ఆరోగ్యాన్ని, అందాన్ని పెంచే సుగుణాలను తనలో నింపుకున్న నారింజను ఇంగ్లీషులో ఆరెంజ్ అని పిలుస్తుంటారు. పిల్లలు పెద్దలు ఇష్టంగా తినే పండ్లలో ఆరెంజ్ ఒకటి. దీనిలో పుష్కలంగా ఉండే సి విటమిన్ చర్మానికి నిగారింపు ఇస్తుంది. ఆరంజ్ లో ఫైబర్ శాతం ఎక్కువ కాబట్టి జ్యూస్ లా కాకుండా తొనలతో తినడమే మంచిది. తినడానికే కాదు, బ్యూటీ కేర్ కోసం కూడా ఆరంజ్ ఫ్రూట్ ని ఉపయోగించవచ్చు.
ఆరెంజ్‌లో ఉన్న సి విటమిన్, పొటాషియం మరియు ఫోలిక్ ఆసిడ్ కలిగివుండటం ద్వారా చర్మ సౌందర్యాన్ని మరింత మెరుగు పరుస్తుంది. స్కిన్ డామేజ్, ఎల్లో పిగ్మెంట్లకు ఆరెంజ్ జ్యూస్‌నో రోజూ తీసుకోవడం ద్వారా చెక్ పెట్టవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ప్రతి రోజూ 200 ఎం.ఎల్ ఆరెంజ్ జ్యూస్ తాగడం ద్వారా 60ఎంజీ విటమిన్ సి లభిస్తుందని పరిశోధనలో తేలింది. కాగా 200 మంది కాస్మెటిక్ ఎగ్జిక్యూటివ్ ఉమెన్‌పై ఈ పరిశోధన జరిగిందని యూకే కాస్మెటిక్ ఎగ్జిక్యూటివ్ ఉమెన్ వెల్లడించింది. శీతాకాలంలో ఆరెంజ్ ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. కాబట్టి శీతాకాలంలో వీటిని తీసుకోవడం వల్ల అటు అరోగ్యంతో పాటు, చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. మరి ఈ ఆరోగ్య ప్రధాయిని ఆరెంజ్ ఈ చలికాలంలో చర్మాన్ని ఏవిధంగా రక్షిస్తుందో చూద్దాం...
ఆరెంజ్ ఫేస్ ప్యాక్: ఇది తయారు చేయడం చాలా సులభం. మీరు దీన్ని పేస్ట్ చేయాల్సిన పనిలేదు. ఆరెంజ్ తొనలను తొలగించి వాటితో ముఖానికి మసాజ్ చేయాలి అంతే. ఇలా మర్ధన చేసిన పది నిముషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం టైట్ గా మర్చుతుంది. ముఖంలో జిడ్డును తొలగిస్తుంది. కాంతివంతంగా మార్చుతుంది . వయస్సు పైబడినట్లు కనబడనియ్యదు. ఇలా ప్రతి రోజూ స్నానం చేసే ముందు రెగ్యులర్ గా చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.
ఆరెంజ్ జ్యూస్ మరియు పాలు: చర్మాన్ని శుభ్రం చేయడంలో ఇది చాలా ముఖ్యమైనది. ఈ హోంమేడ్ ఫేస్ ప్యాక్ డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. ఇంకా బ్లాక్ హెడ్స్ తొలగించి చర్మాన్ని ప్రకాశంవంతంగా మార్చుతుంది. ఆరెండింటిని మిక్స్ చేసి ముఖానికి పట్టించి మసాజ్ చేసి, పది నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. దాంతో ముఖంలో మెరుపు సంతరించుకుంటుంది.
ఆరెంజ్ తొక్క మరియు పెరుగు: పేస్ స్క్రబ్ లో ఇది మరోక గొప్ప ప్రయోగం. ఈ ఫేస్ స్ర్క్ ఇటు మహిళలకు అటు పురుషులకు ఇద్దరికీ బాగా పనిచేస్తుంది. ఆరెంజ్ తొక్కను ఎండలో బాగా ఎండబెట్టి తర్వాత మెత్తగా పౌడర్ చేసి, ఇట్లో స్టోర్ చేసుకొని సమయం దొరికినప్పుడల్లా ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ అప్లై చేయొచ్చు. దాంతో ముఖంలో నల్ల మచ్చలు, మొటిమలు పూర్తిగా తొలగిపోతాయి.
ఆరెంజ్ జ్యూస్-నిమ్మరసం-పెరుగు: సాధారణంగా హోంమేడ్ ఫేస్ ప్యాక్ లో ఎక్కువగా ఉపయోగించేటటువంటి సాధారణ పదార్థాలు పెరుగు, నిమ్మరసం. వీటితో పాటు ఆరెంజ్ జ్యూస్ ను కూడా మిక్స్ చేయడం వల్ల చర్మ సంరక్షణకు అద్భుతంగా పనిచేస్తుంది. ఇది సన్ బర్న్ నుండి కాపాడి చర్మాన్ని తెల్లగా మార్చుతుంది.
ఆరెంజ్ తొక్క మరియు ఓట్స్ స్క్రబ్: ఈ చాలా సులభమైనటువంటి చిట్కా. చర్మాన్ని నేచురల్ గా, క్లియర్ గా మార్చడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఈ రెండిటి మిశ్రమాన్ని వారానికి రెండు సార్లు అప్లై చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించడం తో పాటు, బ్లాక్ హెడ్స్, మచ్చలను తొలగించి ప్రకాశంవంతంగా మార్చుతుంది.

No comments:
Post a Comment