ఆరోగ్యం వ్యక్తిత్వాన్నే కాదు వృద్ధాప్యాన్ని కూడా నిర్దేశిస్తుంది. రోజవారి జీవితంలో ఎదుర్యే సమస్యలు, మానసిక ఒత్తిడులు మన చర్మంపై కూడా ప్రభావం చూపిస్తాయి. అందుకే వయసుతో సంబంధం లేకుండా చర్మం ముడుతలు పడి, నిర్జీవంగా తయారవుతుంది. చర్మ సంరక్షణకు ఎంత విలువైన కాస్మొటిక్స్ వాడినా, మన శరీరంలో చర్మానికి కావలసిన హార్మోన్ ల ఉత్పత్తి సమపాళ్ళలో లేకపోతే ప్రయోజనం ఉండదు. అందుకే చర్మ సంరక్షణకు మనం తినే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చర్మానికి కావలసిన హార్మోన్ ల ఉత్పత్తి మెరుగుపడి చర్మం యవ్వనంగా ఉండటమే కాక కాంతిలీనుతూ ఉంటుంది. చర్మం కాంతివంతంగా ముడుతలు లేకుండా యవ్వనంగా నిగనిగలాడుతూ ఉండాలంటే కొన్ని ఆహారాలు తరచూ తప్పని సరిగా తీసుకొంటుండాలి. మరి అవేంటో చూద్దాం...
నట్స్: తాజా పండ్లకంటే ఎండిన పండ్లలో పోషకాలు అత్యధికంగా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ తో పాటు నట్స్ ను కూడా తరచూ తినడం వల్ల వింటర్ సీజన్ లో ఎదురయ్యే అనారోగ్య సమస్యలను ఎదుర్కోవడానికి ఇవి బాగా సహాయం చేస్తాయి. కాబట్టి స్నాక్స్ టైమ్ లో వీటికి ప్రాధాన్యత ఇవ్వడం మంచిది.