all

Friday, November 30, 2012

వేడినీళ్ళతో తలస్నానమా...?అయితే కేశాలు జాగ్రత్త...!

ప్రస్తుత కాలంలో రోజంతా పనితో, విపరీతమైన అలసటతో వేడెక్కిన బుర్ర ప్రశాంతంగా మారాలంటే వేడి నీటి కంటే మించిన మందు మరొకటి లేదు. ఆఫీసులో, వృత్తిజీవనంలో ఒళ్లు హూనం అయ్యాక ఇంటికి చేరగానే హాయిగా వేడినీటితో వీలైనంత ఎక్కువ సేపు స్నానం చేస్తే ఆ పని తాలూకూ ఒత్తిళ్లు మటుమాయం అవుతాయి. ఇంకా చెప్పాలంటే వేడినీటి స్నానంతో విసుగును, చిరాకును, వాష్ చేసేయవచ్చు. శరీరంలో ఇంద్రియాలన్నీ చురుగ్గా ఉండాలంటే వేడినీటి స్నానానికి మించి మరొక మందు లేదు.
hot water showers bad your hair

ఒకప్పుడు తలంటి స్నానం అంటే అది ఒక పెద్ద ప్రహసనంలా సాగేది. తలకే కాదు వంటికి కూడా నూనె రాసి, నలుగు పెట్టి మరీ స్నానం చేసేవారు. దీనితో అటు తల ఇటు శరీరం కూడా పరిశుభ్రమయ్యేవి. దీనివల్లే మసాజుల వంటివి ఆ కాలంలో తక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు అంతా హడావిడే.. అంతా ఇన్‌స్టాంట్‌.. ఒంటిమీద సోప్‌వాష్‌ పోసుకొని ఒళ్ళు రుద్దుకుని, షాంపూతో బరబరా తలరుద్దేసుకొని ఐదు నిమిషాలలోపే తలంటిని, స్నానాన్ని కూడా పూర్తి చేస్తున్నారు. కానీ స్నానమనే ప్రక్రియ రిలాక్సేషన్‌కు ఒక మంచి మందు.. ఇది భౌతిక, మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందనే విషయం బహుకొద్ది మందికి మాత్రమే తెలిసిన విషయం...
నలుగు పెట్టి స్నానం చేయడం వల్ల శరీరంలోని సెల్యులైట్‌ టోన్‌ అవుతుంది.. శరీరానికి కూడా మసాజ్‌ జరుగుతుంది. శరీరంలో రక్తసరఫరా పెరగడమే కాకుండా చర్మం నిగనిగలాడుతూ టోన్డ్‌గా ఆరోగ్యంగా కనుపిస్తుంది. వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల ఆ ఆవిరి రక్తనాళాలు విస్తరించేలా చేసి రక్తసరఫరాను పెంచుతుంది. రక్తసరఫరా బాగా జరిగినప్పుడు రక్తపోటు తగ్గడమే కాదు నరాలపై ఒత్తిడి కూడా తగ్గి ఆందోళన, ఒత్తిళ్లనుంచి వ్యక్తి బయటపడతాడు.
మంచి స్నానం నిద్ర పట్టేందుకు కూడా దోహదం చేస్తుంది. రాత్రి వేళల్లో నిద్ర పట్టక సమస్యలు ఎదుర్కొనే వారు గోరు వెచ్చటి నీటితో ఒక పది పదిహేను నిమిషాలు స్నానం చేస్తే శరీరానికి, మనస్సుకు రిలాక్సేషన్‌ వచ్చి నిద్ర ఇట్టే పట్టేస్తుందిట. వేడినీటి స్నానం చర్మాన్ని బలపరచి, చర్మంపైగల క్రిములను సంహరిస్తుంది. నూనె మర్దన శరీరంలో రక్తసరఫరా మెరుగుపరచి ఆరోగ్యవంతమైన చర్మాన్నిస్తుంది. శరీర వెనుక భాగ చర్మం, కండరాలు, భుజాలు, మొదలైనవి గట్టిగా బలపడుతాయి. వేడినీరు తగిలితే ఆ భాగాల లోని నొప్పులు, మంటలు మొదలైనవి తగ్గుతాయి.
అయితే ముఖంపైన, తలపైన వేడినీరు వాడటం వలన జుట్టు ఊడే ప్రమాదం కూడా వుంది. ఎందుకంటే వేడినీళ్లు తలలోని చర్మ రంధ్రాలను కూడా తెరచుకొనేలా చేస్తుంది. దాంతో హెయిర్ రూట్స్ కి హానీ కలిగి హెయిర్ ఫాల్ కి దారి తీస్తుంది. వేడీ నీళ్ళు కురులను బర్న్ చేస్తాయి. ఎందుకంటే కురులు ప్రోటీన్ తో తయారైయ్యేటటువంటి కెరోటిన్. కాబట్టి ప్రోటీన్ ఎక్కువగ నష్టంపోవడం వల్ల హెయిర్ ఫాల్ కు దారితీస్తుంది. సాధారణంగా ఆహారపదార్థాలను ఎక్కువ ఉడికించడం లేదా ఎక్కువ కాచడం వల్ల ప్రోటీనులు పూర్తిగా నాశనం అవుతాయి. అదే విధంగా వేడి నీళ్ళు తలకు తగలడం వల్ల కూడా తలలోని కురుకు సంబంధించిన ప్రోటీనులు నాశం అయ్యి హెయిర్ ఫాల్ కు దారితీస్తుంది.
షాంపూ మరియు వేడి నీళ్ళ చాలా చెడ్డ కాంబినేషన్. తలకు షాంపూ పట్టించేటప్పుడు గోరు వెచ్చని నీటి మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. వేడినీళ్ళకు, గోరువెచ్చని నీటికి చాలా వ్యత్యాసం ఉంది. అది తెలుసుకొని తలకు గోరువెచ్చని నీటిని ఉపయోగించాలి. తలకు కండిషన్ చేసిన తర్వాత కోల్డ్ షవర్ (చల్లనీటి స్నానం) చాలా అవసరం. చల్లనీటి స్నానంతో కురులు సున్నితంగా తయారవుతాయి. కాబట్టి హెయిర్ ఫాల్ ను అరికట్టి మంచి హెయిర్ గ్రోత్ ను ఆశించే వారు తలకు వేడినీటి స్నానం చేయకపోవడమే మంచిది. కాబట్టి శరీరానికి వేడి నీటి స్నానం ఎంత రిలాక్స్ ఇస్తుందో... తలకు చల్లనీటి స్నానం అంత రిలాక్స్ ఇస్తుంది

No comments: