చాలా నొప్పులు విశ్రాంతి లేక పొజిషన్ మార్పుతో తగ్గిపోతాయని తెలుసుకున్నాం. కొందరికి టాబ్లెట్ వేసుకోవడం ద్వారా మానసికంగా రిలీఫ్ దొరుకుతుంది. బరువులు ఎత్తే సమయంలో జాగరూకత వహించాలి.
ఎప్పుడు వైద్యుని సంప్రదించాలి?
1. రోజురోజుకూ నొప్పి ఎక్కువైనపుడు
2. కాళ్లలో తిమ్మిర్లు, ఒక కాలిలో తిమ్మిరి లేక నొప్పి ఉన్నపుడు
నడుమునొప్పి ఎలా ఉంటుంది?
నడుమునొప్పి మనిషిని కదలకుండా చేస్తుంది. అప్పటికప్పుడు భలే ఇబ్బంది పెడుతుంది. చాలావరకూ విశ్రాంతితో తగ్గిపోతుంది. కొంతమందిలో పొద్దున్నే లేచినపుడు నడుము పట్టిందనే ఫిర్యాదు ఉంటుంది. చాలావరకూ నొప్పులు కదలికతో ఎక్కువవుతాయి. విశ్రాంతి తీసుకున్నపుడు నొప్పులు చాలావరకూ తగ్గిపోతాయి. కంప్యూటర్‌పై పనిచేసేవారు గంటల తరబడి ఒకే పొజిషన్‌లో కూర్చోవడం వలన నడుమునొప్పి పెరుగుతుంది. మధ్యమధ్యలో లేచి తిరగడం, సరిగా కూర్చోవడం ద్వారా ఆ నొప్పిని అధిగమించొచ్చు.
కానీ, విశ్రాంతిలో ఉన్నా 'నొప్పి ఉన్నపుడు', పొజిషన్ మార్పుతో నొప్పి తగ్గనపుడు, ఎప్పుడూ నొప్పి అలాగే ఉన్నపుడు, రోజురోజుకూ ఆ నొప్పి పెరుగుతున్నపుడు... వైద్యుని సలహా, పరీక్షలు అవసరం. ఆ నొప్పికి కారణం తెలుసుకోవడం అవసరం. అది సరైన చికిత్స కొరకు తీసుకునే చర్య. అది మందులు కావచ్చు, శస్త్రచికిత్స కావచ్చు.
చాలా నొప్పులకు కారణం ఆహారంలో సరైన మాంసకృత్తులు లభించకపోవడం. కండరాల నొప్పి వల్ల కూడా నడుమునొప్పి రావచ్చు. విటమిన్ డి లోపం సరైన సమతుల్య ఆహారం అవసరం. పాలు, ఆకుకూరలు వంటివి తీసుకోవాలి. వారానికి రెండు, మూడుసార్లు చేప, మాంసం తీసుకోవడం వల్ల కండరాలు బలంగా ఉంటాయి. అలాంటప్పుడు ఏ 'నొప్పి' మనకు ఉండదు. శాఖాహారంలో పాలు, పప్పుధాన్యాలలో ప్రోటీన్స్ ఎక్కువగా దొరుకుతాయి.
మహిళలు అదేపనిగా పనిలోనే నిమగమైపోకుండా మధ్యమధ్యలో విశ్రాంతి తీసుకోవడం అవసరం. కుటుంబ అవసరాలే ముఖ్యం అనుకోకుండా తనపట్ల కూడా శ్రద్ధ వహించాలి. పోషకాహార ఆవశ్యకతనూ గుర్తించాలి. వ్యాయామానికి తగు సమయం కేటాయించాలి.

No comments:
Post a Comment