిగే మార్పులు, వాతావరణంలో జరిగే మార్పులు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి.
1. చలికాలంలో ముఖ్యమైన మార్పు ఉష్ణోగ్రత పడిపోవడం. పెరిగిన చలితోపాటు, గాలితోడై చలిగాలులు శరీరానికి మరిన్ని ఇబ్బందులు కలిగిస్తాయి. శరీర ఉష్ణోగ్రత, బయటి ఉష్ణోగ్రతల్లో సమతుల్యత లోపించి సమస్యలు సృష్టిస్తుంది. శ్వాసకోశాలలో, సైనస్‌లతో, చర్మంమీద దాని ప్రభావం ఉంటుంది.
2. చలికాలం పిల్లల్లో ఆకలి తగ్గిస్తుంది. చిరుతిళ్ళపై పిల్లలకుండే సహజమైన ఆసక్తితో వాటిని తింటారేమోగానీ, నిజమైన పోషక విలువలు గల అసలైన భోజనం మాత్రం వారికి ఇష్టముండదు. తిండి తగ్గిపోవడంతో శరీరం లో శక్తి కూడా సన్నగిల్లుతుంది. రోగనిరోధక శక్తి తగ్గి రోగాలు తేలిగ్గా దాడిచేస్తాయి.
3. చలికాలం గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. అది రకరకాల వైరస్ లకు, బాక్టీరియాకి స్థావరమనే విషయం ప్రత్యేకంగా చెప్పనవ సరంలేదు. శ్వాస ద్వారా చలిగాలులతో పాటు వైరస్, బాక్టీరియా కూడా వచ్చి చేరుతాయి.
4. చలికాలంలో పగలు తక్కువ, రాత్రి ఎక్కువనే విషయం అందరికీ తెలిసిందే. ఈ కాలంలో సూర్యుడు తక్కువ సేపు ఉండడమే కాకుండాఎండ తీవ్రత కూడా తక్కువగా ఉంటుంది. సూర్యకాంతి మనిషిని శక్తి వంతం చేస్తుంది. ముఖ్యంగా పిల్లల్లో రోగనిరోధకశక్తి, విటమిన్ ‘డి' శక్తిని ప్రసాదించేది సూర్యుడే. చలికాలంలో పిల్లల శరీరాలు ఎండను గ్రహించడం తగ్గిపోవడంతో ఆలోపం కూడా కొన్ని వ్యాధుల విజృంభణకు అవకాశం ఇస్తుంది. తల్లిదండ్రులు పైన వివరించినట్టుగా చలికా లంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటే దానికి తగ్గట్టుగా ఏం జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం చాలా వరకు అర్థమైపోతుంది.
ఆహారం: చలికాలంలో పిల్లల ఆహారం విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పోషక విలువలు కలిగిన ఆహారం మూడు పూటలా పిల్లలు తీసుకునేలా చూడాలి. భోజనం వేడివేడిగా, తాజాగా ఉండేలా చూడండి. ఫ్రిజ్‌లో పెట్టినవి వేడి చేసి ఇవ్వడం వంటివి చేయకండి. భోజనంలో కూరగాయలు, ముఖ్యంగా దుంపకూరలు ఉండేట్టుగా చూడండి. క్యారెట్, బీట్‌రూట్, బంగాళదుంప, చిలకడదుంప మొదలైన దుంపలు కూరగా గాని లేదా ఉడకబెట్టిగాని పిల్లలకు పెట్టండి. ఇవి పిల్లల్లో మలబద్దకాన్ని పోగొట్టే ఫైబర్, రోగనిరోధక శక్తి పెంచే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతలను కాపాడుతాయి. చలికాలంలో ప్రత్యేకంగా పండే ఆకుకూరలలో చలికాలం ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన ప్రత్యేక ఔషధగుణాలు ఉంటాయి. వీటిలో ఉండే రకరకాల విటమిన్లు, ఒమెగా 3, ఫోలిక్ ఆసిడ్, కాల్షియం మొదలైనవి చర్మాన్ని పగలకుండా కాపాడుతాయి. వీటితో పాటు విటమిన్ ‘సి' గల పళ్ళు పిల్లలు ఎక్కువగా తినేలా చూడాలి. ఇవన్నీ తల్లిదండ్రులు పిల్లలతో తినిపించాల్సినవైతే ఇక వాళ్ళు తినకుండా చూడాల్సిన వాటిలో ముఖ్యమైనది ఫ్రిజ్ నీళ్లు. ఐస్‌క్రీంలు, పంచదార కలిసిన ఏదైనాసరే చలికాలంలో పిల్లలకు మంచిదికాదు. వాటిని పిల్లలు తినకుండా వీలైన జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది. చలికాలంలో వేడివేడి పల్లీలు గురించి చెప్పుకుంటుంటారు. నిజంగానే ఇవి పిల్లలకు ఎంతో మంచివి. చలికాలంలో వేయించిన పల్లీలులాంటి పప్పులు పిల్లలకు ‘ఇమ్యూన్ బూస్టర్'లుగా పనిచేస్తాయి.
దుస్తులు : చలికాలంలో కొన్ని స్కూళ్ళ యూనిఫాంలో స్వెట్టర్ లను కూడా జత చేశారంటే ఈ కాలంలో పిల్లలను చలి నుంచి కాపాడ్డానికి దుస్తులు విషయంలో ఎంత జాగ్రత్త వహించాలో తల్లిదండ్రులు ఆర్థం చేసుకోవాలి. మంకీ క్యాప్‌లు, స్వెటర్‌లు, కాళ్ళకు సాక్స్‌లు, రాత్రిపూట చలిని తట్టుకునే దుప్పట్లు వీటితో పాటు రెగ్యులర్ గా వేసే దుస్తులు కూడా చలికి తట్టుకునేవిగా ఉండేలా చూసుకోవాలి. కాటన్ జీన్స్, ఉన్ని దుస్తులనే ఎక్కువగా వాడాలి. లోదుస్తులు, పైన వేసుకునేవి ఎప్పుడూ పూర్తిగా పొడిగా ఉండేట్టు చూడాలి. తడిసిన దుస్తులు పిల్లల ఒంటిమీద ఎక్కువసేపు ఉండడం చలికాలంలో ఏమాత్రం ఆరోగ్యకరం కాదు. పిల్లలు మంకీక్యాప్, స్వెట్టర్‌లు వేసుకోడానికి మారాం చేస్తారు. లేదా వేసిన కాసేపటికే తీసివేస్తారు. అలా వారు చేయకుండా చిన్న చిన్న చిట్కాలు ఉపయోగించి తల్లిదండ్రులు వాటిని తీసేయకుండా కాపాడాలి. ఒకవేశ అవి వేసుకోవడానికి పిల్లలకు దురదలు, బిగుతుగా ఉండడం వంటి సమస్యలుంటే వాటిని పరిశీలించి, వారికి సౌకర్యంగా ఉండేలా వాటిని మార్చాలి. చలికాలంలో దుస్తులతో పిల్లలకు ఎలర్జీలు వంటివి రాకుండా ఉండే నాణ్యతగల వాటినే కొనాలి.
ఎండ: చలికాలంలో అందరూ తపించిపోయేది ఎండకోసమే. కాస్త వీలు దొరికితే ఎండలో నిలబడాలనే ప్రయత్నం చేస్తారు. శీతాకాలం సూర్యుడు తక్కువ ప్రతాపంతో, కొంతసేపే ఉంటాడు కాబట్టి, ఉన్న కొద్ది సేపట్లోనే అత్యధిక సూర్యకాంతిని పిల్లల శరీరానికి పట్టేలా తల్లిదండ్రులు చూడాలి. అందుకే పిల్లల్ని ఎంత ఎక్కువసేపు ఎండలో ఆడుకోనిస్తే అంతమంచిది. ఎండవలన శరీరానికి కేవలం వేడి పుట్టడమే కాకుండా, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలోని అవయవాలన్నీ ఎంతో ఆరోగ్యవం తంగా చురుకుగా పనిచేస్తాయి. ఎండలో నిలబడడం వలన విటమిన్ ‘డి' అనేది శరీరానికి పుష్కలంగా లభిస్తుంది. చలికాలం వైరస్‌లతో పోరాడడానికి ఇది ఎంతో మంచిది.
డాక్టర్‌ని నిర్లక్ష్యం చేయకండి: చలికాలంలో పిల్లలకు సర్వసాధారణంగా వచ్చే అనారోగ్యాలు దగ్గు, తుమ్ములు, జలుబు, చర్మం పగలడం. ఇవి చెప్పుకోడానికి, చూడ్డానికి, చిన్నవిగానే అనిపిస్తాయి. దాంతో తల్లిదండ్రులు తమకు తెలిసిన చిన్న చిన్న చిట్కా వైద్యాలను పిల్లల మీద ప్రయోగించే ప్రయత్నంచేస్తారు. వాటితోనే తగ్గిపోతుందనుకుంటారు. కానీ చలికాలంలో పిల్లలకి సోకే వైరస్‌లు మామూలు చిట్కాలకు తగ్గవు. పైగా తేమతో శ్వాసకోశాలు కూడా అనారోగ్య పాలవుతాయి. ఈ కాలంలో తరచుగా పిల్లల డాక్టర్‌ని సంప్రదించి, వారి సలహాలను అనుసరించి మందులు తప్పనిసరిగా వాడాలి. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులకు ఎదురయ్యే అనేక సవాళ్ళలో చలికాలంలో పిల్లల ఆరోగ్య పరిరక్షణ కూడా ఒకటి. తగిన జాగ్రత్తలతో, సూచించిన సలహాలతో ఈ చలికాలంలో కూడా పిల్లల్ని వెచ్చగా, ఆరోగ్యంగా ఉంచవలసిన బాధ్యత తల్లిదండ్రులదే.

No comments:
Post a Comment